అన్వేషించండి

Congress Twitter Lock: కాంగ్రెస్ పార్టీ అఫీషియట్ ట్విట్టర్ అకౌంట్ బ్లాక్... ఇంకా 5వేల మందివి కూడా...! ఎందుకంటే..?

కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తల ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేసింది. నిబంధనలు ఉల్లంఘించడమే కారణమన్న సందేశాన్ని వారికి ట్విట్టర్ పంపింది.


కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ ముఖ్య నేతలందరికీ మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ షాకిచ్చింది.  కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విటర్ అకౌంట్‌ను బ్లాక్ చేసేసింది. అలాగే ఆ పార్టీకి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దాదాపుగా ఐదు వేల మంది ట్విట్టర్ అకౌంట్లను కూడా నిలిపివేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన ఓ దళిత బాలిక అత్యాచారం, హత్య కేసు ఘటనలో బాధితురాలి ఐడెంటీటీని ట్విట్టర్‌లో బయట పెట్టారంటూ రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శలు చేస్తోంది.  దీన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ మహిళా కమిషన్ ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత ట్విట్టర్ రాహుల్ గాంధీ అకౌంట్‌ను బ్లాక్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్‌తో పాటు సోషల్ మీడియాలో చురుకుగా పోస్టులు పెట్టే కీలక నేతలతో పాటు దాదాపుగాఐదు వేలమంది అకౌంట్లను బ్లాక్ చేసేసింది.  కాంగ్రెస్ పార్టీ గత రాత్రి నుంచి ఎలాంటి పోస్టులను ట్విట్టర్‌లో చేయలేకపోతోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Congress (@incindia)

">

తమను ట్విట్టర్ బ్లాక్ చేసిందని ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో కాంగ్రెస్ పార్టీ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేసింది. ఈ పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ బెదిరింపులకు ట్విట్టర్ లొంగిపోయిందని...  ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తోందని మండిపడింది. కాంగ్రెస్ పార్టీ అంటే.. ఎందుకు అంత భయమని మోడీని ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేయడంపై ట్విట్టర్ స్పందించలేదు.  బ్లాక్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ డైరక్ట్‌గా ఎలాంటిపోస్టులు చేయలేదు కానీ.. తన ఫోలయర్స్‌కు మాత్రం నేరుగా సందేశాలు పంపే అవకాశం ఉంటుంది. కొంత కాలంగా ట్విట్టర్‌గా భారత  ప్రభుత్వానికి మధ్య వివాదాలు  రేగుతున్నాయి.  భారత  ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టం ప్రకారం కొంత మంది ఆఫీసర్లను నియమించడానికి ట్విట్టర్ అంగీకరించ లేదు. దీంతో సోషల్ మీడియా సైట్లకు ప్రభుత్వం కల్పించిన మధ్యవర్తి హోదాను ట్విట్టర్‌కు తొలగించింది. 

దీంతో ట్విట్టర్‌లో ఎవరు అభ్యంతరకర ట్వీట్లు చేసినా ఆ సంస్థనే బాధ్యుల్ని చేయడం ప్రారంభించారు. రెండు, మూడు సార్లు కేసులుపెట్టి నోటీసులు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ట్విట్టర్ .. కేంద్ర చట్టాన్ని అమలు చేస్తోందని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసినట్లుగా ట్విట్టర్... రాహుల్ గాంధీ అకౌంట్‌ను బ్లాక్ చేసింది. ఇప్పుడు ఎవరు ఫిర్యాదు చేశారో స్పష్టత లేదు కానీ.. కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీకి చెందిన ఐదు వేల మంది కార్యకర్తల అకౌంట్లను కూడా బ్లాక్ చేశారు. మళ్లీ ఎప్పుడు అకౌంట్లను పునరుద్ధరిస్తారో  ట్విట్టర్ చెప్పలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం... భావవ్యక్తీకరణ స్వేచ్చపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని దానికి ట్విట్టర్‌తో వ్యవహరిస్తున్న విధానమే కారణమని ఆరోపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం! 
అన్నం పెట్టిన వాడిని మర్చిపోతమా? మరోసారి హాట్ కామెంట్స్ చేసిన పోచారం! 
Sukhbir Singh Badal News: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
Digital India: డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget