అన్వేషించండి

Afghanistan News: నిన్న జపాన్, నేడు ఆఫ్ఘనిస్తాన్, వరుస భూకంపాలతో వణుకుతున్న తాలిబన్ దేశం

Afghanistan Earthquake: కొత్త సంవత్సరంలో భూకంపాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. జపాన్‌‌లో భూకంపం వచ్చిన  సంగతి మర్చిపోకముందే బుధవారం అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లో భూమి కంపించింది.  

Earthquake In Afghanistan: కొత్త సంవత్సరంలో భూకంపాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. రెండు రోజుల క్రితం జపాన్‌‌లో భూకంపం వచ్చిన  సంగతి మర్చిపోకముందే బుధవారం అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్‌ (Afghanistan)లో భూమి కంపించింది. కేవలం30 నిమిషాల్లో వ్యవధిలో తాలిబన్ దేశంలో భూమి రెండు సార్లు కంపిచింది. నేసషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వివరాల ప్రకారం మొదటి భూకంపం ఫైజాబాద్‌ (Faizabad )కు తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో అర్ధరాత్రి 12.28 గంటలకు సంభించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది.

అలాగే అదే ఫైజాబాద్‌కు తూర్పున 126 కిలోమీటర్ల దూరంలో రాత్రి 12.55 గంటలకు 4.4 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ రెండు భూకంపాల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలియరాలేదు. గత ఏడాది డిసెంబర్‌ 12న ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభించిన సంగతి తెలిసిందే. 

నవంబర్‌లో
ఇటీవల వరుస భూకంపాలతో ఆఫ్ఘనిస్తాన్‌ వణికిపోతోంది. నవంబర్ 21న ఆ దేశ రాజధాని కాబూల్‌ (Kabul) పట్టణానికి పశ్చిమాన 4.1 తీవ్రతతో భూమి కంపించింది. అర్ధరాత్రి 12.03 గంటలకు భూకంపం వచ్చిందని, భూకంప కేంద్రం కాబూల్‌కు పశ్చిమాన ఉన్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 73 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 

అక్టోబర్‌లో
అక్టోబర్‌ 7న సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 4 వేలకుపైగా మరణించారు. 20 గ్రామాల్లో దాదాపు 2 వేల ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. భూకంప ధాటికి కొన్ని గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హెరాత్ ప్రావిన్స్‌లో తీవ్ర నష్టం వాటిల్లింది.  పెద్ద పెద్ద బిల్డింగులు కూలిపోయాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. 

కొంతమంది ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది తీవ్ర గాయాలతో బయటపడ్డారు.  వేలాది ఇళ్లు నేలమట్టమై ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారికి తిండి, ఆశ్రయం లభించలేదు. ప్రజలు ఆకాశం క్రింద ఆశ్రయం పొందాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితిలో, అనేక దేశాలు ఆఫ్ఘనిస్తాన్‌కు ఆర్థిక సహాయం చేశాయి.

అక్టోబర్ 7 విషాదానికి సరిగ్గా వారం రోజుల తరువాత మరోసారి అక్కడ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో ఇది చోటు చేసుకొంది. హెరాత్‌ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో దాదాపు 8 కిలోమీటర్ల ఉపరితలం కింద ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూకంపంలో ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదు. 

జూన్‌లో 300 మంది మృతి
జూన్ 22న సైతం ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై 6.1 గా భూకంప తీవ్రత నమోదైంది.  6.1 తీవ్రతతో భూకంపం రావడంతో సుమారు 300 మందికి పైగా మరణించారు. ఆఫ్ఘనిస్తాన్ లోని ఖోస్ట్‌కు 44కిమీ దూరంలో భూకంపం సంభవించడంతో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. అనేకమంది శిథిలాల కింద చిక్కుకుని మరణించారు.

జపాన్‌లో భూకంపం..
జపాన్‌లో రెండు రోజుల క్రితం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్ర 7.4గా నమోదైంది. అధికారులు పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 5 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగిసిపడి తీర ప్రాంతాలను ముంచే ప్రమాదముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నీగట, తొయామా, ఇషికావా ప్రాంత ప్రజలకు అలెర్ట్ జారీ చేశారు. వాజిమా నగర తీరాన్ని మీటర్ కన్నా ఎక్కువ ఎత్తైన అలలు వచ్చి తాకే ప్రమాదముందని హెచ్చరించారు.

టాప్ హెడ్ లైన్స్

World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Embed widget