అన్వేషించండి

ACP Ravinder: ప్రాణాలు కాపాడినందుకు హ్యాట్సాఫ్‌ సార్‌ -పరిగెత్తుకుంటూ వచ్చి ఏసీపీకి కృతజ్ఞతలు చెప్పిన మహిళ

కష్టంలో ఉన్న వారికి సాయం చేస్తే.. ఎప్పటికీ మర్చిపోరు. ప్రాణం ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటారు. దీన్ని రుజువుచేసిందో మహిళ. 9ఏళ్ల క్రితం సాయం చేసిన ఏసీపీకి.. పరిగెత్తుకుంటూ వచ్చి కృతజ్ఞతలు చెప్పింది.

ఆదివారం... సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి రోడ్డు... ఎటు చూసినా రద్దీగా ఉంది. మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ కార్యక్రమం కోసం ఏసీపీ రవీందర్‌ యాదవ్‌ బందోబస్తు డ్యూటీ చేస్తున్నారు. అటువైపుగా బస్సులో వెళ్తున్న ఓ మహిళ ఏసీపీ రవీందర్‌ను చూసింది. బస్సు దిగి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చింది. నన్ను గుర్తుపట్టారా సార్‌ అంటూ కన్నీరుపెట్టుకుంది. నేను బతికున్నానంటూ మీవళ్లే అని చెప్పింది. మీరు చేసిన సాయానికి కృతజ్ఞతలు అంటూ ఆనందభాష్పాలు రాల్చింది. అది చూసి.. అక్కడున్న వారంతా షాకయ్యారు. ఏం జరుగుతుందో తెలియక.. అయోమంలో పడ్డారు. మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి... ఏసీపీకి ఎందుకు థ్యాంక్స్‌ చెప్తుందో అర్థంకాక అలా చూస్తూ ఉండిపోయారు. చివరికి విషయం తెలుసుకుని... ఏసీపీని పొగడ్తలతో ముంచెత్తారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

బస్సు దిగి పరిగెత్తుకుంటూ వచ్చిన మహిళ పేరు కవిత. ఈమెది కార్వాన్‌. ఇప్పుడు మహంకాళి ఏరియా ఏసీపీగా ఉన్న రవీందర్‌ యాదవ్‌... 2014లో టప్పాఛబుత్ర పోలీసుస్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఓ రోజు... కార్వాన్‌కు చెందిన కవిత రోడ్డుపై అనారోగ్యంతో బాధపడుతూ ఏసీపీకి కనిపించింది. ఆయన వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించి.. తన సొంత డబ్బుతో వైద్యం చేయించారు. ఆపరేషన్‌కు కూడా డబ్బులు ఇచ్చారు. ఇది జరిగి దాదాపు 9ఏళ్లు కావస్తోంది. అప్పుడు ఏసీపీ చేసిన సాయాన్ని ఇప్పటికీ మర్చిపోలేదు మహిళ. 

ఆదివారం... ఆ మహిళ సికింద్రాబాద్‌ మీదుగా బస్సులో వెళ్తోంది. అదే సమయంలో అక్కడ బందోబస్తు డ్యూటీ నిర్వహిస్తున్నారు ఏసీపీ రవీందర్‌. బస్సులో వెళ్తున్న కవిత ఆయన్ను చూడగానే కృతజ్ఞతా భావం పొంగుకొచ్చింది. వెంటనే ఆమె బస్సు దిగి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చింది. సాయం చేసిన వారి మర్చిపోయినా... సాయం పొందినవారు మర్చిపోరు కదా. 9ఏళ్ల క్రితం చేసిన సాయాన్ని ఏసీపీకి గుర్తుచేసింది ఆ మహిళ. సార్‌.. నేను కవితను.. గుర్తున్నానా అని అడిగింది. ఈ రోజు నేను బతికి ఉన్నానంటే అందుకే మీరే కారణం సార్ అంటూ అంటూ కన్నీరు పెట్టుకుంది. మీ కోసం వెండి రాఖీ తీసుకున్నా సార్‌... పండుగ రోజు వచ్చి కడుతానని చెప్పింది. తన ఫోన్‌లో ఉన్న ఏసీపీ ఫోటోను అందరికీ చూపించింది. ఆమె కృతజ్ఞతకు ఏసీపీతో పాటు అందరు ఆశ్చర్యపోయారు.

ఏసీపీ ఫోన్‌ నంబర్‌ తీసుకుని సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది మహిళ. ఇది చూసిన స్థానికులు ఏసీపీపై ప్రసంశల వర్షం కురిపించారు. హ్యాట్సాఫ్‌ పోలీస్ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. కష్టాల్లో ఉన్న సాటివారికి సాయం చేయడం మానవధర్మం. పక్కవారికి మంచిచేస్తే... మనకూ మంచిజరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక... ఎవరు కష్టాల్లో ఉన్నా చేతనైన సాయం చేయాలి. మానవత్వంలో ప్రవర్తించాలి ఈ ఏసీపీలా.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Laptop Battery Saving Tips: ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? - ఇలా చేస్తే ఎక్కువ సేపు వస్తుంది!
ల్యాప్‌టాప్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? - ఇలా చేస్తే ఎక్కువ సేపు వస్తుంది!
Embed widget