Wine Shops Close: రేపు వైన్ షాపులు క్లోజ్, త్వరపడుతున్న మందుబాబులు - మళ్లీ తెరుచుకునేది అప్పుడే!
Republic Day: దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే ను 'డ్రై డే' గా పరిగణిస్తారు. అందుకే రేపు బంద్ కావడంతో గురువారం (జనవరి 25) మధ్యాహ్నం నుంచే వైన్ షాపుల వద్ద మందు బాబులు లైన్ కట్టారు.
Wine Shops Closed on Republic Day: గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 26న రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. అలాగే మాంసం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. శనివారం మద్యం దుకాణాలు వైన్ షాపులు తిరిగి తెరుచుకోనున్నాయి. దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే ను 'డ్రై డే' గా పరిగణిస్తారు. అందుకే రేపు బంద్ కావడంతో గురువారం (జనవరి 25) మధ్యాహ్నం నుంచే వైన్ షాపుల వద్ద మందు బాబులు లైన్ కట్టారు.
జనవరి 26 వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మద్యం దుకాణాలు మూసేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. దేశ వ్యాప్తంగా జనవరి 26న నేషనల్ డ్రైడే గా పరిగణిస్తుంటారు. దీంతో తెలంగాణలోనూ అన్ని లిక్కర్ దుకాణాలు, బార్లు మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. తిరిగి శనివారం (జనవరి 27) వైన్ షాపులు తెరుచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను ఇచ్చింది. నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించవద్దని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.