అన్వేషించండి

Viral News: గ్లాస్ పగలగొట్టినోళ్లవే రూ. 25 కోట్లు- కెనడాలో ప్రజలకు మిలియన్ డాలర్ల సవాల్ చేసిన గ్లాస్‌ కంపెనీ

Viral News: మార్కెటింగ్‌లో చిన్న సాహసం చాలా పెద్ద ఫలితాలను ఇస్తుంది. అలాంటి థియరీని 2005లో ఓ గ్లాస్‌ కంపెనీ రుజువు చేసింది. మార్కెట్‌లో డబ్బు పెట్టి ప్రజలకు ఛాలెంజ్ చేసి పెద్ద ప్రభావం చూపించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 3M కంపెనీ 2005లో తమ సెక్యూరిటీ గ్లాస్ సామర్థ్యాన్ని నిరూపించింది.
  • వాన్కోవర్ బస్ స్టాప్‌లో $3 మిలియన్ నగదుతో గాజు పెట్టెను ఉంచారు.
  • ప్రజలు డబ్బును తీసుకెళ్లడానికి ప్రయత్నించినా, గాజు పగలగొట్టలేకపోయారు.
  • ఈ వైరల్ ప్రచారం 3M కు మిలియన్ల డాలర్ల విలువైన ప్రచారాన్ని తెచ్చింది.

Viral News: మార్కెటింగ్ లోకంలో కొన్ని ప్రచారాలు ధైర్యానికి, సృజనాత్మకతకు పరాకాష్టగా నిలుస్తాయి. 2005లో 3M కంపెనీ చేసిన అన్‌బ్రేకబుల్‌ గ్లాస్‌ సవాల్  ఒక మంచి ఉదాహరణ. తమ సెక్యూరిటీ గ్లాస్ (3M Security Glass) బలాన్ని నిరూపించడానికి, కెనడాలోని వాన్కువర్ బస్ స్టాప్ వద్ద 3 మిలియన్ డాలర్ల (అంటే దాదాపు పాతిక కోట్ల రూపాయలు) నగదును గాజు పెట్టెలో ఉంచి, "పగలగొట్టి తీసుకోండి" అని ప్రజలకు సవాలు విసిరారు. 

ఎవరూ ఆ పని చేయలేకపోయారు. కానీ ఈ 'క్రేజీ అడ్వర్టైజ్‌మెంట్' వైరల్ మార్కెటింగ్ ద్వారా మిలియన్ల డాలర్ల విలువైన పబ్లిసిటీ తెచ్చింది. ఈ ఛాలెంజ‌ గురించి ఈ స్టంట్ ఇప్పటికీ మార్కెటింగ్ కేస్ స్టడీల్లో చర్చనీయాంశం. దీని వెనుక ఉన్న రహస్యాలు, ప్రభావం ఏమిటి? సమగ్రంగా తెలుసుకుందాం.

2005లో 3M కంపెనీ తమ కొత్త 'సెక్యూరిటీ గ్లాస్'ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది బుల్లెట్‌ప్రూఫ్, అన్‌బ్రేకబుల్‌ గాజు – బ్యాంకులు, షాపులు, భద్రతా ప్రదేశాలకు బాగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో రూపొందించారు. కానీ సమస్య ఏమిటంటే, ప్రజలు దీని బలాన్ని నమ్మకపోతున్నారు. సాధారణ టీవీ అడ్వర్టైజ్‌మెంట్లు, ప్రింట్ మీడియా ద్వారా విశ్వాసం పెంచడం కష్టం. అందుకే 3M మార్కెటింగ్ టీమ్ అసాధారణమైన దారని ఎంచుకుంది. 

3M Security Glassను ఉపయోగించి ఒక గట్టి గాజు పెట్టెను తయారు చేశారు. దాని లోపల 3 మిలియన్ డాలర్ల నగదు పెట్టారు. భద్రతా కారణాలతో దృష్ట్యా 500 డాలర్ల మాత్రమే నిజమైన క్యాష్, మిగతా డబ్బు ఫేక్ నోట్స్‌ పెట్టారు. ఈ పెట్టెను వాన్కువర్ డౌన్‌టౌన్‌లోని ఒక సాధారణ బస్ స్టాప్ వద్ద, ఎలాంటి గార్డ్‌లు లేకుండా ఉంచారు. ఇది ఒకే రోజు మాత్రమే – కానీ అది చరిత్ర సృష్టించింది. 

పగలగొట్టి, తీసుకెళ్లండి!  

"If you can break it, it's yours!" – అంటే, "పగలగొట్టగలిగితే, లోపల డబ్బు మొత్తమే మీది!" ప్రజలు ఈ $3 Million Challengeను విని ఉత్సాహంగా కష్టపడ్డారు. వీడియోల్లో చూస్తే, ఒక వ్యక్తి చేతులతో గట్టిగా గుద్దుతూ, మరొకరు కాళ్లతో తన్నుతూ, మరికొందరు శరీర బరువు మొత్తాన్ని ఉపయోగించి ప్రయత్నిస్తున్నారు. కానీ, 3M Security Glassపై ఒక్క గాటు కూడా పడలేదు! 

ఈ స్టంట్‌లో పాల్గొన్నవారు కేవలం కిక్స్, పంచెస్‌తో మాత్రమే ప్రయత్నించారు. టూల్స్ లేదా ఆయుధాలు ఉపయోగించడానికి అనుమతించలేదు. ఫలితంగా, ఎవరూ విజయం సాధించలేకపోయారు. ఈ ఘటన అప్పట్లోనే మీడియాలో వైరల్ అయ్యాయి. మిలియన్ల మంది చూశారు. 3M ఈ ప్రచారం ద్వారా తమ ఉత్పత్తి భద్రతను ప్రత్యేకంగా నిరూపించుకుంది. 

అప్పటి ఇంటర్నెట్ యుగంలో ఈ వీడియోలు వైరల్ అవ్వడం ద్వారా, 3Mకు $1 మిలియన్ విలువైన ఫ్రీ మార్కెటింగ్ లభించింది. సోషల్ మీడియా షేర్లు, న్యూస్ కవరేజ్ బాగానే వచ్చింది. సాధారణ అడ్వర్టైజ్‌మెంట్లకు కోట్లు ఖర్చు చేస్తారు. కానీ 3M తన ఉత్పత్తి బలాన్నే ఉపయోగించి, తక్కువ బడ్జెట్‌తో అసాధారణ ప్రభావం చూపింది.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Japan Earthquake:జపాన్‌ను వణికించిన 7.1 భూకంపం: సునామీ హెచ్చరికతో హైఅలర్ట్!
జపాన్‌ను వణికించిన భూకంపం, 7.1 తీవ్రతతో కంపించిన భూమి, సునామీ హెచ్చరిక జారీ  

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget