Swiss Banks: స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచిపెట్టేస్తున్న పెద్దలు - ఏడాదిలో మూడింతలు పెరుగుదల - ఎవరివి ?
Swiss: భారతదేశంలో స్విస్ బ్యాంకులు ఎప్పుడూ చర్చనీయాంశమే. అక్కడ పెద్ద ఎత్తున డబ్బులు దాచుకున్నారని రాజకీయ నేతలపై ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి అలాంటి చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.

Indian Money triple in Swiss Banks: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకునే డబ్బు ఏడాదిలో భారీగా పెరిగిపోయింది. 2024లో మూడింతలు పెరిగి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు అంటే సుమారు రూ. 37,600 కోట్లకు చేరింది. ఇది 2023లో 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు అంటే రూ. 9,771 కోట్లు మాత్రమే. 2021 తర్వాత అత్యధికం అని రికార్డులు చెబుతున్నాయి. ఆ సంవత్సరం భారతీయుల డబ్బు 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు అంటే సుమారు రూ. 30,500 కోట్లు స్విస్ బ్యాంకుల వద్ద ఉంది. అయితే ఆ తర్వాత ఒక్క సారిగా భారతీయులు స్విస్ బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేశారు. 2023లో 70 శాతం తగ్గిపోయింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా పెరుగుతోంది.
స్విస్ బ్యాంకుల్లో భారతీయ డబ్బు వివిధ రూపాల్లో ఉందని నివేదికలు చెబుతున్నాయి. 346 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు అంటే సుమారు రూ. 3,675 కోట్లు కస్టమర్ డిపాజిట్ల ద్వారా ఉన్నాయి. ఇతర బ్యాంకుల ద్వారా స్విస్ బ్యాంకుల్లోకి వచ్చిన 3.02 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లుగా తేల్చారు. 2022లో 427 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లతో పోలిస్తే ఇలాంటి డిపాజిట్లు భారీగా పెరిగాయి. ట్రస్ట్‌ల ద్వారా 41 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు జమ అయ్యాయి. బాండ్లు, సెక్యూరిటీలు, ఇతర ఆర్థిక సాధనాల ద్వారా 135 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు బ్యాంకుల్లో జమ అయ్యాయి. కస్టమర్ డిపాజిట్లు మొత్తం డబ్బులో కేవలం పదో వంతు మాత్రమే , మిగిలినవి ప్రధానంగా బ్యాంకింగ్ ఛానళ్లు, ఆర్థిక సంస్థల ద్వారా డిపాజిట్ అయ్యాయి.
భారతదేశంలోని స్విస్ బ్యాంకుల బ్రాంచ్‌లు , ఇతర ఆర్థిక సంస్థల ద్వారా ఎక్కువగా డిపాజిట్లుఅవుతున్నాయి. : స్విట్జర్లాండ్ అధునాతన ట్రస్ట్ చట్టాలు సంపన్న కుటుంబాలు తమ ఆస్తులను ఆఫ్‌షోర్ ని ద్వారా అంటే బినామీల ద్వారా డిపాజిట్ చేసుకుని రక్షించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఇలాంటి వాటిని "నల్లధనం"గా ప్రకటించే చట్టాలు స్విస్ లో లేవు. భారత నివాసులు స్విట్జర్లాండ్‌లో ఉంచిన ఆస్తులు చట్టబద్ధమైనవిగానే భావిస్తున్నారు. 2018 నుండి భారత్ మ, స్విట్జర్లాండ్ మధ్య ఆటోమేటిక్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (AEOI) ఒప్పందం అమలులో ఉంది. అప్పటి నుంచి స్విస్ బ్యాంకులకు సంబంధించిన సమాచారం కేంద్రానికి వస్తోంది.
స్విస్ బ్యాంకుల్లో విదేశీ క్లైంట్ల మొత్తం నిధులు 2024లో 977 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు, 2023లో 983 బిలియన్ నుండి స్వల్పంగా తగ్గాయి. అత్యధికంగా యూకే , యూఎస్ , వెస్ట్ ఇండీస్ కు చెందిన వారు స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటున్నారు. భారత్ 2023లో 67వ స్థానం నుండి 2024లో 48వ స్థానానికి పెరిగింది. స్విస్ బ్యాంకులో అకౌంట్ ఉండటం అంటే.. భారత్ లో నల్లధనం దాచుకోవడానికేనని అనుకుంటారు. రాజకీయ నేతలు అలా ప్రచారం చేశారు. అయితే ఇందులో ఎంత నల్లధనం ఉందన్నది మాత్రం ఎవరికీ తెలియదు.





















