Daily Horoscope for 5th October 2024
మేష రాశి
మేష రాశికి ఈ రోజు పని ఒత్తిడి ఉంటుంది. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబానికి అవసరమైన సమయం కేటాయించాలి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో నూతన ప్రణాళికల గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం బావుంటుంది.
వృషభ రాశి
ఈ రాశివారు ఈ రోజు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తు గురించి మీరు కన్న కలలను నెరవేర్చుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటారు. కార్యాలయంలో సహోద్యోగులు మీకు కొన్ని సలహాలు ఇస్తారు. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు.
మిథున రాశి
ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మీ శక్తిని సరైన పనులలో ఉపయోగించాలి. వ్యాపారంలో నూతన ఆస్తికి సంబంధించి లావావేదీలు చేసేవారు ముందుగా అధ్యయనం చేయడం మంచిది. తోబుట్టువుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ఎవరికైనా వివాహానికి అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి
కర్కాటక రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీ ఇంటి పునరుద్ధరణ విషయంలో చాలా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. మీ మాటలు కుటుంబ సభ్యులకు అభ్యంతరకరంగా ఉండవచ్చు. నూతన నిర్ణయాలు తీసుకునేవారు తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. జీవిత భాగస్వామి దగ్గర కొన్ని విషయాలు రహస్యంగా ఉంచాల్సి రావొచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు.
Also Read: ఇంద్రకీలాద్రిపై మూడో రోజు శనివారం అన్నపూర్ణ దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత ఇదే!
సింహ రాశి
తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. విద్యార్థులు నూతన కోర్సులు నేర్చుకునేందకు ఆసక్తి చూపిస్తారు. కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. చాలాకాలం తర్వాత పాత స్నేహితులను కలుస్తారు. ఆరోగ్యం బావుంటుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేముందు మరోసారి ఆలోచించండి. సహోద్యోగులతో జాగ్రత్త..
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ రోజు సంపద పెరుగుతుంది. నూతన ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చేతికి రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. జీవిత భగాస్వామి ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు.
తులా రాశి
ఈ రాశివారు చేయాల్సిన పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. కార్యాలయంలో అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయం బాగానే ఉంటుంది. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. విద్యార్థులు ఇతర విషయాలపై అధిక ఆసక్తి ప్రదర్శించకుండా ఉండాలి. నిరుద్యోగులకు ఇంకొంతకాలం ఎదురుచూపులు తప్పవు.
వృశ్చిక రాశి
ఈ రాశివారు అనుకున్నది ఈరోజు పూర్తిచేయడంతో ఆనందంగా ఉంటారు. విద్యార్థులు మోధో భారం నుంచి ఉపశమనం పొందుతారు. మీరు జీవిత భాగస్వామి నుంచి బహుమతులు పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందడం వల్ల ఓ ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లాల్సి రావొచ్చు.
Also Read: దసరాతో ప్రారంభం..దీపావళితో ముగింపు - 2024 అక్టోబరులో పండుగల జాబితా!
ధనస్సు రాశి
ఈ రోజు ఈ రాశివారికి అనారోగ్య సమస్యలున్నాయి. చెడు అలవాట్ల వల్ల కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడతారు. చాలాకాలం తర్వాత పాత స్నేహితులను కలుస్తారు. సామాజిక రంగాల్లో ఉండేవారికి గౌరవం పెరుగుతుంది. ఇంటి పనుల గురించి కొంత ఆందోళన చెందుతారు. మీ ప్రవర్తనా విధానంలో మార్పు రావాల్సిన సమయం ఇది అని గుర్తించండి.
మకర రాశి
ఈ రాశివారు రోజంతా బిజీగా ఉంటారు. ఉద్యోగులు భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడంలో బిజీగా ఉంటారు. గతంలో చేసిన కొన్ని తప్పులకు ఇప్పుడు బాధపడతారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీపై ఉంటుంది. స్నేహితులకు వాగ్ధానాలు చేసేటప్పుడు ఆలోచించాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి చాలా ఫలవంతమైన రోజు. కొత్త పనిని ప్రారంభించడం మంచిది. కుటుంబ సభ్యులు కూడా మీకు పూర్తిగా మద్దతు ఇస్తారు . ఆర్థిక సంబంధిత కారణాలతో మీ పని ఏదైనా ఆగిపోయినట్లయితే అది ఈ రోజు పూర్తవుతుంది.
మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు అనుకున్న పనులు పూర్తిచేయడంలో అడ్డంకులు ఎదుర్కొంటారు. మీ శత్రువులు మీపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తారు. చట్టపరమైన విషయాల గురించి ఆందోళన చెందుతారు. ఆర్థిక మూలాల్లో తగ్గుదల ఉంటుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తి పెరుగుతుంది.
Also Read: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.