Sharmila criticized Pawan Kalyan : రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత పవన్ కి లేదని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యానించారు. అధికారం వచ్చాక పవన్ వేషం, భాష రెండు మారాయని విమర్శించారు. ఇప్పుడు ఉన్నత మైన హోదాలో ఉన్నారు ..భాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి మీరు ఒక మతమే ముఖ్యం అని వ్యవహరిస్తున్నారని ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారని షర్మిల ప్రశ్నించారు. 
 
గతంలో జనసేన ఒక సెక్యులర్ పార్టీ అని.. ఇప్పుడు జనసేన అంటే రైటిస్ట్ పార్టీ అని మతం పేరుతో రాజకీయాలు చేయడం RSS సిద్ధాంతం చేశారన్నారు. బీజేపీ వాళ్ల సిద్ధాంతమే మత రాజకీయం  అన్నారు. మీరు కూడా RSS కి డబుల్ ఏజెంట్ గా మారారా అని ప్రశ్నించారు. మీకు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మణిపూర్ లో క్రిస్టియన్ లా మీద ఊచకోత కోస్తే ఎక్కడ పోయారని ప్రశ్నించారు. గోద్రా అల్లర్లు జరుగుతుంటే ఎక్కడ పోయారని .. రాహుల్ గాంధీ ప్రేమను పంచుతున్నారని గుర్తు చేశారు.  అన్ని మతాలను సమానంగా చూస్తున్నారుఈ దేశంలో సోదర భావాన్ని పెంచుతున్నారు  అలాంటి రాహుల్ పై మీరు మాట్లాడి మీ స్థాయి మీరు తగ్గించుకోవద్దని సలహా ఇచ్చారు.బీజేపీ డైరెక్షన్ లో మీరు ఎందుకు యాక్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు.                                     


పవన్ కల్యాణ్‌పై డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు - తగ్గేది లేదని క్లారిటీ


తిరుమల విషయంలో స్పెషల్ సిట్ వేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. లడ్డూ కల్తీ పై మొదటగా సీబీఐ విచారణ మేమే అడిగామని.. సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరామన్నారు. ఇండిపెండెంట్ సిట్ తోనే విచారణ వేగవంతం అవుతుందని.. లడ్డూ కల్తీ పై రాజకీయాలు చేయొద్దని సుప్రీం చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు.  స్టీల్ ప్లాంట్ పై కాంగ్రెస్ వి కాదు చిల్లర రాజకీయాలు...బీజేపీ చేస్తున్నవి చిల్లర రాజకీయాలని విమర్శించారు.  త్వరలో అఖిలపక్షం తో సిఎం ను కలుస్తామని.. తెలిపారు. UPA హయంలో లాభాల్లో ఉన్న ప్లాంట్ నీ ఎన్డీయే హయంలో బలహీనం చేశారని..  అదానీ,అంబానీ కన్ను విశాఖ స్టీల్ మీద పడిందని ఆరోపించారు. ప్లాంట్ కి హాని జరిగితే ఊరుకోం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా పోరాటం చేస్తుందన్నారు. గతంలోనే స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు లేఖ రాశారన్నారు. 


మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?


తిరుపతిలో జరిగిన జనసేన వారాహి సభలో పవన్ కల్యాణ్ ప్రసంగంలో రాహుల్ గాంధీ ని విమర్శించారు. అయోధ్య రామాలయ వేడుక సమయంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించి పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. వాటినే షర్మిల ఖండించారు.