అన్వేషించండి

సీఏఏ చట్టంపై అమెరికా ఆందోళన, పరిశీలిస్తున్నామంటూ కీలక ప్రకటన

CAA Implementation: భారత్‌లో పౌరసత్వ సవరణ చట్టం అమలుపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.

US on CAA Implementation: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (CAA)ని అమలు చేస్తున్నట్టు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. అప్పటి నుంచి దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మోదీ సర్కార్ మాత్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో ఈ చట్టం అమలుని పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. మార్చి 11వ తేదీన భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన CAAపై ఆందోళన చెందుతున్నట్టు చెప్పింది. 

"మార్చి 11వ తేదీన భారత ప్రభుత్వం CAAని అమల్లోకి తీసుకొస్తూ నోటిఫికేషన్ ఇవ్వడంపై కాస్త ఆందోళనగానే ఉంది. ఈ చట్టాన్ని ఎలా అమలు చేస్తారన్నదే ముఖ్యం. అందుకే చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కుల ప్రకారం దేశంలో ప్రతి ఒక్క మతానికీ స్వేచ్ఛ ఉండాలి. అందరికీ ఒకే విధమైన న్యాయం జరగాలి"

- మాథ్యూ మిల్లర్, స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి

అటు అమెరికాలోని హిందువులంతా CAA అమలుని స్వాగతించిన నేపథ్యంలోనే అమెరికా ఇలాంటి ప్రకటన చేయడం కీలకంగా మారింది. నిజానికి దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచో పౌరసత్వ సవరణ చట్టం గురించి చర్చ జరుగుతోంది. ఐదేళ్ల క్రితమే కేంద్రం ఈ బిల్‌ని తీసుకొచ్చినప్పటికీ అప్పటి నుంచి అమలుకి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అమలు చేస్తామని ఐదేళ్ల క్రితమే ప్రకటించింది కేంద్రం. ఆ సమయంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు భగ్గుమన్నాయి. అటు పశ్చిమ బెంగాల్‌లోనూ నిరసనలు జరిగాయి. ఆ తరవాత కొవిడ్‌ సంక్షోభం రెండేళ్ల పాటు వెంటాడింది. ఫలితంగా అమలులో ఆలస్యం జరిగింది. ఇప్పుడు సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. వెంటనే అమల్లోకి తీసుకొస్తున్నట్టు మార్చి 11న ప్రకటించింది.  

 

టాప్ హెడ్ లైన్స్

Jasprit Bumrah Fitness:  బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. శ్రీలంక సిరీస్ కి యార్కర్ కింగ్ కంబ్యాక్!
బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. శ్రీలంక సిరీస్ కి యార్కర్ కింగ్ కంబ్యాక్!
CWG Historic Gold: జూడోలో హర్ష్, అస్మిత సరికొత్త రికార్డు.. బాక్సింగ్, అథ్లెటిక్స్ లో మెడల్స్ సునామీ, గ్లాస్గో గేమ్స్ లో దూసుకుపోయిన భార‌త్ !
జూడోలో హర్ష్, అస్మిత సరికొత్త రికార్డు.. బాక్సింగ్, అథ్లెటిక్స్ లో మెడల్స్ సునామీ, గ్లాస్గో గేమ్స్ లో దూసుకుపోయిన భార‌త్ !
ABP Desam Top 10, 31 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 31 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget