(Source: ECI | ABP NEWS)
Rafale Jets: రాఫెల్ జెట్స్ పై పాకిస్తాన్ ప్రశ్నలే వేస్తున్న కాంగ్రెస్ నేతలు - అన్నీ చూపిస్తున్నా అదే రాజకీయం -ఎందుకిలా ?
Rafale Row: రాఫెల్ జెట్స్ కూలిపోయాయని వాటి వివరాలు చెప్పాలని కాంగ్రెస్ ముఖ్య నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసలు రాఫెల్ జెట్స్ కూలిపోయాయని ఆర్మీ ప్రకటించలేదు. పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటోంది.

Politics On Rafale jets: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఎన్ని రాఫెల్ జెట్లను కోల్పోయిందో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో జైహింద్ ర్యాలీ నిర్వహించిన తర్వాత చేసిన ప్రసంగంలో ఈ ప్రశ్నలు వేశారు. ప్రధాని నరేంద్రమోదీ చెల్లని రూపాయి అని.. రద్దు చేసిన వెయ్యి నోటు లాంటి వాడన్నారు. రాహుల్ ప్రధానిగా ఉండి ఉంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఈ పాటికే దేశంలో కలిపేసి ఉండేవారని చెప్పుకొచ్చారు. మోదీపై విమర్శలు, రాహుల్ పై పొగడ్తలు ఎన్ని ఉన్నా.. రాఫెల్ జెట్లపై రాహుల్ గాందీ అడిగిన ప్రశ్నలను రిపీట్ చేయడం జాతీయ రాజకీయాల్లోనూ హైలెట్ అవుతోంది.
రాఫెల్ జెట్స్ కోల్పోయామని చెప్పని సైన్యం
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. భారత్ పై పాకిస్తాన్ కూడా దాడులు చేసింది. యుద్ధం జరిగినప్పుడు రెండు వైపులా నష్టం ఉంటుంది. పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేశామని భారత్ ఆధారాలను ప్రదర్శించింది. భారత్ లో ఫలానా బేస్‌లు, విమానాలు ధ్వంసం చేశామని పాకిస్తాన్ ప్రకటించుకుంది కానీ ఒక్కటంటే ఒక్క ఆధారం చూపించలేకపోయింది. ఆర్మీ కూడా.. యుద్ధంలో నష్టం జరగడం సహజమని చెప్పింది కానీ రాఫెల్ జెట్లను కోల్పోయామని చెప్పలేదు.
రాఫెల్ జెట్లు కూల్చివేశామని చెప్పుకుంటున్న పాకిస్తాన్
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైన తొలి రోజు నుంచి పాకిస్తాన్ .. ఫేక్ ప్రచారం చేస్తోంది. భారత్ కు చెందిన మూడు జెట్లు కూల్చివేశామని అందులో రాఫెల్ కూడా ఉందని చెప్పుకుంది. అయితే వాటికి ఆధారాలేమిటో బయట పెట్టలేదు. ఓ అంతర్జాతీయ న్యూస్ చానల్ ఇంటర్యూలో మాట్లాడిన పాకిస్తాన్ రక్షణ మంత్రి మూడు ఇండియన్ జెట్స్ కూల్చివేశామని క్లెయిమ్ చేసుకున్నారు. ఆధారాలు ఏమిటి అని ఆ యాంకర్ అడిగితే.. సోషల్ మీడియాలో వస్తోందని చెప్పారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని బట్టి చెబితే ఇక వారి దగ్గర ఆధారాలు ఏమున్నట్లు ?
జెట్లు ఎన్ని కోల్పోయామో చెప్పాలని డిమాండ్ చేస్తున్న రాహుల్
కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన సైన్యం ప్రెస్ మీట్ పెట్టింది. పాకిస్తాన్ కు ఎంత నష్టం చేశామో వివరించారు. ఆ సమయంలో ఓ మీడియా ప్రతినిధి భారత్ కు జరిగిన నష్టం గురించి ప్రశ్నించారు. యుద్ధం అన్న తర్వాత రెండు వైపులా నష్టం ఉంటుందని చెప్పారు కానీ.. పూర్తి వివరాలు వెల్లడించలేదు. శత్రు దేశాలకు సమాచారం అందకుండా చేయడం, మన బలగాల ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రకటించలేదు. కానీ రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే భారత్ కు జరిగిన నష్టం వివరాలు చెప్పాలని.. రాఫెల్ జెట్లు ఎన్ని కోల్పోయామో చెప్పాలని అడుగుతున్నారు.
అన్నింటినీ చూపించిన ఆర్మీ
పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకున్న వాటికి సంబంధించి భారత్ అన్నీ ఆధారాలు సమర్పించింది. అదంపూర్ ఎయిర్ బేస్ ను ధ్వంసం చేశామని చెప్పుకుంది. అలాగే 5400ని సుఖోయ్ యుద్ధ విమానాన్ని కూల్చేమని చెప్పుకుంది. అదంపూర్ కు స్వయంగా ప్రధాని వెళ్లి అవన్నీ దృశ్యాల్లో చూపించి పాకిస్తాన్ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టారు. తర్వాత రాఫెల్ జెట్ల వీడియోలను కూడా పోస్టు చేశారు. భారత్ కు కొంత మేర నష్టం జరిగి ఉండవచ్చు కానీ.. పాకిస్తాన్ చెప్పినట్లుగా కాదని వాటితో స్పష్టమయిదంి. అయితే కాంగ్రెస్ పార్టీ నేలు మాత్రం పాకిస్తాన్ వాదన తరహాలో ఆ సమాచారం చెప్పాలని డిమాండ్ చేస్తూండటం వివాదాస్పదమవుతోంది.





















