Daily Horoscope -  రాశిఫలాలు (12-05-2024)


మేష రాశి
ఈ రోజు మేషరాశి వారి జీవితాల్లో అనుకోని మార్పు వస్తుంది. డబ్బును తెలివిగా ఖర్చు చేయండి. ఉద్యోగులు పనిలో అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. తెలివిగా తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు  రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.  వాహనం నిర్వహణకు డబ్బు ఖర్చు అవుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు. 


వృషభ రాశి
ఈ రోజు ఆర్థిక విషయాలలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. మీ పనితీరుపై దృష్టి పెట్టండి.  కుటుంబ సమేతంగా ఏదైనా మతపరమైన ప్రదేశాలను సందర్శిస్తారు. కొత్త ఆస్తుల కొనుగోలుకు అవకాశం ఉంది. విద్యార్థులు మంచి ఫలితాలని పొందుతారు. మూడ్ స్వింగ్స్ కారణంగా మీరు సంబంధాలలో సమస్యలను ఎదుర్కోవచ్చు. 


మిథున రాశి
మిథున రాశివారికి ఈ రోజు కుటుంబంలో సంతోషం ఉంటుంది. కెరీర్లో పురోగతికి అవకాశాలున్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుతాయి. కొందరు వ్యక్తులు పూర్వీకుల ఆస్తి నుంచి లాభపడతారు. వస్తుసౌఖ్యాలు, సంపద పెరుగుతుంది. విద్యార్థులు పోటీపరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీరి జీవితంలో ఒక్కో మెట్టు పైకెక్కుతారు. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు.  


Also Read: ఈ రాశులవారికి పెళ్లయ్యాక కష్టాలు - సవాళ్లు తప్పవు!


కర్కాటక రాశి
వృత్తి-ఉద్యోగంలో మంచి మరో మెట్టు ఎక్కుతారు. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలుంటాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. పనిలో ఎక్కువ ఒత్తిడి తీసుకోకండి.  సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి  భావోద్వేగాల విషయంలో సున్నితంగా ఉండండి.  


సింహ రాశి
ఈ రోజు సింహ రాశి వారు తమ కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. వస్తు సౌకర్యాలు పెరుగుతాయి. కొత్త పనులకు బాధ్యత వహిస్తారు. మీ కలలను సాకారం చేసుకునేదిశగా అడుగులు వేయండి.  డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోండి.   ధన ప్రవాహం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంతో సంతోష సమయం గడపుతుంది. 


Also Read: ఈ రాశులవారు టామ్ అండ్ జెర్రీ టైప్ - పెళ్లి జరిగితే ఇల్లు కురుక్షేత్రమే!


కన్యా రాశి
ఈ రోజు మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులుంటాయి. వృత్తి జీవితంలో అన్ని పనులు విజయవంతమవుతాయి. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.  కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే క్షణాలను ఆస్వాదిస్తారు. మీరు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి పొందుతారు. పాత ఆస్తులను అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు మంచి అవకాశాలు పొందుతారు. 


తులా రాశి
ఈ రోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. కార్యాలయంలో పోటీ వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. స్నేహితులతో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారం విస్తరిస్తారు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కారం దిశగా ప్రయత్నించాలి. 


Also Read: ఈ రాశులవారి వైవాహిక జీవితం అత్యంత సంతోషంగా ఉంటుంది!


వృశ్చిక రాశి
వృత్తి జీవితంలో మీ పనికి మీరు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. ఆదాయాన్ని పెంచుకునే మార్గాల కోసం వెతుక్కోండి. ఇంటికి అతిధుల రాక వల్ల సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త ఆస్తి లేదా వాహన కొనుగోలుకు అవకాశం ఉంది. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించండి. కొందరికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి.  ఆస్తి సంబంధిత వివాదాల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. 


ధనస్సు రాశి
చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికందుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆస్తి సంబంధిత విషయాలలో నిపుణుల సలహా తీసుకోవడానికి వెనక్కు తగ్గొద్దు. ఉద్యోగులు కెరీర్లో ముందుకు సాగుతారు.  ప్రమోషన్  అవకాశాలు పెరుగుతాయి. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది.


మకర రాశి
ఆర్థిక విషయాలలో సవాళ్లు పెరుగుతాయి. ఈగో  వల్ల వృత్తి జీవితంలో సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. పాత ఆస్తులను విక్రయించడం ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. విద్యార్ధులు సంతోషకరమైన ఫలితాలను పొందుతారు. మీ భాగస్వామితో మానసిక బంధం బలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాయామంపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.


Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!


కుంభ రాశి
ఉద్యోగం ,  వ్యాపారంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. మీ బడ్జెట్‌పై శ్రద్ధ వహించండి. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. దానధర్మాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆస్తి లేదా వాహన కొనుగోలుకు అవకాశం ఉంది. ఈ రోజు మీరు మీ తోబుట్టువులకు ఆర్థిక సహాయం అందించాల్సి రావొచ్చు. 


మీన రాశి
ఈ రోజు మీన రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆరోగ్యం గురించి మనసులో ఆందోళన ఉంటుంది.  వృత్తి జీవితంలో విజయాల మెట్లు ఎక్కుతారు. ఆస్తి కొనుగోలుకు అనుకూలమైన రోజు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు.  వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్‌లో పని చేసే అవకాశాన్ని పొందుతారు.కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది..


Also Read: విభీషణుడు సహా ఇప్పటికీ జీవించి ఉన్న పురాణ పురుషులు వీళ్లే!


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.