Watch Video: లాహిరి లాహిరి లాహిరిలో అని ఊగారు, అంతలోనే కింద పడ్డారు - వైరల్ వీడియో
Watch Video: ఎగ్జిబిషన్‌లో స్వింగ్ ఎక్కి కింద పడిన యువకుల వీడియో వైరల్ అవుతోంది.
Watch Video:
స్వింగ్ నుంచి జారి పడ్డ యువకులు
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వీడియో బాగుందంటే చాలు..క్షణాల్లో అందరికీ రీచ్ అయిపోతాయి. ఇలా వైరల్ అయ్యే వీడియోల్లో ఫన్నీవే కాకుండా ప్రమాదకరమైనవీ ఉంటాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ వీడియో ...అందరినీ టెన్షన్ పెట్టేస్తోంది. సాధారణంగా...ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేసిన చోట జియాంట్ వీల్స్, హై రైజ్ స్వింగ్‌లు తప్పకుండా ఉంటాయి. వాటిలో ఎక్కి భయపడటాన్నీ థ్రిల్‌గా భావిస్తారు కొందరు. కానీ...ఒక్కోసారి ఇదే ప్రాణాల మీదకూ తెస్తుంది. ఇప్పుడదే జరిగింది. స్వింగ్‌లో కూర్చుని అందరూ అది ఊగుతుంటే ఎంజాయ్ చేసినప్పటికీ...ఉన్నట్టుండి అది అదుపు తప్పటం వల్ల అందరూ కింద పడిపోయారు. కొందరు గాయాల పాలయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఈ వీడియో పోస్ట్ చేశారు. సామర్థ్యానికి మించి జనాలను ఎక్కించాడు ఓనర్. కూర్చోటానికి ఖాళీ లేక కొందరు నిలబడ్డారు. ఓ రెండు రౌండ్లు బాగానే తిరిగినా...తరవాత కొందరు అదుపు తప్పి కింద పడిపోయారు. ఇప్పటికే ఈ వీడియోని 30 లక్షల మంది చూడగా..82 వేల మంది లైక్ చేశారు. కామెంట్ సెక్షన్‌లో రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
మరో వైరల్ వీడియో..
ఈ తరం చిన్నారుల తెలివితేటలు చూస్తే అవాక్కవ్వాల్సిందే. వాళ్ల మాటలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తాజాగా ఓ చిన్నారి తన అమ్మపై ఫిర్యాదు చేశాడు. ఏముంది అమ్మ కొట్టిందని చెప్పి ఉంటాడు.. అనుకుంటున్నారా? కాదు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరీ ఆ బుడ్డోడు కంప్లెయింట్ ఇచ్చాడు. మధ్యప్రదేశ్ బర్హాన్‌పూర్ జిల్లా డేడ్‌తలాయి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మూడేళ్ల చిన్నారి తన నాన్నను వెంట బెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. తన తల్లిపై ఫిర్యాదు చేయడానికి వచ్చానని పోలీసులకు చెప్పాడు. ఇది చూసి షాకైన పోలీసులు.. ఏం జరిగిందని అడిగారు. అయితే కంప్లెయింట్ రాసుకోవాలని ఆ చిన్నారి కోరడం పోలీసులను అవాక్కయ్యేలా చేసింది. ఇంతకీ కంప్లెయింట్ ఏంటంటే? వాళ్ల అమ్మ అసలు చాక్లెట్లు తిననిన్వడం లేదట. వాటిని దొంగిలించి తనకు దొరక్కుండా దాచి పెడుతోందట. అంతేకాదు క్యాండీలు కావాలని అడిగినప్పుడల్లా కొడుతుందట. ఈ విషయాలన్నీ బుడ్డోడు ముద్దుముద్దుగా చెప్పడం అక్కడున్న పోలీసులతో నవ్వులు పూయించింది. కంప్లెయింట్ రాసుకున్న మహిళా పోలీస్ బుడ్డోడు చెప్పిన ప్రతి అక్షరాన్ని ఫిర్యాదులో రాశారు.
मध्यप्रदेश के बुरहानपुर में तीन साल का बच्चा मम्मी की शिकायत लेकर पुलिस थाने पहुंच गया। उसने पुलिस से कहा कि मम्मी मेरी कैंडी और चॉकलेट चुरा लेतीं हैं। उनको जेल में डाल दो। बच्चे की मासूमियत देखकर सभी की हंसी छूट गई।#MadhyaPradesh #Video pic.twitter.com/iGdHVOZEF6
— Hindustan (@Live_Hindustan) October 17, 2022
Also Read: UK New Home Secretary: బ్రిటన్‌లో రాజకీయ గందరగోళం- హోంమంత్రి పదవికి బ్రేవర్మన్ గుడ్‌బై!