అన్వేషించండి

ఇండియన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా, వేలాది మందికి బెన్‌ఫిట్

US EAD Cards: ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డుల గడువుని ఐదేళ్లకి పెంచుతూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.

US EAD Cards: 

ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డ్‌లు..

అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయులకు మేలు జరగనుంది. నాన్ ఇమిగ్రెంట్ కేటగిరీకి చెందిన పౌరులకు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డ్‌లు (US Employment Authorisation Cards) జారీ చేయనుంది. గ్రీన్‌ కార్డ్‌ కోసం ఎదురు చూసే వాళ్లకీ ఈ కార్డ్‌లు ఇవ్వనుంది. ఐదేళ్ల పాటు ఇది చెల్లుతుంది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఇదెంతగానో ఉపయోగపడనుంది. US Citizenship and Immigration Services (USCIS) ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. Employment Authorization Documents (EAD) వ్యాలిడిటీని ఐదేళ్ల వరకూ పెంచుతున్నట్టు వెల్లడించింది. గ్రీన్‌ కార్డ్‌ కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వాళ్లకీ ఇది లబ్ధి చేకూర్చనుంది. సాధారణంగా గ్రీన్‌ కార్డ్‌లు అప్లై చేసిన వాళ్లకి "అడ్జస్ట్‌మెంట్‌ ఆఫ్ స్టేటస్ అప్లికేషన్స్‌" చాలా కీలకం. గ్రీన్ కార్డ్‌ రావాలంటే ఈ ప్రాసెస్‌ దాటుకుని రావాల్సిందే. ఇక్కడే చాలా వరకూ పెండింగ్‌లో ఉంటాయి. ఇకపై ఈ స్టేటస్‌తో సంబంధం లేకుండా ఐదేళ్ల పాటు ఎంప్లాయ్‌మెంట్‌ కార్డ్‌లు ఇవ్వనుంది అమెరికా వలసల విభాగం.

గ్రీన్‌ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లు ఈ ఎంప్లాయ్‌మెంట్‌ కార్డుతో అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు. ప్రస్తుత లెక్కల ప్రకారం..అమెరికాలో కనీసం 10.5 లక్షల మంది భారతీయులు ఎంప్లాయ్‌మెంట్‌ బేస్డ్ గ్రీన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్‌లకు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డ్‌లు వర్తిస్తాయి.  గ్రీన్‌ కార్డ్ (US Green Card)వచ్చిందంటే అమెరికా పౌరసత్వం లభించినట్టే. అంటే...అమెరికాలోనే శాశ్వతంగా ఉండేందుకు ఆ దేశం అనుమతినిస్తుంది. చాలా మంది వీటి కోసం ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. H1B వీసాదారుల జీవిత భాగస్వాములు లేదా 21 ఏళ్ల లోపు యువతీ యువకులు అమెరికాలో ఉద్యోగం చేసుకోడాని H4 వీసాలు ఇస్తారు. అయితే...వీళ్లు జాబ్ చేయాలంటే కచ్చితంగా ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేన్ డాక్యుమెంట్స్ కోసం అప్లై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ పూర్తైతే తప్ప ఉద్యోగం చేయడానికి అవకాశముండదు. ఇది పూర్తి కావాలంటే ఒక్కోసారి ఏడాది సమయం పడుతుంది. ఇలాంటి వాళ్లకి ఇకపై ఇబ్బందులు తలెత్తకుండా EADల గడువుని ఐదేళ్ల వరకూ పెంచారు. 

వీసాల సంఖ్య పెరిగింది..

ఈ వేసవిలో రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు జారీ చేశామని, మొత్తం 90 వేలు మించిపోయాయని భారత్ లోని యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ ఇటీవలే వెల్లడించింది. జూన్, జులై, ఆగస్టు నెలల్ో వీసాలు జారీ చేసినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇంత భారీ మొత్తంలో విద్యార్థి వీసాలు జారీ చేయడం భారత దేశం, అమెరికా మధ్య విద్యా మార్పిడిలో చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుందని పేర్కొంది. ఈ వేసవిలో ప్రపంచవ్యాప్తంగా జారీ అయిన వీసాల్లో అత్యధికంగా భారత్ నుంచే ఉన్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా జారీ అయిన ప్రతి నాలుగు విద్యార్థి వీసాల్లో ఒకటి భారత దేశంలోనే జారీ చేసినట్లు 2022 లో యునైటెడ్ స్టేట్స్ లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులతో ప్రపంచంలోని అగ్ర దేశంగా భారత్ చైనాను అధిగమించింది. 2020లో దాదాపు 2,07,000 మంది అంతర్జాతీయ భారతీయ విద్యార్థులు యూఎస్ లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ తెలిపింది. తమ ఉన్నత విద్యా లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ ను ఎంచుకున్న విద్యార్థులు అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింది. టీమ్ వర్క్, ఇన్నోవేషన్ తో, అర్హత కలిగిన దరఖాస్తుదారులందరూ వారి ప్రోగ్రామ్ లకు సమయానికి చేరుకున్నారని నిర్ధారిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టింది. ప్రస్తుత సెషన్ కోసం స్టూడెంట్ వీసా దరఖాస్తులు ముగిసిన నేపథ్యంలో యూఎస్ మిషన్ ఈ గణాంకాలను విడుదల చేసింది.

Also Read: హమాస్‌ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌ని మట్టుబెట్టిన ఇజ్రాయేల్‌, ఉగ్రవాదుల్ని ఏరేస్తున్న సైన్యం

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget