అన్వేషించండి

Ukraine Russia War: ఉక్రెయిన్‌ ప్రయాణికుల రైలుపై రష్యా డ్రోన్ దాడి - పరస్పర దాడులతో మళ్లీ భయానకం !

Russian savage attack: రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ లోని పౌరులను టార్గెట్ చేసుకుంటోంది. ఓ రైలుపై బాంబుల వర్షం కురిపించడంతో 30 మందికి పైగా గాయాలయ్యాయి.

Russia attack on passenger train in Ukraine:   రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత తీవ్రం అవుతోంది.  ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలోని ఒక రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యన్ దళాలు డ్రోన్‌లతో దాడి చేశాయి. ఈ దాడి సమయంలో కీవ్‌కు వెళ్తున్న ఒక ప్రయాణికుల రైలుపై బాంబులు పడ్డాయి. ఫలితంగా, రైల్‌లోని కొన్ని బోగీలు మంటల్లో కాలిపోయాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రాణ నష్టం గురించి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.  

ఈ దాడి శుక్రవారం  మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో జరిగింది. సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్ వద్ద ఆగి ఉన్న ప్రయాణికుల రైలును రష్యన్ షాహెద్-136 డ్రోన్‌లతో లక్ష్యం చేసుకున్నారు. డ్రోన్‌ల నుండి విడుదలైన బాంబులు రైల్ బోగీలపై పడ్డాయి, మంటలు ఎగిసిపడ్డాయి. స్థానిక మీడియా ప్రకారం, రైల్‌లో 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.   మంటలు అరికట్టడానికి ఫైర్ ఇంజిన్‌లు, రెస్క్యూ టీమ్‌లు  ప్రయత్నం  చేశాయి.  గాయపడినవారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది.  వారిని సమీప ఆసుపత్రులకు తరలిసంచారు. 
  
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఘటనా స్థలంలోని దృశ్యాలను పోస్ట్ చేస్తూ, "సుమీ ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌పై రష్యా డ్రోన్ దాడులు జరిపింది. ఇందులో అనేక మంది గాయపడ్డారు. సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోంది.  ఈ ఉన్మాద ప్రవర్తన పట్ల ప్రపంచం నిర్లక్ష్య ధోరణి వహించకూడదు. ప్రతి రోజూ రష్యా ఎంతో మంది ప్రాణాలు తీస్తోంది. యుద్ధం పరిష్కారం కోసం ఐరోపా, అమెరికా నుంచి ఎన్నో ప్రకటనలు వింటున్నాం. కానీ, మాకు మాటల సాయం సరిపోదు. బలమైన చర్యలు అవసరం  అని వ్యాఖ్యానించారు. జెలెన్‌స్కీ ఈ దాడిని "యుద్ధ నేరం"గా పేర్కొని, అంతర్జాతీయ సంఘాలను చర్యలు తీసుకోవాలని కోరారు.   

 
2022లో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇటీవల రష్యా తన షాహెద్-136 డ్రోన్‌లను ఉక్రెయిన్‌లోని పౌరుల లక్ష్యాలపై ఎక్కువగా ఉపయోగిస్తోంది. సుమీ ప్రాంతం రష్యా సరిహద్దుకు సమీపంలో ఉండటంతో, ఇక్కడ దాడులు తరచూ జరుగుతున్నాయి. గత వారంలో ఉక్రెయిన్‌లో 50కి పైగా డ్రోన్ దాడులు జరిగాయి, వీటిలో చాలా శివారులు, పౌరుల లక్ష్యాలు. ఉక్రెయిన్ డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకారం, ఈ దాడుల్లో 100 మందికి పైగా పౌరులు మరణించారు. రష్యా ఈ దాడులను "సైనిక లక్ష్యాలపై" అని చెబుతోంది, కానీ ఉక్రెయిన్ అధికారులు ఇవి "పౌరులపై ఉద్దేశపూర్వక దాడులు" అని ఆరోపిస్తున్నారు. ఐరోపా యూనియన్, అమెరికా వంటి దేశాలు ఈ దాడిని ఖండించాయి.   

టాప్ హెడ్ లైన్స్

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఆందోళన! అర్థరాత్రి అడియాల నుంచి ఆసుపత్రికి తరలింపు!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget