Chhattisgarh 28 Maoists gunned down in Narayanpur encounter :  ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ డివిజన్ లో నక్సల్స్‌ను పోలీసు బలగాలు చావు దెబ్బకొట్టాయి.  శుక్రవారం నారాయణపూర్, బీజాపూర్ పోలీసులు  నక్సలైట్లపై విరుచుకుపడ్డారు.  ఎదురుకాల్పుల్లో 38 మంది నక్సలైట్లను హతమార్చినట్లు తెలుస్తోంది. దాదాపు 32 మంది నక్సలైట్ల మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి  పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం  చేసుకున్నారు. ఏకే-47, ఎస్ ఎల్ ఆర్ వంటి ఆటోమేటిక్ ఆయుధాలతో పాటు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.  పోలీసులకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. పెద్ద సంఖ్యలో నక్సలైట్లు ఉన్నారన్న సమాచారం అందుకున్న స్థానిక పోలీసు బలగాలు, డీఆర్జీ, పారామిలటరీ బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నక్సలైట్ల రహస్య స్థావరంపై దాడి చేశారు. నక్సలైట్లు ఈ దాడిని ఊహించకపోవడంతో తప్పించుకోలేకపోయారు. 


పక్కా సమాచారం రావడంతో ఎటాక్ చేసిన పోలీసులు             


మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కోసం భద్రతా దళాలను రంగంలోకి దింపినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని కాల్పులు ప్రారంభించాయి. మావోయిస్టులకు, నారాయణపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన సంయుక్త బలగాలకు మధ్య చాలా కాలంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  ఆ ప్రాంతంలో అడపాదడపా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇంత పెద్ద ఎన్ కౌంటర్ జరగడం మాత్రం సంచలనంగా మరింది. 


సెక్రటేరియట్ పై నుంచి దూకేసిన మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ - వలలు కట్టి కాపాడిన పోలీసులు


శనివారం చనిపోయిన మావోయిస్టులు ఎవరో గుర్తించే అవకాశం               


ఇప్పటి వరకు 30 మంది మావోయిస్టులు హతమైనట్లుగా తెలిసిందని  వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.  ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.   దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ ఇంకా పలువురు నక్సలైట్లు అక్కడే ఉన్నారని వారు ఎదురు కాల్పులు జరుపుతున్నందున ఆపరేషన్ కొనసాగతోందని చెబుతున్నారు.  మరణించిన నక్సలైట్ల మృతదేహాలను శనివారం నారాయణపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు తరలించే అవకాశం ంది.  అక్కడ ఎవరెవరు చనిపోయారనేది గుర్తించే అవకాశం ఉంది.  


ఇజ్రాయెల్ మెషిన్‌తో వయసు తగ్గిస్తామని చెబితే నమ్మేశారు - ఈ జంట రూ. 35 కోట్లు కొట్టేసింది !


పోలీసు బలగాల్లో అందరూ సేఫ్               


ఈ ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న బలగాలు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందిందని అధికారులు ప్రకటించారు.  ఎన్ కౌంటర్‌కు సంబంధించిన మరింత సమాచారం సేకరిస్తున్నారు. బస్తర్ ప్రాంతంలోని సుక్మా జిల్లాలో గురువారం జరిగిన ఎదురు కాల్పుల్లో భద్రతా దళాలు తాత్కాలిక మావోయిస్టు శిబిరాన్ని కూల్చివేసి భారీ పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. ఒక్క రోజు వ్యవధిలోనే మరో ఎన్ కౌంటర్ జరగడం సంచలనంగా మారింది.