ICC AI Tool: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ఇప్పటికే ప్రారంభం అయింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆన్‌లైన్ అనుభవాన్ని మరింత సానుకూలంగా, జట్లు, ఆటగాళ్లను కలుపుకొని పోయేలా చేయడం కోసం కొత్త సోషల్ మీడియా మోడరేషన్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. 60 మంది ఆటగాళ్లు దీని కోసం ఇప్పటికే సైన్ అప్ చేశారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. టోర్నమెంట్‌కు ముందు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించాలన్న ఐసీసీ నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది.


మెంటల్ హెల్త్ ముఖ్యం అంటున్న ఐసీసీ
ఆటగాళ్ళు, అభిమానుల మానసిక ఆరోగ్యాన్ని రక్షించడానికి ఒక యాక్టివ్ స్టెప్‌గా ఐసీసీ దీన్ని చూస్తోంది. ఆటగాళ్లపై నెగిటివ్ ప్రభావాన్ని చూపే ఆన్‌లైన్ కంటెంట్ నుంచి వారిని రక్షించడానికి రూపొందించిన అధునాతన సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. క్రికెట్ క్రీడాకారుల మధ్య ఆరోగ్యకరమైన సంభాషణలను ప్రోత్సహించడానికి ఐసీసీ చొరవ తీసుకుంటోంది. అందులో భాగంగానే ఈ సోషల్ మీడియా మోడరేషన్ కార్యక్రమం.


ఈ సోషల్ మీడియా మోడరేషన్ ప్రోగ్రామ్‌ను అమలు చేయడానికి ఐసీసీ... ఏఐ టెక్నాలజీ, మానవ వనరులను సమంగా ఉపయోగించనుంది. దీని కోసం గోబబుల్‌తో ఐసీసీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ప్రోగ్రాం ఐసీసీ అధికారిక ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానెళ్లతో పాటు... సర్వీసుకు సైన్ అప్ చేసుకున్న ఆటగాళ్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కామెంట్లను మానిటర్ చేయడంతో పాటు కంట్రోల్ చేయడానికి అనుమతిస్తుంది. ప్రపంచ కప్‌కు సంబంధించి సురక్షితమైన, ఆకర్షణీయమైన వాతావరణాన్ని అందించడానికి, హేట్ స్పీచ్, హెరాస్‌మెంట్, స్త్రీద్వేషం వంటి నెగిటివ్ కంటెంట్‌ను గుర్తించడానికి, హైడ్ చేయడానికి ఈ అత్యాధునిక టెక్నాలజీని ప్రత్యేకంగా రూపొందించారు. 


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


ఈ సర్వీసును ఉపయోగించే ఆటగాళ్లు తమ సోషల్ మీడియా ఫీడ్‌ల నుంచి హానికరమైన వ్యాఖ్యలను ఆటోమేటిక్‌గా హైడ్ చేయవచ్చు. ఇది ఆన్‌లైన్ నెగిటివిటీ చూపించే హానికరమైన ప్రభావాల నుంచి ఆటగాళ్లు బయట పడేందుకు, వారి ఆటను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు నేడు సాయంత్రం తన మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.


ఐసీసీ డిజిటల్ హెడ్ ఫిన్ బ్రాడ్‌షా ఈ ఇనీషియేటివ్ పట్ల తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ‘ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనే వారందరికీ, అభిమానులకు సానుకూలమైన, గొప్ప వాతావరణాన్ని అందించడానికి మేం కట్టుబడి ఉన్నాం. చాలా మంది ఆటగాళ్ళు, జట్లు మా కొత్త ప్రోగ్రాం స్వీకరించడం చాలా సంతోషాన్నిస్తుంది.’ అన్నారు.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?