అన్వేషించండి

US Elections 2024: అమెరికా ఎన్నికల్లో ఉచిత హామీలు- IVF ఖ‌ర్చు ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని ట్రంప్ క్రేజీ ఆఫర్‌

America Elections2024: అమెరికా మ‌హిళ‌ల కోసం ట్రంప్ స‌రికొత్త హామీతో ముందుకొచ్చారు. గ‌ర్భ‌ధార‌ణ కోసం ఇబ్బందులు ప‌డుతున్న మ‌హిళ‌ల‌కు IVF ఖ‌ర్చు ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని హామీ ఇచ్చారు.

Free IVF Treatment for American women అమెరికా ఎన్నిక‌ల్లో రిప‌బ్లిక‌న్ పార్టీ నుంచి అధ్య‌క్ష అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ అమెరిక‌న్ మ‌హిళ‌ల కోసం క్రేజీ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. తాను అధికారంలోకి వ‌స్తే మ‌హిళ‌ల‌కు IVF ఖ‌ర్చు ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని హామీ ఇచ్చారు. ఆరోగ్య బీమా కంపెనీలు సైతం త‌ప్ప‌నిస‌రిగా త‌మ పాల‌సీలో ఈ ప‌థ‌కాన్ని చేర్చేలా చూస్తాన‌ని ఆయన అన్నారు.

న‌వంబ‌ర్‌లో జ‌ర‌గనున్న అధ్య‌క్ష ఎన్నికల్లో డెమోక్రాట్ అభ్య‌ర్థిగా క‌మ‌లా హారిస్‌, రిప‌బ్లిక‌న్ పార్టీ నుంచి మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్  పోటీ చేస్తున్నారు. పోటీ నువ్వా నేనా అనేలా సాగుతున్న నేప‌థ్యంలో ఓట‌ర్లను ఆక‌ర్షించేందుకు ట్రంప్ కొత్త కొత్త ఆఫ‌ర్ల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. తాజాగా IVF ఖ‌ర్చు ప్ర‌భుత్వం భ‌రిస్తుంద‌ని త‌న ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చేర్చారు. స‌హ‌జ ప‌ద్ధ‌తిలో సంతానం కోసం ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైన మ‌హిళ‌లు IVF విధానాన్ని ఎంచుకుంటారు. చాలాకాలంగా ఈ విధానం ప్రాచుర్యంలో ఉంది. మ‌హిళ‌ల్లోని అండాన్ని, పురుషుల్లోని వీర్యాన్ని క‌లిపి ల్యాబ్‌లో ఫ‌ల‌దీక‌ర‌ణం జ‌రిపించి త‌ర్వాత మ‌హిళ గ‌ర్భాశంలో ప్ర‌వేశ‌పెడ‌తారు. అయితే ఈ విధానంలో గ‌ర్భం నిల‌బ‌డుతుంద‌ని గ్యారంటీ ఉండ‌దు. మ‌ధ్య‌లో గ‌ర్భ విచ్ఛిత్తి కావ‌డ‌మో మరే కార‌ణాల‌తోనో కొంత‌మంది మ‌హిళ‌లు ఈ IVF విధానాన్ని రెండు మూడుసార్లు ప్ర‌య‌త్నించిన సంద‌ర్భాలు కూడా కోకొల్ల‌లు.

IVF ద్వారా బిడ్డ‌ల‌ను క‌న‌డం కొంచెం ఖ‌ర్చుతో కూడుకున్న‌ది. క‌నీసం 10 వేల అమెరిక‌న్ డాల‌ర్లు ఖ‌ర్చ‌వుతోంది. ఒక‌సారి ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మైన‌వారు, ఈ ఖ‌ర్చును భ‌రించ‌లేని మ‌హిళ‌లు మాతృత్వానికి దూరం అవుతున్నారు. అలాంటి వారి ఆర్థిక స‌మ‌స్య‌ల‌తోపాటు బిడ్డ‌ల‌ను క‌నాల‌న్న ఆ దంప‌తుల క‌ల‌ను నిజం చేయ‌డానికి ఈ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు ట్రంప్ ప్ర‌చారం చేస్తున్నారు.

Also Read: అమెరికాను వ‌ణికిస్తున్న దోమలు- పార్క్‌లు మూసివేత- ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరికలు

గురువారం మిచిగాన్ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ట్రంప్ ఈ కొత్త ఎన్నిక‌ల హామీని ప్ర‌క‌టించారు. IVF చికిత్స‌కు అయ్యే మొత్తం ఖ‌ర్చును ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని లేదా బీమా కంపెనీ చెల్లించేలా చూస్తాన‌ని ట్రంప్ ప్ర‌క‌టించారు. 1973లో రే వ‌ర్సెస్ వేడ్ కేసులో అనివార్య ప‌రిస్థితుల్లో మ‌హిళ‌ల‌కు గ‌ర్భ‌విచ్చిత్తి చేయించుకునే హ‌క్కు ఉంద‌ని అమెరికా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఇదే న్యాయ‌స్థానం గతేడాది ఆ తీర్పును కొట్టివేస్తూ మ‌రోసారి కొత్త తీర్పు చెప్పింది. ఈ విష‌యంపై గ‌త కొన్నాళ్లుగా ట్రంప్ భిన్న‌మైన వాద‌న‌లు వినిపిస్తూ వ‌స్తున్నారు. చివ‌రికి ఈ అంశాన్ని ఆయా రాష్ట్రాల‌కు వ‌దిలేయ‌డ‌మే మంచిద‌నే నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌పై డెమోక్రాట్లు ట్రంప్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నారు.

Also Read: న‌మీబియాలో క‌రవు- ప్ర‌జ‌ల ఆక‌లి తీర్చ‌డానికి అడ‌వి జంతువుల వ‌ధ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget