అన్వేషించండి

Prophet Muhammad Row: భారత్‌కు కువైట్ షాక్- మన దేశ ఉత్పత్తుల అమ్మకాలపై నిషేధం!

Prophet Muhammad Row: భారతీయ ఉత్పత్తుల అమ్మకాలపై కువైట్‌ నిషేధం విధించింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణంగా పేర్కొంది.

Prophet Muhammad Row: ఇటీవల పార్టీ నుంచి సస్పెండైన భాజపా నేతలు నుపూర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్.. మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా భారత్‌పై పలు ముస్లిం దేశాలు విమర్శలు చేస్తున్నాయి.

సౌదీ అరేబియా, ఒమన్‌, ఖతార్‌, కువైట్‌ వంటి దేశాలు ఈ వ్యాఖ్యలపై నిరసన తెలిపాయి. అయితే తాజాగా కువైట్ వ్యాపార సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారతీయ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేశాయి.

నిషేధం

కువైట్‌ సిటీలోని అల్-అర్దియా కో-ఆపరేటివ్ సొసైటీ స్టోర్ ర్యాకుల నుంచి ఇండియన్‌ టీ, ఇతర ఉత్పత్తులను తొలగించారు. అలాగే కువైట్‌ నగరం వెలుపల ఉన్న ఒక సూపర్‌ మార్కెట్‌లోని ర్యాకుల్లో ఉన్న రైస్‌, ఇతర భారతీయ ఉత్పత్తులపై ప్లాస్టిక్‌ కవర్లు కప్పారు. 'భారతీయ ఉత్పత్తులను తొలగించాం' అని అక్కడ నోటీస్‌ ఉంచారు.

ప్రవక్తపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడాన్ని కువైటీ ముస్లిం ప్రజలు ఏ మాత్రం సహించరని ఆ స్టోర్‌ సీఈవో నాసర్‌ అల్-ముతైరి తెలిపారు. తమ సంస్థకు చెందిన అన్ని స్టోర్లలో భారతీయ ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేసినట్లు చెప్పారు.

ఖతార్ నోటీసులు

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఖతార్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, ఇందుకు భారత ప్రభుత్వం బహిరంగంగా ఖండించాలని కోరింది. ఈ మేరకు ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత రాయబారి దీపక్ మిట్టల్‌కు అధికారిక నోట్ అందించింది. ప్రవక్త మహమ్మద్‌పై బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు నోట్ లో పేర్కొంది. ఈ వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై మిట్టల్ స్పందిస్తూ ఈ ట్వీట్లు భారత ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించవని తెలిపారు. అవి వ్యక్తిగత అభిప్రాయాలు అని తెలిపారు. 

Also Read: Indian currency: కరెన్సీ నోట్లపై ఆర్‌బీఐ క్లారిటీ- ఆ వార్తలు నిజం కాదట

Also Read: Russia–Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి 100 రోజులు- భారత్‌ ఎంత నష్టపోయిందో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

నెతన్యాహు జాతకం: ఇజ్రాయెల్ ప్రధాని పీఠంపై గ్రహగండం? తదుపరి ప్రధాని ఎవరు?
నెతన్యాహు జాతకం: ఇజ్రాయెల్ ప్రధాని పీఠంపై గ్రహగండం? తదుపరి ప్రధాని ఎవరు?
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు.. రిపబ్లికన్లు వెనుకంజపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శపిస్తానంటున్న కేఏపాల్
ఇజ్రాయెల్ ఎన్నికలు 2026: నెతన్యాహు కోట కూలుతుందా? జ్యోతిష్య సూచనలు!
ఇజ్రాయెల్ ఎన్నికలు 2026: నెతన్యాహు కోట కూలుతుందా? జ్యోతిష్య సూచనలు!
US Iran Tensions: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. ఒప్పందం కుదరకపోతే ఇవాళే దాడి తప్పదంటూ ట్రంప్ వార్నింగ్
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు.. ఒప్పందం కుదరకపోతే ఇవాళే దాడి తప్పదంటూ ట్రంప్ వార్నింగ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Metro Combined Pass: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
Kandula Durgesh: మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Vantara: మెరుగైన వైద్యం కోసం ఏనుగు పిల్ల మాయను కేరళ నుంచి వంతారాకు ఎయిర్‌లిఫ్ట్
మెరుగైన వైద్యం కోసం ఏనుగు పిల్ల మాయను కేరళ నుంచి వంతారాకు ఎయిర్‌లిఫ్ట్
KA Paul: రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Embed widget