CM Chandrababu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలో (Delhi) పర్యటించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకుని.. సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమవుతారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో మంగళవారం భేటీ అవుతారు. కాగా, బుడమేరు వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చిన తర్వాత ప్రధానిని చంద్రబాబు కలవడం ఇదే తొలిసారి. రైల్వే జోన్, సెయిల్‌లో విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధుల్లో ఆటంకం లేకుండా చూడాలని సీఎం కోరనున్నట్లు సమాచారం. ఇటీవలే వరద సాయం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.1,063 కోట్లు కేటాయించింది.


Also Read: Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వ స్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు