Top 10  News :
1. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన పవన్

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్వాగతించారు. గతంలో టీటీడి బోర్డుల హయంలోనే ప్రసాదాలు, అన్న ప్రసాదంలో నాణ్యత లోపించిందని ఆరోపించారు. తప్పుడు నిర్ణయాలు, అపవిత్ర చర్యలకు కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

2. వైఎస్‌ఆర్‌ జిల్లా పేరు మార్చండి: మంత్రి సత్యకుమార్‌

ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాగా ఉన్న పేరును వైఎస్సాఆర్ కడప జిల్లాగా మార్చాలని సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్‌ లేఖ రాశారు. కడప జిల్లాకు గొప్ప చారిత్రక నేపథ్యం ఉందని.. అది తెలియకుండా కడప జిల్లాను వైఎస్‌ఆర్‌ జిల్లాగా వైసీపీ ప్రభుత్వం మార్చేసిందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాశస్త్యం ఉన్న ‘కడప’ పేరును గత ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో వైఎస్‌ఆర్‌ జిల్లాగా మార్చిందన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

3. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: చంద్రబాబు

 తిరుమల లడ్డూ కల్తీ ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 'సత్యమేవ జయతే, ఓం నమో వేంకటేశాయ' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

4. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారి ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

5. వదంతులు నమ్మొద్దన్న టీటీడీ

తిరుమలలో అపచారం జరిగిందన్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా కొక్కి విరిగిందని.. అపశ్రుతి చోటు చేసుకుందని వస్తోన్న వార్తలపై స్పష్టత ఇచ్చింది. తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదని.. ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మొద్దని స్పష్టం చేసింది. ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే కొక్కి విరిగిందని, ఇది అపచారమని సోషల్ మీడియాలో వదంతులు వచ్చాయి. దీనిపై టీటీడీ స్పందించి స్పష్టత ఇచ్చింది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

6. పవన్ కల్యాణ్ వేషం, భాష మారిపోయింది: షర్మిల

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై పవన్ కల్యాణ్ విమర్శలు చేయడం జోక్‌గా అభివర్ణించారు. అధికారం వచ్చిన తర్వాత పవన్ వేషం, భాష మారిపోయాయని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎంగా అన్ని వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

7. దారుణం.. ఇద్దరు బాలికలపై అత్యాచారం

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై ఐదుగురు అత్యాచారం చేశారు. జనగామ, మల్కాజిగిరి ప్రాంతాలకు చెందిన ఇద్దరు బాలికలు(14,15) పునరావాస కేంద్రం నుంచి సెప్టెంబరు 24న పారిపోయారు. ఈ క్రమంలో ఆశ్రయం కల్పిస్తామని నమ్మించి వారిపై నాగరాజు, నాగరాజు, సాయి, రాజు, అఖిల్, రోహిత్ అత్యాచారం చేశారని బాధితురాళ్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

8. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ.. 38 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మరణించన మావోయిస్టుల సంఖ్య 38కు పెరిగింది. నారాయణపూర్-దంతెవాడ సరిహద్దుల్లోని నెండూరు-తుల్తులి సమీపంలోని అడవుల్లో ఈ కాల్పులు జరిగాయి. కూంబింగ్ చేస్తున్న భద్రతాదళాలపై మావోలు కాల్పులకు తెగబడ్డారు. ఇటీవల భద్రతా దళాలు సాధించిన భారీ విజయం ఇదేనని అధికారులు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో రైఫిళ్లు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

9. అతిపెద్ద తప్పు చేసిన యూట్యూబ్

ఇటీవల యూట్యూబ్  చేసిన పెద్ద తప్పు కారణంగా చాలా విమర్శలను ఎదుర్కొంది. చాలా అకౌంట్లను పొరపాటున బ్యాన్ చేసింది. 'స్పామ్' కార్యకలాపాల కోసం చాలా ఛానెళ్లను తీసివేసింది. యూట్యూబ్ క్రియేటర్లు ఎటువంటి కారణం లేకుండా తమ ఛానెల్‌లను నిషేధించారని గుర్తించారు. దీని గురించి యూజర్లకు ఎటువంటి హెచ్చరిక రాకపోవడం విశేషం. దీనిపై నెట్టింట ట్రోల్స్ జరగడంతో స్పందించిన యూట్యూబ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

10. పేలవ ప్రదర్శనతో భారత జట్టు ఓటమి 

 

భారీ అంచనాలతో  టీ20 ప్రపంచకప్‌  బరిలో దిగిన భారత జట్టు టోర్నీని పేలవంగా ప్రారంభించింది. శుక్రవారం  జరిగిన తొలి మ్యాచ్‌లో 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ చేతిలో చిత్తయింది. భారత ఆటగాళ్ళు కనీసం పోరాడకుండా ఓడిపోవడం.. అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..