అన్వేషించండి

Iran vs Israel: ఇరాన్-ఇజ్రాయెల్‌ పోరు తీవ్రం- టెహ్రాన్ ఇంటెలిజెన్స్ అధికారులు మృతి- ట్రంప్‌పై హత్యాయత్నం చేశారని నెతన్యాహు ఆరోపణలు 

Iran vs Israel: పశ్చిమాసియాలో పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్‌ ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడులు చేసుకుంటున్నాయి. ఈ దాడుల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.

Iran vs Israel: ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య పోరు తీవ్రం అవుతోంది. తాజాగా జరిపిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు మృతి చెందారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్ ప్రయత్నించిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరో బాంబు పేల్చారు. దీనిపై ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. 

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌ నిద్రపట్టడం లేదు. మరోసారి బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో టెహ్రాన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారుల్లో కీలక వ్యక్తులు ప్రాణాలు పోయాయి. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ కజెమి, డిప్యూటీ జనరల్ హసన్ మొహాకిక్ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం.  

మరో బాంబు పేల్చిన నెతన్యాహు 
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ... ఇరాన్ ఇస్లామిక్ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తమ అణు కార్యక్రమానికి ముప్పుగా గుర్తించి హత్య చేయడానికి పని చేసిందని ఆరోపించారు. "వారు ఆయనను చంపాలనుకుంటున్నారు. ఆయన నంబర్ వన్ శత్రువు" అని అన్నారు అని ఫాక్స్ న్యూస్ చెప్పుకొచ్చింది.  

తాను కూడా ఇప్పుడు హిట్‌ లిస్ట్‌లో ఉన్నానని అని నెతన్యాహు ఫాక్స్ న్యూస్‌తో అన్నారు. తన దేశం అణు విధ్వంసం ముప్పును ఎదుర్కొంటుందని అందుకే దూకుడుగా వ్యవహరించడం తప్ప వేరే మార్గం లేదని నెతన్యాహు అన్నారు. "మేము ముప్పును ఎదుర్కొంటున్నాము" అని ఆయన అన్నారు. దాడులతో ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడమే కాకుండా ప్రపంచాన్ని కూడా రక్షిస్తోందన్నారు. 

ఇజ్రాయెల్ దాడి ఇరాన్ అణు కార్యకలాపాలను కొంతవరకు వెనక్కి తగ్గేలా చేశాయని నమ్ముతున్నట్టు నెతన్యాహు అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాలకులతో చర్చలు ఎక్కడా జరగడం లేదని చెప్పుకొచ్చారు. ఇరాన్ ప్రపంచానికి విసురుతున్న అణు,  బాలిస్టిక్ క్షిపణి సవాల్‌ను తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధంగా ఉందని అన్నారు.

ఆపరేషన్ రైజింగ్ లయన్‌గా పిలుచుకునే ఆపరేషన్‌ను "చరిత్రలో గొప్ప సైనిక కార్యకలాపాలలో ఒకటి"గా నెతన్యాహు అభివర్ణించారు. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.... ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తామని చాలా కాలంగా బెదిరించిన అదే ఇస్లామిక్ పాలన ద్వారా వారు 50 సంవత్సరాలుగా అణచివేతకు గురవుతున్నారని ఆయన అన్నారు.

శాంతి నెలకొంటుంది: ట్రంప్‌

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని, అది జరుగుతుందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. భారత్‌, పాకిస్తాన్‌తో చేసినట్లుగానే ఇక్కడ కూడా పరిస్థితులు చక్కదిద్దుతాని తెలిపారు. దీని కోసం అమెరికా వాణిజ్య అంశాన్ని తెరపైకి తీసుకురావచ్చని తెలుస్తోంది. 
వేర్వేరు దేశాల్లో ఉన్న పరిస్థితులను డొనాల్డ్ ట్రంప్ వివరించారు. సెర్బియా, కొసావో అనేక దశాబ్దాలుగా కొట్టుకుంటున్నాయని ఇది కూడా యుద్ధంగా మారడానికి సిద్ధంగా ఉన్న టైంలో ఆపాను అన్నారు. బైడెన్ మూర్ఖపు నిర్ణయాలతో దీర్ఘకాలిక అవకాశాలను దెబ్బతీశారని, కానీ నేను దానిని మళ్ళీ పరిష్కరిస్తానని ఆయన అన్నారు. నైలు నదిని ప్రభావితం చేస్తున్న భారీ ఆనకట్టపై ఈజిప్ట్,  ఇథియోపియా మధ్య పోరాటం కూడా తన జోక్యంతో ఆగిపోయిందని అన్నారు. అలానే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య త్వరలో శాంతి నెలకొంటుందని ట్రంప్ అన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో చాలా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. చాలా చేస్తాన్నట్టు చెప్పుకొచ్చారు. అయినా సరే దేనికీ క్రెడిట్ తీసుకోను అంటూ తెలిపారు.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget