Viral News: ప్రయాణికులంతా చేరుకున్నారు. కాసేపట్లో ఫ్లైట్‌ టేకాఫ్‌కు సిద్ధమైంది. ఇంతలో పైలట్ కంట్రోల్ రూమ్‌తోకానీ, క్రూ సిబ్బంది కామాండ్స్ పట్టించుకోవడం లేదు. మరోవైపు టైం అవుతున్నా  విమానం టేకాఫ్ కాకపోవడంతో ప్రయాణికుల్లో అలజడి రేగింది. ఇంతలో కో పైలట్ విషయం చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. 


తన డ్యూటీ టైం అయిపోయిందని తాను విమానం నడపబోనని ఆ పైలట్‌ చెప్పడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. పుణే నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో ఆ ఘటన జరిగింది. ఇది జరిగి పది రోజులు అవుతోంది. ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


పుణేలో 12.45 గంటలకు బయల్దేరాల్సిన ఫ్లైట్‌ ఐదు గంటల 44 నిమిషాలకు బయల్దేరింది. ఆరు గంటల 49 నిమిషాలకు బెంగళూరు చేరుకుంది. ఈ ఫ్లైట్‌  టేకాఫ్‌ అయ్యేలోపు ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిపై మండిపడ్డారు. ఎందుకు ఆలస్యమవుతుందని వారితో వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధిచిన వీడియోను ఓ పాసింజర్‌ X లో పోస్ట్ చేశారు. అందులో ఇలా రాసుకొని వచ్చారు. తన డ్యూటీ టైం ముగిసిందని పైలట్ ఫ్లైట్ టేకాఫ్ చేయడానికి నిరాకరించారు. దీంతో పూణె నుంచి బెంగళూరుకు బయల్దేరాల్సిన ఇండిగో విమానం 6E ఐదు గంటల ఆలస్యమైంది. అందులో ఉన్న ప్రయాణికులకు కనీసం ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వలేదని కూడా అవస్థలు పడ్డారు. కస్టమర్లకు ఇలాంటి సేవలే అందిస్తారా అంటూ నిలదీశారు. పూర్తిగా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. 






పైలట్ టేకాఫ్ కావడం లేదని చెప్పడంతో 200 మంది ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాోల వైరల్‌గా మారాయి. పైలట్‌ని పిలిచి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తుంటే ఆయన సైలెంట్‌గా డోర్ క్లోజ్ చేయడం గమనించవచ్చు. 


మీరు మరింత మంచిగా ఆలోచించాల్సి ఉంది సార్ అంటూ అంటూ ఓ ప్రయాణికులు గట్టిగా అరవడం కనిపిస్తుంది. వాళ్ల దగ్గర సమాధానం లేదు కాబట్టే అతను కాక్‌పిట్ డోర్‌ను క్లోజ్ చేసి లోపలికి వెళ్లిపోతున్నాడని మరో పాసింజర్ కామెట్ చేశాడు. ఇదంతా సోషల్ మీడియాలో లైవ్‌ రూపంలో ఇవ్వాలని ఇంకొకరు అరవడం చూస్తాం. 


ఈ దృశ్యాలను డీజీసీఏకు, ఇండిగో యాజమాన్యానికి కేంద్రానికి ట్యాగ్ చేస్తున్నారు. సిగ్గు చేటు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటివి పదే పదే జరుగుతున్నాయని అందుకే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వాని విజ్ఞప్తి చేస్తున్నారు. .


ఈ వీడియో వైరల్ కావడంతో ఇండియో యాజమాన్యం స్పందించింది. " “24 సెప్టెంబర్ 2024న పూణే నుం;f బెంగళూరుకు వెళ్లాల్సిన ఫ్లైట్ 6E 361 ఆలస్యంగా బయల్దేరింది. దీనిపై అప్పుడే పాసింజర్లకు సమాచారం అందించారం. వారికి సహాయం చేసేందుకు మా సిబ్బంది అంతా అందుబాటులో ఉంది. ఏదైనాసరే అసౌకర్యం జరిగినందుకు క్షమాపణలు కోరుతున్నాం, ”అని ఇండిగో తెలిపింది.


Also Read: పది పాసైతే చాలు, టాప్‌-500 కంపెనీల్లో ఛాన్స్‌ - మీ కలను నిజం చేసే 'ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ స్కీమ్'