Minister Satyakumar Letter To CM Chandrababu: సీఎం చంద్రబాబుకు (CM Chandrababu) మంత్రి సత్యకుమార్ లేఖ రాశారు. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా (YSR Kadapa District) మార్చాలని కోరారు. జిల్లా పేరును మారుస్తూ గత ప్రభుత్వం గెజిట్ ఇవ్వడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. రాయలసీమలోని కడప జిల్లాకు గొప్ప చారిత్రక నేపథ్యం ఉందని.. అది తెలియకుండానే గత వైసీపీ ప్రభుత్వం కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా మార్చేసిందని లేఖలో పేర్కొన్నారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి కలిగిన 'కడప' పేరును గత ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో వైఎస్ఆర్ జిల్లాగా మార్చేసిందన్నారు. 'గతంలో శాసనసభలో ఇదే విషయాన్ని నేను ప్రస్తావించాను. వైఎస్ సీఎంగా ఉన్న కాలంలో కడప జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం. కాబట్టి చారిత్రక నేపథ్యాన్ని, వైఎస్ సీఎంగా చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లా పేరును 'వైఎస్సార్ కడప' జిల్లాగా మార్చాలి.' అని లేఖలో చంద్రబాబుకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
Minister Satyakumar: 'వైఎస్ఆర్ జిల్లా పేరు మార్చండి' - సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ
Ganesh Guptha | 04 Oct 2024 08:17 PM (IST)
Andhra News: వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ రాశారు. చారిత్రక నేపథ్యం తెలియకుండానే గత ప్రభుత్వం పేరు మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ లేఖ