Top 10  News :

1. 22, 23 తేదీల్లో విజయవాడలో డ్రోన్ సమ్మిట్

ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడలో అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌కు డ్రోన్ల తయారీ సంస్థలు, ఐఐటీలు, ఐఐఎస్‌సీల నుంచి దాదాపు 1,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. విస్తృతమైన ప్రజా వినియోగానికి వీలుగా డ్రోన్లను తీర్చిదిద్దడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

2 ప్రధానితో భేటీ కానున్న చంద్రబాబు

సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢీల్లీ పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం ఢీల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమవుతారు. కాగా పర్యటనలో రైల్వే జోన్‌, సెయిల్‌లో విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై చర్చించే అవకాశముంది. ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతి నిర్మాణానికి నిధుల్లో ఆటంకం లేకుండా చూడాలని కోరనున్నట్టు సమాచారం.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

3. పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ వీడింది. 
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలిపారు.  చిన్నారి తండ్రి ఓ మహిళకు రూ.3.5 లక్షలు అప్పు ఇచ్చాడని,  అది తిరిగి చెల్లించాలని ఆ మహిళను బెదిరించడం, తిట్టడం, కోర్టులో కేసు వేస్తానని చెప్పడంతో ఆమె అతనిపై పగ పెంచుకుందన్నారు.  ఆడుకుంటున్న న్న చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అనంతరం పాపకు ఊపిరాడకుండా చేసి హత్య చేశారని చెప్పారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

4. ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన ఆగదు: CM

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన ఆగదని స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని, మూసీ ప్రాంత పేదల జీవితాలు బాగుపడొద్దా? అని ఆయన ప్రశ్నించారు. మూసీ ప్రాంతంలో 10 వేల కుటుంబాలు ఉన్నాయన్నారు. మూసీ ప్రక్షాళన కోసం.. మరో రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి బాధితులను ఆదుకోలేమా? అంటూ సీఎం చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

 

5. 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం: రేవంత్

తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ‘కొలువుల పండుగ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్‌, ఆయన కుటుంబంలోని వారి ఉద్యోగాలు పోతేనే పేదలకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు చెప్పాను. నేను చెప్పినట్టే కేసీఆర్‌ ఉద్యోగం పోయింది.. ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి’’. అని పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

6. శ్రీ మహాచండీ దేవి అలంకరణలో కనకదుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజున నేడు(సోమవారం) దుర్గమ్మ శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ మహాచండీ అమ్మవారి అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపదలు లభించి, శత్రువులు మిత్రులుగా మారి కోరికలు అన్ని సత్వరమే తీరుతాయని భక్తుల నమ్మకం. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 


7. చెన్నై మెరీనా బీచ్‌లో తీవ్ర విషాదం

చెన్నై మెరీనా బీచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో నిర్వహించిన 'మెగా ఎయిర్ షో'ను చూసేందుకు లక్షలాది మంది తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకే ప్రదర్శన ముగియగా.. తిరుగు ప్రయాణంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందగా.. వందలాది మంది గాయపడ్డారు. దాదాపు 230 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


 

8. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై ఏడాది

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి నేటితో  ఏడాది పూర్తి అయింది. 7 అక్టోబర్ 2023 రోజున ఇజ్రాయెల్‌పై పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ భారీ స్థాయిలో దాడి చేసింది. ఓవైపు భూమార్గంలో ఇజ్రాయెల్ లోకి ప్రవేశిస్తూనే మరోవపు రాకెట్‌తో విరుచుకుపడింది. అప్పటి నుంచి  హమాస్‌తో యుద్ధాన్ని మొదలు పెట్టిన ఇజ్రాయెల్ ఇప్పుడు  ఏకంగా ఏడుగురు శత్రువులతో పోరాడుతోంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

9. బంగ్లాపై భారత్‌ ఘన విజయం

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 11.5 ఓవర్లలో ఛేదించింది. బ్యాటింగ్‌లో హార్దిక్‌ 39*, శాంసన్‌ 29, సూర్యకుమార్‌ 29 పరుగులతో రాణించారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

10. సెమీస్ రేసులో భారత్

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 105 రన్స్ చేసింది. 106 పరుగులు లక్ష్యఛేదనలో భారత్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షెఫాలి వర్మ 32, హర్మన్‌ప్రీత్‌ కౌర్ 29, జెమీమా రోడ్రిగ్స్ 23 పరుగులతో రాణించారు. కాగా, ఈ నెల 9వ తేదీన భారత్, శ్రీలంకను ఢీ కొట్టనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..