అన్వేషించండి

CAA రూల్స్‌పై ఇవాళ రాత్రి అమిత్‌షా కీలక ప్రకటన! ABP News విశ్వసనీయ వర్గాల వెల్లడి

Citizenship Amendment Act: CAA పై కేంద్ర హోంశాఖ ఇవాళ రాత్రి కీలక ప్రకటన చేసే అవకాశముంది.

Citizenship Amendment Act Rules: కేంద్ర హోం శాఖ Citizenship Amendment Act (CAA) పై ఇవాళ రాత్రి కీలక ప్రకటన చేసే అవకాశముంది. CAAకి సంబంధించిన నియమ నిబంధనలను వెల్లడించే అవకాశముందని ABP News సోర్సెస్ ద్వారా తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రకటన (PM Modi Announcement Highlights) చేయనున్నట్టు తెలుస్తోంది. చాలా రోజులుగా CAA అమలుపై చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల ముందే ఇది కచ్చితంగా అమలు చేసి తీరతామని అమిత్‌ షా గతంలోనే స్పష్టంగా చెప్పారు. ఎవరు అడ్డుకున్నా ఈ సారి వెనక్కి తగ్గం అంటూ తేల్చి చెప్పారు. ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని, కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండి పడ్డారు. ఈ క్రమంలోనే హోంశాఖ ఈ నిబంధనలపై (CAA Rules) కీలక ప్రకటన చేస్తుందన్న వార్త ఉత్కంఠ రేపుతోంది. 2019లో CAA చట్టం అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నించినా...ఈశాన్య రాష్ట్రాలు సహా పశ్చిమ బెంగాల్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి అలజడి రేగుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఓ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. CAA అమలులో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా అవేవీ అడ్డుకోలేవని తేల్చి చెప్పారు. కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ చట్టంలో ఎలాంటి లొసుగులు లేవని అన్నారు. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్‌లో ఆశ్రయం కోల్పోయిన హిందువులు, సిక్కులు,బుద్ధులు, పార్శీలు, క్రిస్టియన్లకు పౌరసత్వం కల్పించేందుకే ఈ చట్టం తీసుకొస్తున్నట్టు వెల్లడించారు అమిత్‌షా. 2014 డిసెంబర్ 31వ తేదీన కానీ అంతకన్నా  ముందుకానీ భారత్‌కి వచ్చిన వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. 

"కొంత మంది పని గట్టుకుని ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నారు. CAAకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ చట్టం ద్వారా ఎవరి హక్కుల్నీ లాగేసుకోవడం లేదు. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో ఎన్నో ఇబ్బందులు పడి భారత్‌కి వచ్చిన వాళ్లకు పౌరసత్వం కల్పించేందుకే ఈ చట్టం"

- అమిత్ షా, కేంద్రహోం మంత్రి

గతంలో CAA చట్టం అమలు తీరుపై ప్రజలకు సరైన అవగాహన కల్పించలేదని భావిస్తోంది బీజేపీ. అందుకే...ఈ సారి అలాంటి సమస్య ఏమీ రాకుండా అన్ని విధాలుగా జాగ్రత్తపడినట్టు సమాచారం. అంతే కాదు. ఇందుకు సంబంధించిన నిబంధనల్నీ సిద్ధం చేసింది. ఓ ఆన్‌లైన్‌ పోర్టల్‌నీ రెడీ చేసింది. అంతా ఆన్‌లైన్‌లోనే జరిగేలా చూడనుంది. అప్లికెంట్స్ తమ పూర్తి వివరాల్ని ఆ పోర్టల్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. 

టాప్ హెడ్ లైన్స్

Loan Trap: చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. అప్పుల ఊబితో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
చదువుకు 4 లక్షలు, పెళ్లికి 10 లక్షలు.. Loan Trapతో తప్పని చిక్కులు- పరిష్కార మార్గాలివే
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Meta గ్లోబల్ టీమ్‌కు మోదీ ప్రభుత్వం సమన్లు.. ఆగస్టు 5, 6 తేదీల్లో విచారించనున్న కేంద్రం
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget