Navratri 2024 Day 5 Maha Chandi  Devi Alankaram:  దుష్టసంహారం ద్వారా ధర్మాన్ని రక్షించడమే శరన్నవరాత్రి ఉహోత్సవాల్లో పరమార్థం. ఏటా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకూ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజుకో అలంకారంలో దర్శనమిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు అక్టోబరు 07 సోమవారం మహాచండిగా భక్తులను అనుగ్రహిస్తోంది. 
చండీ ఎలా అవతరించింది


చండీదేవిని రెండు విధాలుగా పిలుస్తారు - కొలుస్తారు


చండీ ప్రశాంత వదనంతో ఉన్నప్పుడు ... ఉమా, గౌరీ, పార్వతి, హైమవతి, శతాక్షి, జగన్మాత, భవాని అంటారు


చండీ భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు.. దుర్గ, కాళి , శ్యామ, చండీ, చండిక, భైరవి పేర్లతో పూజిస్తారు


దసరా నవరాత్రుల సంద్రబంగా మహాచండి అలంకారంలో ఉన్న శక్తిస్వరూపాన్ని దర్శించుకుంటే మనసులో ఉండే కోర్కె నెరవేరుతుందని చెబుతారు. 


Also Read: సతీదేవి కురులు పడిన ప్రదేశం.. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి - దసరాల్లో ఈ అమ్మవారి వైభోగం చూసేందుకు రెండు కళ్లు సరిపోవ్!


ఇంద్రుడి సంహాసనాన్ని ఆక్రమించేందుకు రాక్షసులు ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. దేవతలను హింసించేవారు.. దిక్కుతోచని పరిస్థితుల్లో దేవతలంతా పరమేశ్వరుడి వద్దకు వెళ్లి రాక్షసుల గురించి చెబుతారు. ఆ సమయంలో శివుడు.. మాతృదేవతలను స్తుతించమని సూచించాు. అప్పుడు దేవతలంతా కలసి మాతృదేవతలను స్తుతిచందా లక్ష్మీ, సరస్వతి, గౌరి ఈ ముగ్గురి శక్తి కలసి చండిగా మారింది. అలా రాక్షసులను సంహరించి దేవతలకు రక్షణ కల్పించారు. 


రాక్షస సంహారం అనంతరం చండీదేవి హరిద్వార్ లో ఉన్న నీల్ పర్వత శిఖరంపై కొలువైందని చెబుతారు. ఈ ఆలయ విగ్రహాన్ని ఆదిశంకరాచార్య  ప్రతిష్టించారని చెబుతారు. నిత్యం భక్తులతో కళకళలాడే చండేదేవి ఆలయం శరన్నవరాత్రుల్లో కిక్కిరిసిపోతుంది. హిమాలయ పర్వతశ్రేణిలో ఉన్న ఈ ఆలయాన్ని సుచత్ సింగ్ అనే కాశ్మీర్ రాజు నిర్మించాడని చెబుతారు. జగద్గురు శంకరాచార్యులవారు ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారని స్థలపురాణం. పంచతీర్థాల్లో ఒకటిగా చెప్పే హరిద్వార్ లో ఉన్న ఈ శక్తి రూపాన్ని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.  శరన్నవరాత్రుల్లో చండీ హోమం నిర్వహిస్తారు. 


 దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మూడు శక్తుల స్వరూపిణిగా అవతరించిన మహాచండిని దర్శించుకుంటే చేపట్టిన కార్యాల్లో విజయం తథ్యం అంటారు పండితులు. ఈరోజు మహాచండికి  కదంబం, చక్కెర పొంగలి, పులిహోర, లడ్డూ, రవ్వకేసరి, కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించి..ఎర్రటి పూలతో పూజిస్తారు. ఈ రోజు చండీ ధ్యానం, లలితా సహస్రనామ స్తోత్రం,  ఖడ్గమాల పఠించాలి..


Also Read: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!


  శ్రీ చండికా ధ్యానం ( Chandika Dhyanam )
 
ఓం బంధూకకుసుమాభాసాం పంచముండాధివాసినీమ్ |
స్ఫురచ్చంద్రకలారత్నముకుటాం ముండమాలినీమ్ ||


త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్తనీమ్ |
పుస్తకం చాక్షమాలాం చ వరం చాభయకం క్రమాత్ ||


దధతీం సంస్మరేన్నిత్యముత్తరామ్నాయమానితామ్ |


యా చండీ మధుకైటభాదిదలనీ యా మాహిషోన్మూలినీ
యా ధూమ్రేక్షణచండముండమథనీ యా రక్తబీజాశనీ |


శక్తిః శుంభనిశుంభదైత్యదలనీ యా సిద్ధిదాత్రీ పరా|
సా దేవీ నవకోటిమూర్తిసహితా మాం పాతు విశ్వేశ్వరీ ||


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే