By: ABP Desam | Updated at : 27 Nov 2022 11:12 AM (IST)
డిసెంబర్ నెలలో భూమి మీదకు ఏలియన్స్
Time Traveller Prediction: టైమ్ ట్రావెలింగ్.. ఇది ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన సబ్జెట్ అనే చెప్పాలి. ఎందుకంటే.. మనం ఉన్నపళంగా మన చిన్నతనంలోకి లేదా మన ఫ్యూచర్‌లోకి వెళ్లాలన్న డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. రియల్ లైఫ్‌లో ఇలా టైమ్ ట్రావెలింగ్ చేయడం సాధ్యం కాదు కానీ.. చాలా సినిమాలో ఇలాంటి సీన్లను చూశాం. టైమ్ మెషీన్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు.
1991లో హీరో బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమాతో మొదలుకుని శర్వానంద్ లేటెస్ట్ మూవీ ఒకే ఒక జీవితం సినిమా వరకు ఈ టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ చాలా బాగా చూపించారు. కానీ సినిమాలో సాధ్యమైన టైమ్ ట్రావెలింగ్.. నిజ జీవితంలో ఎవరికీ సాధ్యం కాదనే చెప్పాలి. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం తాము టైమ్ ట్రావెలింగ్ చేసి వచ్చామంటూ చెప్పుకున్నారే తప్ప.. అందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు అయితే చూపించలేదు. అయితే ఇప్పుడు అలాంటి ఓ వ్యక్తి సంబంధించిన వార్తే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఎనో అలారిక్ (Eno Alaric)అనే వ్యక్తి.. తాను ఓ టైమ్ ట్రావెలర్ అని 2671వ సంవత్సరం నుంచి వచ్చానంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, 2022 డిసెంబర్ 08వ తేదీన తాను ఏలియన్స్‌ను కలుసుకోబోతున్నట్లు తెలిపాడు. అయితే ఇది ఎంత వరకు నిజం.. ఇంతకీ అతడు ఎవరన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే ఎనో అలారిక్ ఓ టిక్‌టాక్ అకౌంట్ ఉంది. దాని పేరు రేడియంట్ టైమ్ ట్రావెలర్ (Radiant Time Traveler). అయితే కొద్ది రోజుల క్రితం ఇతడు తన టిక్ టాక్ అకౌంట్‌లో ఓ పోస్ట్ పెడుతూ.. దానికి క్యాప్షన్‌గా "attention" అని పెట్టి.. "Yes, Iam A Real Time Traveler From The Year 2671, Remember These Date December 08" అని చెప్పుకొచ్చాడు. ఓ భారీ UFOలో ఏలియన్స్ వస్తున్నారని, ఓ ముఖ్యమైన విషయం నాతో మాట్లాడటానికి వస్తున్నారని తెలిపాడు అలారిక్. అంతేకాదు.. అలారిక్ ఇంకో విషయాన్ని ప్రిడిక్షన్ చేస్తూ.. 2023 మే 15వ తేదీన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ పెద్ద సునామీ రాబోతుందని, ఈ సునామీలో అలల ఎత్తు సుమారు 750 అడుగుల వరకు ఉండబోతుందని తెలిపాడు. ఒకవేళ ఇలాంటి సునామీ నిజంగానే వస్తే మాత్రం ఫ్రాన్సిస్కో ప్రాంతం మొత్తం మునిగిపోతుంది. అయితే ఇలాంటి ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చాలా మంది టైమ్ ట్రావెలర్స్ చేశారు. కానీ ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు నిజయం కాలేదు.
ఇక 2015లో కూడా ఓ మహిళా టైమ్ ట్రావెలర్ కూడా ఓ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. అమెరికాకు చెందిన ఓ మాజీ ఎయిర్ ఫోర్స్ వర్కర్ మాట్లాడుతూ.. తనను ఏలియన్స్ చంద్రుడి మీదకు ఎత్తుకెళ్లి మరీ రేప్ చేశారని చెప్పింది. అయితే ఇలా తనను ఏలియన్స్ ఎత్తుకెళ్లడం మొదటిసారి కాదని, గతంలో చాలా సార్లు తనన కిడ్నాప్ చేశారని తెలిపింది. దీంతో తాను బలవంతంగా ఏలియన్స్‌తో శృంగారంలో పాల్గొనవలసి వచ్చిందని చెప్పింది. తనను ఏనిమిది నుంచి పదిసార్లు ఏలియన్స్ తీసుకు వెళ్లాయని, నెలల పాటు ఉంచుకున్నాయని చెప్పింది. చంద్రుడి పైకి తీసుకు వెళ్లి రేప్ చేశాయని పేర్కొంది. కాగా, ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈ వార్త అప్పట్లో చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక చాలా ఏళ్ల తర్వాత తాజాగా అలారిక్ ఏలియన్స్ భూమి మీదకు వస్తున్నాయంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.
Earth Inner Core Slowing Down: వామ్మో, వేగం తగ్గిన భూమి ఇన్నర్ కోర్ - ముప్పు తప్పదా?
Pakistani Rupee: దివాళాకు దగ్గరగా పాకిస్థాన్- అథఃపాతాళానికి కరెన్సీ విలువ!
Mike Pompeo: భారత్‌పై అణు దాడికి పాకిస్థాన్ ప్లాన్- సంచలన విషయాలు వెల్లడించిన అమెరికా మాజీ మంత్రి
China Crime News: కిలేడీ మాస్టర్ ప్లాన్ - కోట్లు దోచేసి తప్పించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ, 25 ఏళ్ల తరువాత అరెస్ట్
Pakistan Economic Crisis: కడుపు నిండా ఫుడ్ లేదు- కంటి నిండా నిద్ర లేదు- రోజుకో సమస్యతో అల్లాడుతున్న పాకిస్థాన్!
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!