Elections 2024 :   ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఓ రేంజ్ హై వోల్టేజ్ లో సాగుతున్నాయి. ప్రచారం కూా అలాగే సాగింది. చివరి రోజు అల్లు అర్జున్  కలకలం రేపారు. తమ మిత్రుడు అయిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా వారిద్దరూ నంద్యాలకు  వెళ్లడమే దీనికి కారణం. అల్లు అర్జున్ మూడు రోజుల కిందట పవన్  కల్యాణ్ కు సపోర్టుగా ట్వీట్ పెట్టారు. అయితే చివరి  రోజు వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడంతో ఇక చేసుకోవాల్సిన రాజకయానికి కొరత లేకుండా  పోయింది. 


పవన్  కల్యాణ్ కు ఎలా కౌంటర్ ఇవ్వాలా అని   కొద్ది రోజులుగా తీవ్రంగా తంటాలు పడుతున్న వైసీపీకి.. అల్లు అర్జున్ నంద్యాల పర్యటన ఓ ఆశాకిరణంలా కనిపించింది. వెంటనే ఐ ప్యాక్ రంగంలోకి దిగిపోయింది. నంద్యాల ఎమ్మెల్యే ఇంటికి అల్లు అర్జున్ వెళ్లిన సమయంలో బయట కొంత మంది జనసేన జెండాలతో కనిపించారు. అసలు అల్లు అర్జున్ జనసేన విషయంలో ఎప్పుడూ జోక్యం చేసకోలేదు. ఆయన పవన్ కు వ్యక్తిగతంగా సపోర్టు చేశారు కనీ.. పార్టీకి్ మద్దతు తెలుపలేదు. అసలు జనసేనకు  ఆయనకు సంబంధం కూడా లేదు. అయినా జనసేన జెండాలోత రావడంతో అల్లు అర్జున్ కూడా అవాక్కవ్వాల్సి వచ్చింది.            


అల్లు అర్జున్ తన స్నేహితుడి ఇంటికి పోవచ్చు  కానీ జనసేన జెండాలను వైసీపీ కార్యకర్తలు వాడుకోవడం లో క్లాస్ రాజకీయం అని అదే సమయంలో నంద్యాలలో టీడీపీ ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న చంద్రబాబు కూడా వ్యాఖ్యానించారు. ఇది జరుగుతున్న సమయంలోనే ఐ ప్యాక్ బృందాలు అర్జున్ కు.. మెగాస్టార్ ట్యాగ్ తగిలించి ఆయన వైసీపీకి ప్రచారం చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి. ఈ విషయంలో ఇప్పటికే కొంత వివాదం ఉండటంతో ఐ ప్యాక్ ఆజ్యం పోసినట్లయింది.                                          






తన పర్యటనపై ఇంత రాజకయం జరుగుతుందని అల్లు అర్జున్ ఊహించారో లేదో కానీ ఆయన మీడియాకు మాత్రం పూర్తి క్లారిటీ ఇచ్చారు.  తాను స్నేహితుడి కి మద్దతు తెలిపిందేకు వచ్చాను కానీ పార్టీకి కాదన్నారు. పార్టీలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కానీ ఏపీ రాజకీయాలపై కనీస అవగాహన ఉంటే.. అల్లు అర్జున్  జాగ్రత్తలు తీసుకుని ఉండేారని కానీ ఇప్పటికే ముద్ర పడిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజకీయాలకు అల్లు అర్జున్ ఎప్పుడూ దూరమే. కానీ ఆయన స్నేహితుడి కోసం చేసిన ప్రయత్నం  మాత్రం ఆయనను  చాలా కాలం ఇబ్బంది  పెట్టే అవకాశాలు ఉన్నాయి.