Flights Cancel: మైక్రోసాఫ్ట్ విండోస్ ఎఫెక్ట్, 300కు పైగా విమాన సర్వీసులు రద్దు చేసిన ఇండిగో
Microsoft outage issue | మైక్రోసాఫ్ట్ ఇండోస్ సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సహాలు పలు రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఇండిగో సంస్థ 300కు పైగా సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది.
IndiGo cancels almost 300 flights | మైక్రోసాఫ్ట్ విండోస్ (Microsoft Crowdstrike)లో ఏర్పడిన టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది. పలు దేశాలతో పాటు భారత్‌లోనూ పలు నగరాలలో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాధారణ ఎయిర్ పోర్టులలో మాన్యువల్ గా సిబ్బంది పనిచేసి, ఆలస్యంగానైనా విమానాలు నడిపారు.
అంతర్జాతీయ విమనాశ్రయాల్లో ప్రయాణికులకు నరకం కనిపించింది. సిబ్బంది ఎంత ప్రయత్నించినా, కొన్ని విమాన సర్వీసులు మాత్రమే రన్ చేయగలిగారు. మైక్రోసాఫ్ట్ విండోస్ బ్లూ ఎర్రర్ మెస్సేజ్ ప్రాబ్లమ్ కారణంగా 300లకు పైగా విమాన సర్వీసుల్ని రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. జులై 19, 20 తేదీల్లో ఆయా విమాన సర్వీసులు తప్పని పరిస్థితుల్లో రద్దు చేయాల్సి వచ్చిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఈ సమస్య ఎదుర్కొంటున్న కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రద్దయిన విమాన సర్వీసుల్లో టికెట్లు బుక్ చేసుకున్న వారు.. ప్రస్తుత పరిస్థితుల్లో టికెట్ మళ్లీ బుక్ చేసుకునే అవకాశం, రీఫండ్ సదుపాయం అందుబాటులో లేదని స్పష్టం చేసింది. రద్దయిన విమాన సర్వీసులు ఇవే
తెలంగాణలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో, ఏపీలో గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గన్నవరంలో తక్కువ విమాన సర్వీసులు కనుక మాన్యువల్ గా చెకింగ్ చేసి కొంచెం ఆలస్యంగానైనా సర్వీసులు నడుపుతన్నట్లు ఎయిర్ పోర్ట్ అధికారి తెలిపారు. కానీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆ పరిస్థితి కూడా ఉండదు. అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో భారీ సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. అయితే తాము ఎయిర్ పోర్టుకు చేరుకున్నాక విమాన సర్వీసు రద్దు చేసినట్లు విమాన సంస్థలు చెబుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.
కాల్ సెంటర్‌ను సంప్రదించండి, ఎయిర్‌పోర్టుకు రావద్దు
విమాన సర్వీసులకు నడపడంలో సమస్య తలెత్తడంతో ప్రయాణికులకు ఇండిగో ఓ అడ్వైజరీ జారీ చేసింది. సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగాలు పలు దేశాలలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యం, రద్దు అవుతున్నాయని చెప్పారు. అందువల్ల విమాన సర్వీసుల రీ షెడ్యూల్‌లోనూ అంతరాయం కలుగుతోంది. కనుక ప్రయాణికులు అత్యవసరమైతే తప్పా ఎయిర్ పోర్టుకు రాకూడదని, కాల్ సెంటర్ నెంబర్‌లో సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. టెక్నికల్ ప్రాబ్లమ్ క్లియర్ అయితే విమాన సర్వీసులు యథాతథంగా నడుస్తాయని, అప్పటివరకూ కొంచెం ఓపిక పట్టాలని తమ ప్రయాణికులను ఇండిగో ఓ ప్రకటనలో కోరింది.
Also Read: Microsoft Server Outage: మైక్రోసాఫ్ట్‌లో వచ్చిన సాంకేతిక సమస్య ఇదే, ఈ స్థాయిలో ప్రభావం పడింది అందుకే!
సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయింది, ట్విట్టర్ (X), ఫేస్ బుక్ డౌన్ అయిందని అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. శుక్రవారం సైతం మైక్రోసాఫ్ట్ విండో లో లోపం అనగానే సోషల్ మీడియా ఛానల్స్ తరహాలో కొన్ని నిమిషాలకు, లేక గంటలకే టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని అంతా భావించారు. ఈసారి టెక్నికల్ ప్రాబ్లమ్ పెద్దది కావడంతో అది ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో కొన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది.
Also Read: Microsoft Server Outage: మైక్రోసాఫ్ట్ దెబ్బకి ఈ సెక్టార్‌లు డౌన్, ఎక్కడ చూసినా గందరగోళమే