అన్వేషించండి

Mexico Earthquake 2026: మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం! సునామీ హెచ్చరిక జారీ, వణికిపోయిన సరిహద్దు దేశాలు!

Mexico Earthquake: మెక్సికో- గ్వాటెమాలా సరిహద్దు ప్రాంతంలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. చియాపాస్ ప్రాంతంలో కేంద్రీకృతమైన ఈ ప్రకంపనలు గ్వాటెమాలా, ఎల్‌సాల్వడార్, మెక్సికో సిటీ వరకు వ్యాపించాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దక్షిణ పసిఫిక్ తీరంలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం.
  • మెక్సికో, గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్‌లలో తీవ్ర ప్రకంపనలు వచ్చాయి.
  • భూకంప కేంద్రానికి 300 కి.మీ. పరిధిలో సునామీ హెచ్చరికలు.
  • సైరన్‌లు మోగకపోవడంపై మెక్సికో ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

Mexico Earthquake 2026: దక్షిణ పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో భారీ భూకంపం మెక్సికోతోపాటు పొరుగు దేశాలను వణికించింది. శుక్రవారం ఉదయం సంభవించిన తీవ్రమైన భూకంపం ప్రజలను భయపెట్టింది. వారంతా వీధుల్లో పరుగులు తీశారు. మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో ఉన్న దక్షిణ పసిఫిక్‌ తీర ప్రాంతం ఈ భూకంపానికి ప్రధాన కేంద్రంగా మారింది. భూకంప కేంద్రానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్సికో సిటీతోపాటు ఎల్‌ సాల్వడార్‌ దేశంలోనూ కూడా భూమి భారీగా కంపించింది. ప్రస్తుతానికి అక్కడ జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి రిపోర్టులు అందడం లేదు. 

అమెరికా భూగర్భ సర్వే సంస్థ అందించిన డేటా ప్రకారం రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. భూకంప కేంద్రం 15 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది మెక్సికోలోని చియాపాస్ తీరానికి దూరంగా, అక్విలెస్‌ సెర్డాన్‌ పట్టణానికి నైరుతి దిశలో 48 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

గ్వాటెమాలా, ఎల్‌ సాల్వడార్ ప్రజల్లో ఆందోళన 

ఉదయం అంతా ఆఫీస్‌లు, స్కూల్స్‌కు వెళ్తున్న టైంలో భూకంపం సంభవించడంతో అంతా ఒక్కసారి భయాందోళనలకు గురి అయ్యారు. అయితే భూకంపం ఏర్పడింది మెక్సికోలో అయినా దాని ప్రభావం గ్వాటెమాలా రాజధాని గ్వాటెమాలా సిటీపై కూడా పడింది. అక్కడి ప్రజలకు కూడా భయంతో ఇళ్ల నుంచి ఒక్కసారిగా రోడ్లపైకి పరుగులు తీశారు. పక్కనే ఉన్న ఎల్‌ సాల్వడార్‌లో ఇదే పరిస్థితి కనిపించింది.

భూకంప తీవ్రతకు జరిగిన నష్టంపై ఆయా ప్రభుత్వాలు స్పందించాయి. విపత్తు నిర్వహణ సిబ్బందిని రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. అయితే ప్రస్తుతానికి గ్వాటెమాలాలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని ఆ దేశాధ్యక్షుడు ప్రకటించారు. 

మెక్సికోలో మోగని భూకంప సైరన్‌లు ? వివరణ ఇచ్చిన ప్రభుత్వం!

మెక్సికోలో భూకంపాలు సంభవించే ముందు మోగేందుకు సైరన్‌లు ఏర్పాటు చేశారు. కానీ ఈసారి అవి మోగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం స్పందించి వివరణ ఇచ్చింది. భూకంపం వచ్చే ముందు ఏర్పడిన తరంగాల తీవ్రత హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసే స్థాయిలో రాలేదని తేల్చారు. మొదట్లో వచ్చిన కదలికలు చాలా బలహీనంగా ఉండటంతో ఆటోమేటిక్‌ వ్యవస్థ యాక్టివేట్ కాలేదని వివరించారు. 

సునామీ హెచ్చరికలు ఉన్నాయా?

భూకంపం తక్కువ లోతులో ఏర్పడటంతో పసిఫిక్‌ సునామీ హెచ్చరికల కేంద్రం కీలక ప్రకటన చేసింది. భూకంపం ఏర్పడిన ప్రాంతానికి చుట్టూ ఉన్న 300 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. దీంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. సుచియాటే(మెక్సికో, గ్వాటెమాలా సరిహద్దులో ఉన్న నదిపై ఉన్న నగరం ) నగర మేయర్‌ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. సముద్రంలో ఎలాంటి కదలికలు ఉన్నా సరే పరిశీలించాలని చెప్పారు. 

మెక్సికోలో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయి?

భౌగోళికంగా మెక్సికోతోపాటు మధ్య అమెరికా ప్రాంతాలు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌ పరిధిలో ఉంటాయి. అంటే ఈ ప్రాంతాల్లో ప్రపంచంలోనే ప్రమాదకరమైన భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతమని అర్థం. 

Frequently Asked Questions

ఈ భూకంపం ఎక్కడ సంభవించింది, దాని తీవ్రత ఎంత?

దక్షిణ పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతంలో, మెక్సికో-గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది.

మెక్సికోలో భూకంప సైరన్‌లు ఎందుకు మోగలేదు?

భూకంపం వచ్చే ముందు ఏర్పడిన తరంగాల తీవ్రత హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసే స్థాయిలో లేదు. కదలికలు బలహీనంగా ఉండటంతో ఆటోమేటిక్ వ్యవస్థ యాక్టివేట్ కాలేదని ప్రభుత్వం వివరించింది.

సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయా?

భూకంపం తక్కువ లోతులో ఏర్పడటంతో పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం 300 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది. అధికారులంతా అప్రమత్తమయ్యారు.

మెక్సికోలో తరచుగా భూకంపాలు ఎందుకు వస్తాయి?

భౌగోళికంగా మెక్సికోతోపాటు మధ్య అమెరికా ప్రాంతాలు పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉంటాయి. ఇది ప్రపంచంలోనే భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశం ఉన్న ప్రమాదకరమైన ప్రాంతం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Embed widget