అన్వేషించండి

PM Modi: మహిళల్ని విపక్షాలు అవమానించాయి.. ఎంతో ఆవేదన చెందాను - ప్రధాని మోదీ స్పీచ్ Watch Live

Modi: ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారంటే... దేశం మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ తో అటెన్షన్ చూపించాల్సిందే. గతంలో ప్రసంగించినప్పుడు అలాంటి సంచలన నిర్ణయాలు వచ్చాయి. ఇవాళేం చెప్పబోతున్నారు?

What is Modi going to say: శనివారం రాత్రి 8:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి చేయనున్న ప్రసంగంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ కోసం ఉద్దేశించిన  131వ రాజ్యాంగ సవరణ బిల్లు-2026  వీగిపోయిన మరుసటి రోజే ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2014 నుండి వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి, ఒక కీలక రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటులో వీగిపోవడం ఇదే మొదటిసారి.  

బిల్లును ఓడించడంపై ప్రధాని ఆగ్రహం

శుక్రవారం లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొనగా, బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. సాధారణ మెజారిటీ లభించినప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన  మూడింట రెండు వంతుల మెజారిటీ లభించకపోవడంతో బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజన తో ముడిపెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా   ఇండియా  కూటమి సభ్యులు ఐక్యంగా దీనిని వ్యతిరేకించారు.  అయితే మహిళా బిల్లును ఓడించడంపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన శిక్ష అనుభవించాల్సిందేనని చెబుతున్నారు. 

 మోదీ ఆగ్రహం.. విపక్షాలకు హెచ్చరిక 

బిల్లు వీగిపోయిన అనంతరం ప్రధాని మోదీ తన కేబినెట్ సహచరులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. మహిళా బిల్లును అడ్డుకోవడం ద్వారా విపక్షాలు దేశంలోని కోట్లాది మంది మహిళలకు ద్రోహం చేశాయని, వారు దీనికి తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రధాని హెచ్చరించినట్లు సమాచారం. విపక్షాల తప్పును దేశంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి అని ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేశారు. రాత్రి ప్రసంగంలో కూడా ఆయన ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ, విపక్షాల మహిళా వ్యతిరే  వైఖరిని ఎండగట్టే అవకాశం ఉంది.

 సంచలన నిర్ణయం ఉంటుందా? 

సాధారణంగా రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయం అంటే దేశం ఏదో ఒక పెద్ద ప్రకటనను ఆశిస్తుంది. మహిళా బిల్లును పార్లమెంటులో వీగిపోయినప్పటికీ, దానిని అమల్లోకి తీసుకురావడానికి ఉన్న ఇతర మార్గాలను ప్రధాని అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ల కోసం ఒక ప్రత్యేక  ఆర్డినెన్స్  జారీ చేయడం లేదా రాబోయే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్యను పెంచడంపై ఆయన ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని  భావిస్తున్నారు. 

దక్షిణాది భయాలకు సమాధానం 

నియోజకవర్గాల పునర్విభజన వల్ల తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై కూడా ప్రధాని క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మహిళా హక్కులు ,రాష్ట్రాల హక్కుల మధ్య సమతుల్యతను ఎలా కాపాడబోతున్నారో ఆయన వివరించవచ్చు.   విపక్షాల అడ్డంకులను అధిగమించి మహిళా సాధికారత దిశగా తన ప్రభుత్వం తదుపరి అడుగులు ఎలా ఉంటాయో మోదీ ఈ ప్రసంగం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పబోతున్నారు. రాజకీయ చదరంగంలో విపక్షాల ఎత్తులను చిత్తు చేసేలా ప్రధాని  మాస్టర్ స్ట్రోక్  ఉంటుందో లేదో తెలియాలంటే రాత్రి 8:30 వరకు వేచి చూడాల్సిందే.                

టాప్ హెడ్ లైన్స్

Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Nadendla Manohar: తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. సబ్సిడీ విక్రయాలు ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
MI Trade Rumours: హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Embed widget