అన్వేషించండి

Siddaramaiah : సిద్ధరామయ్యకు మరిన్ని కష్టాలు - రంగంలోకి దిగనున్న ఈడీ !

Karnataka : కర్ణాటక సీఎం సిద్దరామయ్యను మరిన్ని కష్టాలు చుట్టుముట్టనున్నాయి. ముడా భూముల కేసులో ఈడీ కేసు కేసు నమోదు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది

Trouble mounts for Siddaramaiah as ED likely to probe Karnataka CM in MUDA land scam : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై ఈడీ కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీకి సంబంధిచిన భూుల విషయంలో సిద్ధరామయ్య భార్యకు అదనంగా ప్రయోజనం కల్పించారన్న అంశంపై ఇప్పటికే లోకాయుక్త విచారణకు గవర్నర్ అనుమతించారు. దాన్ని హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో లోకాయుక్త పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఏ వన్ గా చేర్చారు.                                                                       

సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసిన సిద్దరామయ్య         

అయితే ఈ కేసులో ఎక్కడ సీబీఐ వస్తుందోనని ఆందోళన పడుతున్న సిద్ధరామయ్య.. కర్ణాటకలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేస్తూ నిర్ణయం  తీసుకున్నారు. అయితే ఈడీకి ఎలాంటి జనరల్ కన్సెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తనకు ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేసి విచారణ చేయవచ్చు. ఇప్పుడు ముడా భూముల కేసులో ఈడీ విచారణ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. 

ముడా భూములను అక్రమంగాపొందారని ఆరోపణలు 

మైసూర్ నగరాభివృద్ధి కోసం  ముఖ్యమంత్రి భార్య పార్వతి నుంచి భూమి సేకరించింది ముడా అధికారగణం.  ఆమె భూమి కోల్పోయిన  గ్రామంలో  కాకుండా మైసూరు నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 14 స్థలాలను కేటాయించడం  అసలు వివాదానికి కేంద్రంగామారింది.  దీనిపై ముగ్గురు సామాజిక కార్యకర్తలు గవర్నర్‌కి పిటిషన్ సమర్పించారు. దీని ఆధారంగా సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపడంతో  రాజకీయ కలకలం ప్రారంభమయింది.  గవర్నర్ ఉత్తర్వులు చట్టబద్ధమైన ఆదేశాలను ఉల్లంఘించిందని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం మంత్రి మండలి సలహాతో సహా రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించిందని సిద్ధరామయ్య  హైకోర్టులో వాదించినా ప్రయోజనం లేకపోయింది.          

న్యాయపోరాటం చేస్తానంటున్న  సిద్దరామయ్య                       

ముడా స్కామ్​లో విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ప్రకటించారు  న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటానని సిద్ధరామయ్య ప్రకటించారు. సీబీఐ రాకుండా ఆపగలిగారు కానీ.. ఈడీ రాకుండా చేయడం ఆయన వల్ల కాదు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ పై ఇప్పటికే తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది .ఇప్పుడు సీఎంపై ఈడీ కేసు నమోదయితే.. ఇంకా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.                           

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ఆకస్మిక పర్యటనకు అసలు కారణం ఇదేనా!
ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ఆకస్మిక పర్యటనకు అసలు కారణం ఇదేనా!
Tirumala News: తిరుమలలో మూడోరోజు ముగిసిన సిట్‌ విచారణ, మంగళవారం విచారించేది ఎవరినంటే!
తిరుమలలో మూడోరోజు ముగిసిన సిట్‌ విచారణ, మంగళవారం విచారించేది ఎవరినంటే!
KTR About Hydra: దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
Siddaramaiah : సిద్ధరామయ్యకు మరిన్ని కష్టాలు - రంగంలోకి దిగనున్న ఈడీ !
సిద్ధరామయ్యకు మరిన్ని కష్టాలు - రంగంలోకి దిగనున్న ఈడీ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ఆకస్మిక పర్యటనకు అసలు కారణం ఇదేనా!
ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ఆకస్మిక పర్యటనకు అసలు కారణం ఇదేనా!
Tirumala News: తిరుమలలో మూడోరోజు ముగిసిన సిట్‌ విచారణ, మంగళవారం విచారించేది ఎవరినంటే!
తిరుమలలో మూడోరోజు ముగిసిన సిట్‌ విచారణ, మంగళవారం విచారించేది ఎవరినంటే!
KTR About Hydra: దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
Siddaramaiah : సిద్ధరామయ్యకు మరిన్ని కష్టాలు - రంగంలోకి దిగనున్న ఈడీ !
సిద్ధరామయ్యకు మరిన్ని కష్టాలు - రంగంలోకి దిగనున్న ఈడీ !
Ram Charan Daughter: ఆ అమ్మాయి రామ్ చరణ్ కూతురు క్లింకారా కాదు... వైరల్ అవుతున్న ఫోటో ఎవరిదో తెలుసా?
ఆ అమ్మాయి రామ్ చరణ్ కూతురు క్లింకారా కాదు... వైరల్ అవుతున్న ఫోటో ఎవరిదో తెలుసా?
HYDRA: రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు -  హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
Best Selling Bikes: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ టాప్-5 బైక్స్ ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయో తెలుసా?
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ టాప్-5 బైక్స్ ఇవే - లిస్ట్‌లో ఏమేం ఉన్నాయో తెలుసా?
Konda Surekha: నిన్నటి నుంచి భోజనం చేయలేదు, కేటీఆర్ నీ చెల్లికి అయితే ఊరుకుంటావా! మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు
నిన్నటి నుంచి భోజనం చేయలేదు, కేటీఆర్ నీ చెల్లికి అయితే ఊరుకుంటావా! మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు
Embed widget