Maharashtra Deputy Speaker Jumps Off 3rd Floor Of Secretariat :  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరహరి జిర్వాల్ శుక్రవారం మధ్యాహ్నం ముంబైలోని మహారాష్ట్ర సచివాలయం మూడో అంతస్తు నుంచి దూకేశారు. ఆయన అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఆయన దూకతారని తెలిసిన పోలీసులు, సిబ్బంది ముందుగానే సేఫ్టీ నెట్ తెచ్చి పెట్టారు. దాంతో ఆయన దూకేసినా   సేఫ్టీ నెట్స్‌లో పడడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు.  ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించే అంశాన్నివ్యతిరేకిస్తూ ఆందోళన జరుగుతున్న సమయంలో  డిప్యూటీ స్పీకర్ కూడా ఆందోళనకు మద్దతు పలికారు.                                           


నేరుగా మంత్రాలయ బిల్డింగ్కు చేరుకుని  మూడో అంతస్తు  నుంచి కొన్ని డాక్యుమెంట్లను గాల్లోకి విసిరేస్తూ దూకేశారు.  పెసా చట్టం (Pesa Act) ప్రకారం ఉద్యోగ నియామకాలను వ్యతిరేకిస్తూ గత 15 రోజులుగా మహారాష్ట్రలో గిరిజన విద్యార్థులు రోడ్డెక్కారు.  కీ ప్రభుత్వం వీరి గోడు పట్టించుకోకపోవడంతో గిరిజన ఎమ్మెల్యేలు, గిరిజన సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ స్పీకర్ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్తో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయిది.   ఈ సమస్య పరిష్కారానికి సానుకూలంగానే ఉన్నామని సీఎం చెప్పినప్పటికీ అందుకు తగ్గట్టుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో గిరిజన ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. 





 డిప్యూటీ స్పీకర్‌తోపాటు  మరో ఇద్దరు గిరిజన శాసనసభ్యులు కూడా సచివాలయం పై నుంచి దూకేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.  కిందికి దూకిన ముగ్గురిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో  పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.     



ఎస్టీల్లో ధంగార్ తెగను చేర్చే అంశం మహారాష్ట్రలో అగ్గిరాజేసింది. ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ ను నిరసిస్తూ పలువురు గిరిజన ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవర్ వర్గానికి చెందిన నేత ఆందోళనకు దిగారు. ధంగార్ తెగకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎస్టీ రిజర్వేషన్ కల్పించకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. వారికి  షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీ పొడిగింపు చట్టం కింద సేవలు అందిస్తే సరిపోతుందని  చెబుతున్నారు. ఈ అంశం  రానున్న రోజుల్లో రాజకీయ వివాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మహారాష్ట్రలో ధంగార్ కమ్యూనిటీ ఆందోళనలు అన్ని పార్టీలకు ఇబ్బందికరంగానే మారాయి.