అన్వేషించండి

Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు

Bhotekoshi River Flood | భోటెకోషి నది ఉగ్రరూపం దాల్చడంతో వరదల్లో వందల మంది గల్లంతయ్యారు. ఉత్తర నేపాల్‌లో వచ్చిన ఈ తీవ్ర వరద సరిహద్దు ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చైనా సరిహద్దులో భోటెకోషి నది వరదలు భారీ విధ్వంసం సృష్టించాయి.
  • 384 మంది పర్యాటకులు గల్లంతు; వారిలో 105 మంది భారతీయులు.
  • జలవిద్యుత్ కేంద్రాలు, రహదారులు దెబ్బతిన్నాయి; 25 మంది రక్షణ.
  • నేపాల్‌ భారత్, చైనా నుండి సహాయం కోరింది.

Nepal Floods: చైనా సరిహద్దు సమీపంలో నేపాల్‌లో ఉన్న భోటెకోషి నదికి వచ్చిన వరద భారీ విధ్వంసం సృష్టించింది. నది ఉప్పొంగి మెరుపు వరదలు రావడంతో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ విపత్తులో 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని,  వీరిలో 291 మంది విదేశీయలు ఉన్నారు. అందులో 105 మంది భారతీయులు ఉన్నారని నేపాల్ టూరిజం బోర్డ్ వెల్లడించింది. మరో 37 మంది ఎన్నారైలు ఉన్నారు. గల్లంతయిన వారిలో 93 మంది నేపాల్ పౌరులు ఉన్నారు. 

భోటెకోషి నది వరదల్లో పలు జల విద్యుత్ కేంద్రాలు, భారీ నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. వందలాది మంది గల్లంతు కావడంతో ఈ జల ప్రళయం వల్ల సంభవించిన నష్టాన్ని అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. గల్లంతైన వారి కోసం పెద్ద ఎత్తున సహాయ, రక్షణ చర్యలు చేపట్టారు. నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటెకోషి నదిలో వచ్చిన ఆకస్మిక వరద కారణంగా బుధవారం తెల్లవారుజామున మధ్య నేపాల్‌లోని పలు ప్రాంతాలు ప్రభావితమయ్యాయి.

భోటెకోషి నది ఒడ్డున ఉన్న రహదారులు, వంతెనలు, మార్కెట్లు, భద్రతా చెక్‌పోస్టులు దెబ్బతిన్నాయి. నేపాల్ ఆర్మీ ప్రతినిధి ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం వరకు 25 మందిని సురక్షితంగా రక్షించారు. నేపాల్ సైన్యం, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (APF), నేపాల్ పోలీస్ సిబ్బంది సహాయ, రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. దూర ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని వేగంగా చేరుకోవడానికి 14 హెలికాప్టర్లను కూడా మోహరించారు.

నేపాల్‌లో భారీ విధ్వంసం

అకస్మాత్తుగా భోటెకోషి నదికి వచ్చిన ఈ వరద తర్వాత ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయ, రక్షణ పనులు ప్రారంభించినట్లు నేపాల్ ఆర్మీ తెలిపింది. ఉత్తర నేపాల్‌లో సంభవించిన తీవ్ర వరద సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర నష్టం కలిగించిందని అధికారులు తెలిపారు. నది ప్రవాహం ఉన్న అనేక జిల్లాల్లో హై అలర్ట్‌ ప్రకటించి, ప్రజలతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పాల్ ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల కోసం భారత్, చైనా నుంచి కూడా సహాయం కోరింది.

క్యాబినెట్ నిర్ణయాల గురించి సమాచారం ఇస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ రెండు దేశాలతో సమన్వయం చేసి సహాయ సహకారాల కోసం చూస్తుందని ప్రభుత్వ ప్రతినిధి సస్మిత్ పోఖ్రెల్ తెలిపారు. నివేదికల ప్రకారం, నేపాల్- చైనా సరిహద్దు సమీపంలోని తిమురే ప్రాంతంలో ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన సిబ్బంది 9 మంది వరదల్లో గల్లంతైనట్లు తెలుస్తోంది. 

 

Frequently Asked Questions

నేపాల్‌లో వరదలు ఎక్కడ సంభవించాయి?

చైనా సరిహద్దు సమీపంలోని భోటెకోషి నదికి వరదలు వచ్చాయి. ఇది మధ్య నేపాల్‌లోని రసువా జిల్లాలోని పలు ప్రాంతాలను ప్రభావితం చేసింది.

వరదల కారణంగా ఎంత మంది పర్యాటకులు గల్లంతయ్యారు?

మొత్తం 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. వీరిలో 291 మంది విదేశీయులు, 105 మంది భారతీయులు ఉన్నారు.

నేపాల్ వరదల వల్ల జరిగిన ప్రధాన నష్టం ఏమిటి?

జల విద్యుత్ కేంద్రాలు, రహదారులు, వంతెనలు, మార్కెట్లు, భద్రతా చెక్‌పోస్టులు ధ్వంసమయ్యాయి. భారీగా ప్రాణనష్టం, వందలాది మంది గల్లంతయ్యారు.

వరద బాధితుల కోసం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు?

నేపాల్ సైన్యం, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం 14 హెలికాప్టర్లను మోహరించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Elon Musk: అమెరికాలోని ప్రతి బిడ్డకు స్పేస్‌ఎక్స్ షేరు.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన
అమెరికాలోని ప్రతి బిడ్డకు స్పేస్‌ఎక్స్ షేరు.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన
Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
Renault Duster Hybrid లాంచ్.. 29 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ధర హైదరాబాద్‌లో ఎంతంటే
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Embed widget