UP Crime News: భార్య ఓ హోటల్ గదిలో ఇద్దరు ప్రియులతో ఉందని ఆరోపిస్తూ ఆమెపై భర్త దాడి చేసిన ఘటన యూపీలో కలకలం రేపింది. ఆమెతో పాటు ఉన్న ఆ ఇద్దరు వ్యక్తుల్నీ చితకబాదాడు. వైద్యుడైన భర్త మొత్తం కుటుంబ సభ్యులతో సహా హోటల్‌కి వెళ్లిన ముగ్గురిపైనా దాడి చేశాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హోటల్‌కి వచ్చారు. మహిళతో పాటు, ఆమెతో ఉన్న ఇద్దరు వ్యక్తుల్నీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తరవాత ఆమె భర్త ముగ్గురిపైనా ఫిర్యాదు చేశాడు. ఇద్దరు వ్యక్తులతో తన భార్యకి అక్రమ సంబంధం ఉందని ఆరోపించాడు. అయితే...ఆ ముగ్గురిపైనా దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతానికి ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. భార్యా భర్తలిద్దరికీ రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నాయని, అందుకే విడిగా ఉంటున్నారని తెలిసింది. స్థానికంగా ఓ ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తున్న మహిళ భర్తపై ఇప్పటి వరకూ ఎలాంటి కేసు పెట్టలేదు. అయితే...హోటల్ గదిలోని బాత్‌రూమ్‌లో అసభ్యకరమైన స్థితిలో తన భార్యని చూసినట్టు భర్త ఆరోపించాడు. అందుకే ఆవేశంతో దాడి చేసినట్టు చెబుతున్నాడు. 


వీడియోలో ఏముంది..?


సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ వీడియోలో భర్త ముగ్గురిపైనా దాడి చేసిన దృశ్యాలు కనిపించాయి. లోపలికి వచ్చి చెప్పులతో కొట్టారు. బాత్‌రూమ్‌లో ఉన్న సమయంలో ఈ దాడి చేసినట్టు కనిపిస్తోంది. బూతులు తిడుతూ దారుణంగా దాడి చేశారు. ఆ తరవాత పోలీసులు అక్కడికి వచ్చి గదిలో ఉన్న ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.