Oppo Reno 12 5G Series: ఒప్పో రెనో 12 5జీ సిరీస్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో ఒప్పో రెనో 12 5జీ, ఒప్పో రెనో 12 ప్రో 5జీ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్లు అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ 14.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా‌గా 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ600 సెన్సార్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో ఏఐ ఫీచర్లపై కంపెనీ ఎక్కువగా దృష్టి పెట్టింది.


ఒప్పో రెనో 12 ప్రో 5జీ ధర (Oppo Reno 12 5G Pro Price in India)
ఇందులో రెండు వేరియంట్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వీటిలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.36,999గా నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.40,999గా నిర్ణయించారు. జులై 18వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.


ఒప్పో రెనో 12 5జీ ధర (Oppo Reno 12 5G Price in India)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.32,999గా నిర్ణయించారు. జులై 25వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా వెబ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆస్ట్రో సిల్వర్, మాట్ బ్రౌన్, సన్‌సెట్ పీచ్ కలర్ ఆప్షన్లలో ఈ రెండు ఫోన్లూ మార్కెట్లోకి వచ్చాయి.


Also Read: వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా యూజర్లకు గుడ్ న్యూస్ - ‘మెటా AI’ వచ్చేసింది, ఎలా వాడాలో తెలుసా?


ఒప్పో రెన్ 12 ప్రో 5జీ సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ 14.1 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనున్నాయి. ఈ ఫోన్లకి మూడు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌గ్రేడ్స్, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌గ్రేడ్స్ లభించనున్నాయి. వీటిలో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ క్వాడ్ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేలు అందించనున్నారు. వీటి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. డిస్‌ప్లే హెచ్‌డీఆర్10+ ఫీచర్‌ను సపోర్ట్ చేయనుంది. ఒప్పో రెనో 12 ప్రోలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంది. ఒప్పో రెనో 12లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ కోటింగ్‌ను అందించారు.


ఒప్పో రెనో 12 5జీ సిరీస్‌లో ఉన్న రెండు ఫోన్లలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌నే అందించారు. వీటిలో 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.


ఒప్పో రెనో 12 5జీలో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో 50 మెగాపిక్సెల్ లెన్స్ ప్రధాన కెమెరా కాగా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది.


ఒప్పో రెనో 12 5జీ ప్రోలో కూడా వెనకవైపు మూడు కెమెరాలే అందుబాటులో ఉన్నాయి. వీటిలో 50 మెగాపిక్సెల్ సెన్సార్ ప్రధాన కెమెరా కాగా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.


ఏఐ సమ్మరీ, ఏఐ రికార్డ్ సమ్మరీ, ఏఐ క్లియర్ వాయిస్, ఏఐ రైటర్, ఏఐ స్పీక్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఏఐ బెస్ట్ ఫేస్ ఏఐ ఎరేజర్ 2.0 వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా ఫీచర్లు కూడా ఈ ఫోన్‌తో వచ్చాయి. వీటి బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W సూపర్‌వూక్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనున్నాయి. బ్యాటరీ 1 పర్సెంట్ నుంచి 100 పర్సెంట్‌కు కేవలం 46 నిమిషాల్లోనే ఛార్జింగ్ ఎక్కనున్నాయి.



Also Read: 2 జీబీ ప్యాక్ కోసం 200 పెట్టాల్సిందే- ప్రజల జేబులకు జియో, ఎయిర్‌టెల్‌ చిల్లు