Manchu Vishnu About Kannappa: ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత ప్రభాస్ స్పీడ్ తగ్గిపోయింది. సినిమాల ఔట్‌పుట్ బాగా రావాలని చాలా సమయం తీసుకుంటున్నాడు ఈ హీరో. కానీ ఇప్పటినుండి అలా జరగకూడదని సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో దాదాపు అరడజను ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంతే కాకుండా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’లో కూడా ప్రభాస్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీ మొదలయినప్పటి నుండి ఇందులో ప్రభాస్.. శివుడిగా కనిపిస్తున్నట్టుగా రూమర్స్ వైరల్ అయ్యాయి. ఆ రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ మంచు విష్ణు తాజాగా ఒక వీడియోను విడుదల చేశాడు.


దేశంలోనే ట్రెండింగ్..


తాజాగా ప్రభాస్.. ‘కన్నప్ప’ షూటింగ్‌లో అడుగుపెట్టాడు. దీనిని ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా బయటపెట్టారు మేకర్స్. అయితే శివుడిగా ప్రభాస్‌ను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ‘కన్నప్ప’లో తన క్యారెక్టర్ గురించి ప్రేక్షకులే ఫిక్స్ అయిపోతున్నారు. దీంతో ప్రేక్షకుల తమంతట తాముగా ఏం ఫిక్స్ అవ్వవద్దనే ఉద్దేశ్యంతో మంచు విష్ణు ఒక వీడియోను విడుదల చేశారు. ‘‘కన్నప్ప గురించి ఎప్పుడు న్యూస్ వచ్చినా మీరంతా దానిని చాలా ఆతృతగా చూస్తున్నారు. ముఖ్యంగా గత 4,5 అప్డేట్స్‌కు సోషల్ మీడియాలో, ట్విటర్‌లో కన్నప్ప టాప్ 3లో ట్రెండ్ అయ్యింది. ఇంక ప్రభాస్ షూటింగ్ జాయిన్ అయ్యాడు అని చెప్పిన న్యూస్ దేశంలోనే దాదాపు 18 గంటల పాటు ఇదే న్యూస్ ట్రెండ్ అయ్యింది.’’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు విష్ణు.


అలా డెవలప్ చేశాను..


‘‘కన్నప్పపై మీరందూ చూపిస్తున్న ఆసక్తికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. కన్నప్పలో సూపర్ స్టార్లు ఉన్నారు, మహానటులు ఉన్నారు. రెబెల్ స్టార్ ఉన్నాడు. ఈ కథలో చాలా గొప్ప పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రలు అద్భుతమైన నటీనటులు చేస్తే బహుమానంగా ఉంటుందని బహుమానంగా ఉంటుందని ముందు నుండే కోరుకొని వాళ్లని సంప్రదించాను. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ కోసమే. నేను కన్నప్ప చేస్తున్నాను, అందులో నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలి అని ప్రభాస్‌ను అప్రోచ్ అయ్యాను. కథంతా చెప్పిన తర్వాత నువ్వు చెప్పిన దానికంటే నాకు ఈ క్యారెక్టర్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్‌గా ఉంది, ఇది చేయొచ్చా అని అడిగాడు. నీకు నచ్చింది నువ్వు చేస్తే నాకు ఇంకా హ్యాపీ కదా, ఈ క్యారెక్టర్ ఇంకా బెటర్‌గా డెవలప్ చేస్తాను’’ అని విష్ణు చెప్పినట్టు బయటపెట్టాడు.


సోమవారం మరో అప్డేట్..


‘‘కన్నప్పలో ఏ క్యారెక్టర్ ప్రభాస్‌కు నచ్చిందో ఆ క్యారెక్టరే తను చేస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు ప్రతీ క్యారెక్టర్‌ను మీ ముందుకు తీసుకొస్తాం. అది వచ్చేలోపల ఈ యాక్టర్ ఈ క్యారెక్టర్, ఆ యాక్టర్ ఆ క్యారెక్టర్ అని అంచనాలు వేసుకోకండి. ఎవరి మాటలు నమ్మొద్దు. త్వరలోనే ఒక్కొక్కటిగా అన్ని క్యారెక్టర్లు రివీల్ చేస్తాం. కన్నప్పను చూడడానికి మీరంతా ఎంత ఆసక్తి చూపిస్తున్నారో.. అంతకంటే ఎక్కువ ఎగ్జైటెడ్‌గా మీ ముందుకు తీసుకురావాలని ఎదురుచూస్తున్నాం. త్వరలో మీ ముందుకు ఒక అద్భుతమైన సినిమాను తీసుకొస్తాం. సోమవారం ఉదయం మీ అందరి ముందుకు అద్భుతమైన అప్డేట్‌తో వస్తాను’’ అంటూ అందరిలో ఆసక్తిని పెంచేశాడు మంచు విష్ణు.






Also Read: ‘కల్కి 2898 AD’ నిర్మాత డేరింగ్ నిర్ణయం - ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఆందోళన