అల్లు అర్జున్‌పై కేసు నమోదు


హీరో అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా జన సమీకరణ చేశారని రిటర్నింగ్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిపై కేసు నమోదైంది. అయితే, కాగా శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేసేందుకు బన్నీ శనివారం నంద్యాలలో పర్యటించారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పర్మిషన్ లేకుండా జన సమీకరణ చేయడం వివాదానికి దారి తీసింది. సినీ నటుడు అల్లు అర్జున్ నంద్యాలలో ర్యాలీలో వేలాది మందితో పాల్గొన్నందునే ఈ కేసు నమోదు చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు. ఇంకా చదవండి


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రలోభాల జోరు


దక్షిణాదిలో ఎన్నికలు అంటేనే ఎక్కువ మంది డబ్బుల ఖర్చు గురించి చర్చించుకుంటారు. ఎందుకంటే ఎన్నికలు అత్యంత కాస్ట్‌లీగా మారాయి. అందులో ఓట్ల కొనుగోలు అనేది ఓ పెద్ద ప్రక్రియ. దీనికి అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షనీరింగ్ అనే పేరు పెట్టుకున్నాయి. ఈ సారి ఎన్నికల్లో డబ్బు పంపిణీ ప్రక్రియ జోరు మీద సాగింది. నిజానికి ప్రచారం ముగిసిన రోజు రాత్రి గతంలో డబ్బుల పంపిణీ పూర్తి చేసేవారు. ఈ సారి అలా లేదు. ఇంకా చదవండి


తెలంగాణ నుంచి ఏపీకి పయనం, రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి


వరంగల్: మే 13న ఎన్నికల సందర్భంగా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు తమ సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. అందులోనూ ఈసారి వీకెండ్ కూడా తోడవ్వడంతో పెద్ద ఎత్తున ఓటర్లు హైదరాబాద్ సహా తెలంగాణలోని జిల్లాల నుంచి ఏపీకి తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఉమ్మడి వరంగల్ నుంచి ఏపీకి బయలుదేరిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో విషాదం నెలకొంది. ఇంకా చదవండి


మే 13న సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు తప్పవు


తెలంగాణలో నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం మే 13న లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తోంది. పోలింగ్ రోజున అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు (Paid Leave) ఇవ్వాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు ఉంటాయని తెలంగాణ ఎన్నిల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ (Telangana CEO Vikas Raj) తెలిపారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కొన్ని ఐటీ, ప్రైవేట్ కంపెనీలు సెలవు ఇవ్వలేదని ఈసీకి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇంకా చదవండి


మోదీ రిటైర్ అయ్యే ఛాన్సే లేదు -అమిత్ షా క్లారిటీ


మూడోసారి అధికారంలోకి వస్తే నరేంద్ర మోదీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటారని, అమిత్ షా ప్రధాని అవుతారని అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఈ కామెంట్స్‌పై అమిత్‌ షా స్పందించారు. 75 ఏళ్లు నిండగానే మోదీ రాజకీయాల నుంచి తప్పుకుంటారని కేజ్రీవాల్ అనవసరంగా కలలు కంటున్నారని చురకలు అంటించారు. బీజేపీ రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏమీ లేదని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీయే ప్రధానిగా ఉంటారని..ఈ విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష కూటమికి అలాంటి శుభవార్త ఏమీ ఉండకపోవచ్చంటూ సెటైర్లు వేశారు. ఇంకా చదవండి


హోటల్‌ గదిలో ఇద్దరు వ్యక్తులతో భార్య


భార్య ఓ హోటల్ గదిలో ఇద్దరు ప్రియులతో ఉందని ఆరోపిస్తూ ఆమెపై భర్త దాడి చేసిన ఘటన యూపీలో కలకలం రేపింది. ఆమెతో పాటు ఉన్న ఆ ఇద్దరు వ్యక్తుల్నీ చితకబాదాడు. వైద్యుడైన భర్త మొత్తం కుటుంబ సభ్యులతో సహా హోటల్‌కి వెళ్లిన ముగ్గురిపైనా దాడి చేశాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హోటల్‌కి వచ్చారు. మహిళతో పాటు, ఆమెతో ఉన్న ఇద్దరు వ్యక్తుల్నీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తరవాత ఆమె భర్త ముగ్గురిపైనా ఫిర్యాదు చేశాడు. ఇంకా చదవండి


‘కన్నప్ప’లో ప్రభాస్‌కు నచ్చిన క్యారెక్టర్ చేస్తున్నాడు


ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ స్పీడ్ తగ్గిపోయింది. సినిమాల ఔట్‌పుట్ బాగా రావాలని చాలా సమయం తీసుకుంటున్నాడు ఈ హీరో. కానీ ఇప్పటినుండి అలా జరగకూడదని సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో దాదాపు అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంతే కాకుండా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’లో కూడా ప్రభాస్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ మొదలయినప్పటి నుండి ఇందులో ప్రభాస్.. శివుడిగా కనిపిస్తున్నట్టుగా రూమర్స్ వైరల్ అయ్యాయి. ఆ రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ మంచు విష్ణు తాజాగా ఒక వీడియోను విడుదల చేశాడు. ఇంకా చదవండి


హిందీ ప్రేక్షకులను హర్ట్ చేసిన ‘ఆవేశం’


సినిమాల్లో ప్రతీ చిన్న విషయాన్ని.. పెద్దగా చేసి చూస్తారు కొందరు ప్రేక్షకులు. సినిమాలో ఉండే డైలాగ్స్ గానీ, సీన్స్ గానీ కేవలం ఎంటర్‌టైన్మెంట్ కోసమే అనుకోకుండా దాని నుండి వివాదం సృష్టించేవారు కూడా ఉంటారు. అలాగే ఫాహద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ మూవీ నుండి ఒక సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సీన్‌లో ఫాహద్ ఫాజిల్, తన అనుచరుడి మధ్య ఉండే డైలాగ్.. హిందీ భాషను అవమానించినట్టుగా ఉందంటూ కొందరు ఈ సీన్‌ను, డైలాగ్‌ను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంకా చదవండి


ఢిల్లీకి దిమ్మతిరిగే షాక్‌, పంత్‌పై నిషేధం


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)) జరగబోయే అత్యంత కీలక మ్యాచ్‌కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టుకి భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్‌(Rishabh Pant)పై ఒక మ్యాచ్ నిషేధం పడింది. రూ.30 లక్షల జరిమానా విధించడంతో పాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించిన ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ వెల్లడించింది. ఇంకా చదవండి


రేటు పెరిగినా తగ్గని పసిడి


భారతీయులు ప్రపంచంలో ఏ మూలన నివశిస్తున్నా తమ సాంప్రదాయం ఫాలో అవుతూ అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి వంటి విలువైన లోహాలను కొనుగోలు చేస్తుంటారు. దీనిని చాలా శుభప్రదంగా భావిస్తుంటారు. కనీసం ఒక్క గ్రామైనా కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చాలా మంది భావిస్తున్నారు. ఇంకా చదవండి