IPL 2024: నిన్న రాత్రి హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షం కుమ్మేసింది. దాదాపు ఐదు గంటల పాటు పడిన వానతో సిటీ మొత్తం తడిసి ముద్దైంది. ప్రత్యేకించి ఐపీఎల్‌లో ఈ రోజు మ్యాచ్ చాలా క్రూషియల్. ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు రాత్రికి జరగాల్సిన SRH వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ తో ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలని రెండు టీమ్స్ భావిస్తున్నాయి. 

పైగా ఇవాళ SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బర్త్ డే కాబట్టి పుట్టినరోజు నాడు సైలెన్సర్ LSG ని సైలెంట్ చేస్తాడని ఫ్యాన్స్ అంతా మంచి ఎక్స్ పెక్టెషన్స్‌తో ఉన్నారు ఈ రోజు మ్యాచ్‌పై. ఇలాంటి టైమ్‌లో రాత్రి కురిసిన భారీ వర్షం ఉప్పల్ స్టేడియాన్ని ముంచేసింది. కవర్లు కప్పి ఉంచినా భారీగా ఈదురుగాలులు రావటంతో పిచ్ మొత్తంగా బురదగా మారింది. 

ఉదయానికి వర్షం ఆగటం.. మ్యాచ్‌కు ఇంకా 12గంటల సమయం ఉండటంతో పిచ్‌ను మళ్లీ రెడీ చేసేందుకు ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు కృషిచేస్తున్నారు. బట్ మళ్లీ వర్షం పడితే మాత్రం పరిస్థితి గందరగోళమే. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ ఓవర్లు కుదించి ఏదో ఫలితం తేలినా పర్లేదు కానీ మ్యాచ్ రద్దైతే మాత్రం ఐపీఎల్ రూల్స్ ప్రకారం రెండు టీమ్‌లకు చెరో పాయింట్ వస్తుంది. 

ఇప్పటికే 12పాయింట్లతో ఉన్న LSG, SRHలు 13పాయింట్లకు చేరుకుని మిగిలిన ఉన్న రెండు మ్యాచులు కచ్చితంగా గెలిచి తీరాల్సిన సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది. కానీ రిస్క్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్‌కి. మ్యాచ్ జరిగి ఏదో ఒక ఫలితం తేలితే..మూడో క్వాలిఫైయర్ బెర్త్‌కి SRH, LSGల్లో ఏదో ఒకటి టెండర్ వేస్తుంది. ఇక మిగిలిన నాలుగో బెర్త్ కోసం CSK ట్రై చేసుకోవచ్చు. 

కానీ మ్యాచ్ రద్దై టీమ్‌కు చెరో పాయింట్ వస్తే మాత్రం ఆ రెండు టీమ్స్‌లో ప్లే ఆఫ్స్‌లో ముందడుగు వేస్తాయి. కాబట్టి తమకున్న మ్యాచుల్లో ఓడిపోతే క్వాలిఫైయర్స్ రేసులో CSK వెనకబడుతుంది. అందుకే ఉప్పల్ లో వానపడితే సీఎస్కేకు చెమటలు పడుతున్నాయి.

హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది?హైదరాబాద్‌లో వాతావరణం చూసుకుంటే ప్రస్తుతానికి ఎండగా ఉంది కానీ సాయంత్రానికి మేఘావృతమవుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు ఉంటే.. కనిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉంటుంది. మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే పరిస్థితి లేదని చెబుతున్నారు.