అన్వేషించండి

Elon Musk: మీ భార్య ఎక్కడ? ఎలాన్‌ మస్క్‌కు ఊహించని ప్రశ్న

Elon Musk: బిలియనీర్‌, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది.

బిలియనీర్‌, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగాన్‌ అమెరికా పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మస్క్‌తో సమావేశమయ్యారు. న్యూయార్క్‌లోని యునైటెడ్‌ నేషన్స్‌ భవనం సమీపంలో ఉన్న టర్కిష్‌ హౌస్‌లో వీరి సమావేశం జరిగింది. అయితే ఈ మీటింగ్‌కు మస్క్‌ తన కుమారుడు ఎక్స్‌ను తీసుకుని వచ్చారు. సమావేశం జరిగిన సమయంలో మస్క్‌ తన కొడుకును ఒడిలోనే కూర్చోబెట్టుకున్నారు. దీంతో ఎర్డోగాన్‌ బాబుతో ఆడుకునే ప్రయత్నం చేశారు. పలు మార్లు ఫుట్‌బాల్‌ బౌన్స్‌ చేసి పట్టుకొమ్మని అడిగారు. కానీ బాబు పట్టుకోలేదు. 

కొంచెం సేపటి తర్వాత టర్కీ అధ్యక్షుడి నుంచి మస్క్‌కు అనుకోని ప్రశ్న ఎదురైంది. మస్క్‌ను మీ భార్య ఎక్కడ అని ఎర్డోగాన్‌ అడిగారు. దీంతో మస్క్‌.. 'ఆమె శాన్‌ఫ్రాన్సిస్‌కోలో ఉంది. ఇప్పుడు మీము విడిపోయాం. అందుకే బాబును ఎక్కువగా నేనే చూసుకుంటున్నాను' అని సమాధానమిచ్చారు. 

మస్క్‌తో జరిగిన సమావేశంలో టర్కీలో టెస్లా కంపెనీ ఏడో కర్మాగారాన్ని స్థాపించాలని టర్కీ అధ్యక్షుడు కోరారు. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, స్టార్‌లింక్‌పై సహకారానికి టర్కీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన తెలిపారు. కొత్త కర్మాగారం స్థాపించడానికి అత్యంత ముఖ్యమైన అభ్యర్థనల్లో మీది ఉందని మస్క్‌ ఎర్డోగాన్‌తో తెలిపారు. టర్కీలో స్టార్‌లింక్‌ శాటిలైట్‌ సేవలను అందించడానికి అవసరమైన లైసెన్స్‌లను పొందేందుకు టర్కీ అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు స్పేస్ ఎక్స్‌ భావిస్తున్నట్లు మస్క్‌ వెల్లడించారు.

మస్క్‌కు, కెనడియన్‌ సింగర్‌ గ్రిమ్స్‌తో ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే వారు ఇప్పుడు విడిపోయారు. వీరి మొదటి సంతానం X AE A12 మే 2020లో జన్మించారు. మరో ఇద్దరు పిల్లలు ఒక పాప, ఒక బాబు కూడా ఉన్నారు. పాప పేరు ఎక్సా డార్క్‌ సైడెరాల్ మస్క్‌, బాబు పేరు టెక్నో మెకానికస్‌. మూడో సంతానం గురించి కేవలం ఒక నెల ముందే బయటకు వచ్చింది. ఎలాన్‌ మస్క్‌, గ్రిమ్స్‌ వివాహం చేసుకోలేదు. కానీ గత సెప్టెంబరులోనే వీరు విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఎలాన్‌ మస్క్‌కు ఇంతకంటే ముందు కెనడియన్‌ రచయిత జస్టిన్‌ విల్సన్‌తో వివాహం జరిగింది. ఇంకా ఇంగ్లిష్‌ యాక్టర్‌ తాలులా రిలేను కూడా పెళ్లి చేసుకున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై హౌస్ కమిటీ వేయాలని శాసనమండలిలో BRS ఎమ్మెల్సీలు డిమాండ్!
రాఘవ కన్‌స్ట్రక్షన్‌పై హౌస్ కమిటీ వేయాలని శాసనమండలిలో BRS ఎమ్మెల్సీలు డిమాండ్!
Visakhapatnam Crime News: డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
విశాఖలో డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
Tamil Nadu Elections 2026: పొత్తుల్లో ఉన్నా.. డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులపైనే పోటీ - తమిళ రాజకీయాల్లో చిన్న పార్టీల స్టైల్ - ఇలా ఎలా ?
పొత్తుల్లో ఉన్నా.. డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులపైనే పోటీ - తమిళ రాజకీయాల్లో చిన్న పార్టీల స్టైల్ - ఇలా ఎలా ?
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
Visakhapatnam Crime News: భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
భార్యలేని టైంలో యువతిని ఇంటికి పిలిచి హత్య, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో.. విశాఖలో దారుణం
IPL 2026 MI Vs KKR Result Update: ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
Embed widget