Telangana State Education Common Entrance Test - 2024: తెలంగాణలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ఎడ్‌సెట్-2024 (TS EDCET-2024) దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. ఎలాంటి ఆలస్యరుసుం లేకుండా మే 10 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక రూ.250 ఆలస్యరుసుముతో మే 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎడ్‌సెట్ పరీక్షల బాధ్యతను చేపట్టింది. టీఎస్‌ఎడ్‌సెట్-2024 (TS EDCET-2024) నోటిఫికేషన్ మార్చి 4న విడుదలైన సంగతి తెలిసిందే. 


వివరాలు..


* తెలంగాణ ఎడ్‌సెట్ - 2024 


అర్హత..
ఎడ్‌సెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. డిగ్రీ చివరిసంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


వయోపరిమితి: అభ్యర్థుల వయసు 01.07.2024 నాటికి 19 సంవత్సరాలు నిండి ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.550 చెల్లిస్తే సరిపోతుంది. 


పరీక్ష విధానం..
మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ (10వ తరగతి వరకు)- 60 ప్రశ్నలు-60 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్-20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & ఎడ్యుకేషనల్ ఇష్యూస్-30 ప్రశ్నలు-30 మార్కులు, కంప్యూటర్ అవేర్‌నెస్-20 ప్రశ్నలు-20 మార్కులు.


ఎడ్‌సెట్ 2024 సిలబస్ వివరాల కోసం క్లిక్ చేయండి..


అర్హత మార్కులు..
పరీలో అర్హత మార్కులను 25 శాతం(38 మార్కులు)గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. అయితే ఎన్‌సీసీ/స్పోర్ట్స్ కోటా/పీహెబ్/ఆర్మ్‌డ్ పర్సనల్ కోటాకు చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం నిర్ణీత కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. 


తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, నల్గొండ, కోదాడ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం(పాల్వంచ, సుజాతనగర్), సత్తుపల్లి, కరీంనగర్, జగిత్యాల, హుజురాబాద్, మంథని, సిద్ధిపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి (నర్సాపూర్, సుల్తాన్‌పూర్, పటాన్‌చెరు, రుద్రారం), ఆదిలాబాద్, నిజామాబాద్, ఆర్మూర్, వరంగల్, హన్మకొండ, హసన్‌పర్తి, నర్సంగపేట. 


ఏపీలో పరీక్ష కేంద్రాలు: కర్నూలు, విజయవాడ.


ముఖ్యమైన తేదీలు..


➥ TS Ed.CET – 2024 షెడ్యూలు వెల్లడి: 10.02.2024. 


➥ TS Ed.CET – 2024 నోటిఫికేషన్ వెల్లడి: 04.03.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.03.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.05.2024. (10.05.2024 వరకు పొడిగించారు)


➥ రూ.250 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.05.2024.


➥ TS Ed.CET-2023 పరీక్ష తేది: 25.05.2023.


➥ పరీక్ష సమయం: మొదటి సెషన్: 10.00 AM -12.00 AM, రెండో సెషన్: 2.00 PM - 4.00 PM.


Notification


 Application Fee Payment


Know Your Payment Status


Fill Application Form


Print Your Filled in Application Form


Website


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..