DMK leader responded to Pawan comments on Udayanidhi :  ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మం వైరస్ వంటిది అని చేసిన వ్యాఖ్యలపై వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కల్యాణ్ స్పందించారు. ఉదయనిధి పేరు ప్రస్తావించలేదు కానీ ఓ యువనేత అంటూ విమర్శలు గుప్పించారు. తమిళంలోనూ ఆయన ప్రసంగించడంతో ఈ అంశం తమిళనాడులోనూ హాట్ టాపిక్ అయింది. పవన్ కల్యాణ్.. ఉదయనిధిని టార్గెట్ చేసుకుని చేసిన విమర్శలపై డీఎంకే స్పందించింది. డీఎంకే అధికార ప్రతినిధి  సయ్యద్ హఫీజుల్లా ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. డీఎంకే ఎప్పుడూ ఏ మతాన్ని టార్గెట్ చేసుకోలేదని స్పష్టం చేశారు. అయితే కుల వివక్ష , అంటరానితనం, కులపరమైన వేధింపులపై మాత్రం తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.  ఉదయనిధి స్టాలిన్ కూడా హిందూ మతానికి ఎప్పుడూ వ్యతిరేక ప్రకటనలు చేయలేదన్నారు. కేవలం కులపరమైన వివక్షపైనేతాము పోరాటం చేశామని తెలిపారు. 


తమిళనాడులో హాట్ టాపిక్‌గా పవన్ విమర్శలు


పవన్ కల్యాణ్ సనాతన ధర్మ డిక్లరేషన్‌పై తమిళనాడులోనూ విస్తృత చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పవన్ గుర్తు చేయడంతో అక్కడా ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది. అప్పట్లో  ఉదయనిధిపై చాలా మంది నేతలు విమర్శలు చేశారు. కొంత మంది కేసులు పెట్టారు. అయితే తాను సనాతన ధర్మంపై మాట్లాడిన దానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ విషయంలో మాత్రం నేరుగా ఉదయనిధి స్పందించలేదు. డీఎంకే అధికార ప్రతినిధి మాత్రమే స్పందించారు. సనాతన ధర్మాన్ని విమర్శిస్తే నేరుగా హిందువులను వ్యతిరేకించినట్లుగా రాజకీయం మారిపోవడంతో ఈ అంశంపై చర్చ పెరగకూడదని డీఎంకే కోరుకుంటోంది. 


డీఎంకే ఏ మతాన్ని టార్గెట్ చేయదంటున్న ఆ పార్టీ నేతలు                 


పవన్ కల్యాణ్ తమిళ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్యూ వైరల్ అవుతోంది. సాధారణంగా అభ్యుదయభావాలతో ఏర్పడిన రెండు ప్రధాన పార్టీల మధ్యనే సిద్ధాంత పోరాటం తమిళనాడులో జరుగుతుంది. అయితే ఈ సిద్దాంతం రెండు పార్టీలదీ దాదాపుగా ఒకటే. డీఎంకే, అన్నాడీఎంకే రెండూ ఒకే భావజాలంతో ఉంటాయి. కుల వివక్షకు వ్యతిరేకంగానే రాజకీయాలు చేస్తాయి. సిద్దాంత పరంగా ఆ రెండు పార్టీల దేవుళ్లను నమ్మవు. కానీ మారుతున్న కాలంతో పాటు ఆ పార్టీ నేతలు కూడా మారుతున్నారు. ఇటీవలి కాలంలో తమిళనాడులో బీజేపీ కూడా హిందూత్వ వాదనను బలంగా వినిపిస్తోంది. వారి వాదనకు పవన్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చినట్లయింది. 


మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?


పవన్  కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులోనూ హైలెట్ కావడంతో..అక్కడి రాజకీయాల్లో జనసేన పార్టీ చర్చనీయాంశమవుతోంది. పవన్ కల్యాణ్ హిందూత్వ వాదంతో తమిళనాట అడుగు పెడతారా లేకపోతే భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీకి బలంగా మారుతారా అన్నది తమిళ నాట హాట్ టాపిక్ గా మారుతోంది.