Top 5G Mobile Phones: దేశ వ్యాప్తంగా 5G నెట్ వర్క్ లభిస్తున్న నేపథ్యంలో వినియోగదారులు 5G స్మార్ట్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. 5G కనెక్టివిటీ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం పొందే అవకాశం ఉండటంతో అందరూ 5G స్మార్ట్ ఫోన్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రూ. 20 వేల లోపు మంచి బ్యాటరీ, చక్కటి కెమెరా క్వాలిటీ, గేమింగ్ కు అనుగుణంగా ఉండే 5G స్మార్ట్ ఫోన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
1.OnePlus Nord CE 3 5G
రూ. 20 వేలలోపు మంచి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్న వారికి బెస్ట్ ఆప్షన్ OnePlus Nord CE 3 5G. మల్టీ టాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్ సదుపాయాన్ని కలిగి ఉంది. 128 GB ఇన్ బిల్ట్ మెమరీ, 50 మెగా ఫిక్సెల్ కెమెరాను కలిగి ఉంది.
OnePlus Nord CE 3 5G ఫీచర్లు:
⦿ ఆండ్రాయిడ్ 13.1 ఆధారంగా పని చేసే ఆక్సిజన్ ఓఎస్ 13పై రన్ అవుతుంది.
⦿ 8 GB RAM
⦿ 128 GB ఇన్ బిల్ట్ మెమరీ
⦿ సోనీ IMX890 సెన్సార్ తో కూడిని 50MP కెమెరా
⦿ 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే
2.Xiaomi Redmi Note 13 5G
ఈ 5G స్మార్ట్ ఫోన్ 6GB RAM, 128GB ఇన్ బిల్డ్ మెమరీని కలిగి ఉంటుంది. MediaTek Dimensity 6080 చిప్‌సెట్, Mali-G57 గ్రాఫిక్స్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 108 MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. 33 W ఛార్జర్ తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కలిగి ఉంది.
Xiaomi Redmi Note 13 5G ఫీచర్లు:
⦿హారిజన్ గ్లాస్ డిజైన్
⦿6GB RAM
⦿128GB ఇన్ బిల్ట్ మెమరీ
⦿50 MP ఫ్లాగ్‌షిప్ సోనీ నైట్ విజన్ కెమెరా
⦿5000mAh బ్యాటరీ
3.Realme Narzo 70 Pro 5G
రియల్ మీ కంపెనీ నుంచి విడుదలైన బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ Realme Narzo 70 Pro. ఇది సరికొత్త హారిజన్ గ్లాస్ డిజైన్ ను కలిగి ఉంటుంది. Android 14 పైన Realme UI 5.0 ఓఎస్ తో రన్ అవుతుంది. రెండు సంవత్సరాల పాటు OS అప్‌గ్రేడ్లతో పాటు మూడు సంవత్సరాల సెక్యూరిటీ సమస్యలను ఫిక్స్ చేస్తుంది. ఫాస్ట్ ఛారింగ్ కు సపోర్టు చేసే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. బెస్ట్ కెమెరా క్వాలిటీని కలిగి ఉంటుంది.
Realme Narzo 70 Pro 5G ఫీచర్లు:
⦿8GB RAM
⦿256GB ఇన్ బిల్ట్ మెమరీ
⦿108MP AI ట్రిపుల్ కెమెరా సిస్టమ్
⦿6.67 FHD+ డిస్‌ప్లే
⦿డ్యూయల్ సిమ్ స్లాట్లు
4.iQOO Z9 5G
ఈ స్మార్ట్ ఫోన్ అల్ట్రా-ఫాస్ట్ నెట్‌వర్క్ స్పీడ్ ను అందిస్తుంది. ఎర్గోనామిక్ డిజైన్, చక్కటి ప్రొఫైల్ హ్యాండ్లింగ్ ను కలిగి ఉంటుంది. 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 44W ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ సాయంతో త్వరగా ఛార్జ్ చెయ్యొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ఇన్ బిల్ట్ మెమరీని 1TB వరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
4.iQOO Z9 5G ఫీచర్లు:
⦿HD AMOLED డిస్ ప్లే
⦿DT స్టార్2-ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్
⦿ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ
⦿డస్ట్, వాటర్ రెసిస్టెన్స్
⦿8GB RAM
⦿ఇన్ బిల్ట్ మెమరీ 1TB వరకు పెంచుకునే అవకాశం
5.Tecno Pova 6 Pro 5G
ఈ స్మార్ట్ ఫోన్ 6,000mAh బ్యాటరీతో పాటు 70W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. 16GB ర్యామ్, 256GB ఇన్ బిల్ట్ మెమరీని కలిగి ఉంటుంది. 6.78-అంగుళాల పెద్ద HD డిస్ ప్లే ఉంటుంది.
Tecno Pova 6 Pro 5G ఫీచర్లు:
⦿సూపర్ ఫాస్ట్ ఛార్జర్‌తో కూడిన 6000mAh బ్యాటరీ
⦿16GB RAM
⦿256GB
⦿6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే
Read Also: సూపర్ ఏఐ కెమెరా ఫీచర్లతో వచ్చిన ఒప్పో రెనో 12 5జీ సిరీస్ - కొనాలంటే ఎంత ఖర్చు పెట్టాలి?