Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి కీలక మలుపు. ఇద్దరు వ్యక్తులను జీవితాంతం ఒకటిగా ఉంచే సూత్రం వివాహం. అందుకే వివాహం నిశ్చయం చేసే సమయంలో జాతకాలు సరిచూస్తారు. జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ఆ బంధం కలకాలం ఉంటుందనుకున్నప్పుడే వివాహం జరిపిస్తారు. అయితే ఎన్ని జాతకాలు సరిచూసినా కొందరి జీవితం అత్యంత ఆనందంగా ఉంటే మరికొందరి జీవితంలో ఇబ్బందులు తప్పవు. ఇది మీ రాశిపై ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ముఖ్యంగా కొన్ని రాశులవారి వైవాహిక జీవితం అత్యంత ఆనందంగా ఉంటుందట..


Also Read: అక్షయతృతీయ రోజు బంగారం కొనేవాళ్లంతా ఇది తెలుసుకోండి!


మేష రాశి 


ఈ రాశివారు తమ వైవాహిక జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలని భావిస్తారు..అందుకు తగిన ప్రయత్నాలన్నీ చేస్తారు. రోజురోజుకి బంధాన్ని బలపర్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటారు. ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ లు ఇస్తూ భాగస్వామి మనసు గెలుచుకుంటారు. జీవితం ఇలా సంతోషంగా గడిచిపోతే చాలు అనుకుంటారు 


కర్కాటకరాశి


ఈ రాశివారి మనసులో కొండంత ప్రేమ ఉంటుంది కానీ...భాగస్వామి అది అర్థం చేసుకోవాలి. చాలా సున్నితమైన హృదయం కలవారు. జీవిత భాగస్వామిని ఎంతో సంతోషంగా చూసుకోవాలి అనుకుంటారు. అనుక్షణం వాళ్లని ఆనందంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. వారి భావాలు లోతుగా అర్థం చేసుకుంటారు. అయితే మనసులో మాటని ఓపెన్ గా చెప్పలేకపోవడం వల్ల వీరిని ఒక్కోసారి జీవిత భాగస్వామి వీరిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ రాశివారు మాత్రం వైవాహిక జీవితంలో సంతోషంగానే ఉంటారు. 


Also Read: శమంతక మణి గురించి ప్రచారంలో ఉన్న కథలేంటి - ఇప్పుడా మణి ఎక్కడుందో తెలుసా!


సింహ రాశి


సింహ రాశివారిది డామినేటింగ్ నేచర్. అయితే వీరికి స్వతంత్ర్యంగా ఉండే భాగస్వామి కన్నా తమపై ఆధారపడే వారంటే ఇష్టం. ప్రేమను ప్రదర్శిండంలోనూ వీరిదే పైచేయి. తనకి ఏం కావాలో చెప్పకుండా తెలుసుకుని ఎప్పటికప్పుడు నెరవేర్చేస్తారు. భాగస్వామిని సంతోషంగా ఉంచేందుకు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. చిన్న చిన్న సమస్యలున్నా వాటిని అధిగమించి వైవాహిక జీవితంలో ఉండే ఇబ్బందులను క్లియర్ చేసేసుకుంటారు. 


ధనస్సు రాశి


ధనుస్సు వారిది ఆహ్లాదకరమైన స్వభావం. వీళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, తమతో ఉండేవారు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తామే సర్దుకుపోవాలని కోరుకుంటారు. అందుకే వీరి కారణంగా జీవిత భాగస్వామి ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. వివాహానికి కట్టుబడి ఉన్న రాశుల్లో వీరు నంబవ్ వన్. 


Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!


మీన రాశి


ఈ రాశివారు జీవిత భాగస్వామికి పూర్తిగా అంకితం అయిపోయినట్టే ఉంటారు. తమ భావోద్యేగాలను పారదర్శకంగా వ్యక్తపరచాలని అనుకుంటారు.. ఎదుటి వారినుంచి కూడా అదే కోరుకుంటారు. వైవాహిక జీవితాన్ని అందంగా, ఆనందంగా ఉంచేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే ఈ రాశివారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. 


Also Read: విభీషణుడు సహా ఇప్పటికీ జీవించి ఉన్న పురాణ పురుషులు వీళ్లే!


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.