Top 10 Headlines Today


 


బండారుకు బెయిల్


తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. రూ.25 వేల పూచీకత్తుతో మొబైల్‌ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి ఆర్‌కే రోజాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై గుంటూరు జిల్లా ఆరండల్ పేట్, నగర పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.  సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక కేసు, మంత్రి ఆర్‌కే రోజాపై వ్యాఖ్యలు చేసినందుకు మరో కేసు నమోదు చేశారు పోలీసులు. 400/2023, 41 (A),  41(B),153, 294, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మజ్లిస్‌ గేమ్‌


తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రేపో మాపో రాబోతోంది. ఈసారి తెలంగాణ గడ్డపై గద్దెనెక్కేదెవరు అన్న ఆసక్తి రాజకీయాల్లో తారాస్థాయికి  చేరుతోంది. మళ్లీ మేమే అని బీఆర్ఎస్, ఈసారి మా వంతు అని కాంగ్రెస్సు.... మేం లేమా అని బీజేపీ కలబడుతున్నాయి. ఇవన్నీ తెలంగాణ రణక్షేత్రంలో గట్టిగా తలబడుతుంటే.. ఒక పార్టీ మాత్రం చాపకింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది. తాము కింగ్ అవలేం కానీ.. కింగ్ మేకర్ కావొచ్చని అనుకుంటోంది.  తెలంగాణ హంగ్ వస్తే.. తమకు మంచి డిమాండ్ ఉంటుందని ఆ పార్టీ అనుకుంటోంది. ఎందుకంటే ఎందుకంటే ఏది ఏం జరిగినా ఆ పార్టీ కచ్చితంగా గెలిచే సీట్లు కొన్ని ఉన్నాయి. అదే మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్.. MIM. తెలంగాణలో హంగ్ రావాలని.. వస్తే ఇక తమదే హంగామా అని ఆ పార్టీ అంచనాలు కడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


వారసులకు గ్రీన్ సిగ్నల్


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారసుల ఎంట్రీ ఉత్కంఠ రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో వారసులను దించాలని కీలక నేతలు అంతా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు తమ వారసులను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇంకొందరైతే వేదికలపై ప్రకటించేస్తున్నారు కూడా. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేమని తమ వారసులను బరిలోకి దించేందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా వేడుకుంటున్నారు. ఇటీవలి కాలం వరకూ సీనియర్లే పోటీ చేయాలని జగన్ ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఇప్పుడు క్రమంగా మనసు మార్చుకుంటున్నారని పలువురికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని చెబుతున్నారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూలును విడుదల 


తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన షెడ్యూలును విద్యాశాఖ విడుదల చేసింది. రెండు మల్టీజోన్లలో పదోన్నతులు పక్కనపెట్టి.. కేవలం బదిలీలు మాత్రమే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం (అక్టోబరు 3న) బదిలీలకు సంబంధించిన షెడ్యూలును ప్రకటించిందిద. రంగారెడ్డి జిల్లాల్లో సీనియార్టీపై, పదోన్నతులకు టెట్‌ అర్హత కేసులు, పదోన్నతులపై స్టేలు ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 3 నుంచి 8 వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


రోజా కన్నీళ్లు


టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి ఆర్‌కే రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. తిరుపతిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఆర్‌కే రోజా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘టీడీపీలో నచ్చక బయటకొస్తే నన్ను టార్చర్‌ చేస్తున్నారు. లోకేష్‌ నీ తల్లి గురించి మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా?,  నీకు ఫ్యామిలీ లేదా.. నీ ఫ్యామిలీని అంటే ఊరుకుంటావా?, దేశంలో మహిళలను గౌరవించండి అని చెబుతారు. మాజీ మంత్రి బండారు నన్ను నీచంగా, హేయంగా మాట్లాడారు. ఆయన చేసిన వాఖ్యలు పట్ల రాష్ట్ర మహిళలు చెప్పుతో కొడతారు’ అని అన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మోదీకి కేటీఆర్‌ కౌంటర్


ఎన్డీఏలో కలవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తమను కోరారని, అయితే అందుకు తాము ఒప్పుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించాయి. నిజామాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధానమంత్రి జూమ్లాలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి... ప్రధానమంత్రి అబద్ధాల ప్రచారకర్త అన్నారు. ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు అని, కేసీఆర్ ఒక ఫైటర్, ఆయన నరేంద్ర మోదీ లాంటి చీటర్ తో కలిసి పని చేయరు అని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పవర్ అస్త్రా కోసం పోటీ


బిగ్ బాస్ సీజన్ 7లో ఇప్పటివరకు కంటెస్టెంట్స్ మధ్య పవర్ అస్త్రా కోసం పోటీ జరిగింది. ఇక బిగ్ బాస్‌లో పవర్ అస్త్రా అనే అంకం ముగిసినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు పవర్ అస్త్రాను గెలుచుకున్న సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ సైతం తమ అస్త్రాలను తిరిగి బిగ్ బాస్‌కు పంపించేశారు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఈ ముగ్గురు పవర్ అస్త్రాలను వెనక్కి ఇచ్చేయడంతో పాటు బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చారు. అదే కెప్టెన్సీ టాస్క్. బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి కెప్టెన్సీ టాస్క్‌ గురించి బిగ్ బాస్ బయటపెట్టారు. దీంతో పవర్ అస్త్రా పోయి.. కెప్టెన్సీ టాస్క్ వచ్చింది అనుకున్నారు ప్రేక్షకులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


అప్పుడు అలా ఇప్పుడు అలా


చాలావరకు నటీనటులు ముందుగా మోడల్‌గా తమ కెరీర్‌ను ప్రారంభించిన తర్వాతే.. వెండితెరపై హీరోహీరోయిన్లుగా మారుతారు. కొందరు ముందుగా మోడలింగ్, ఆ తర్వాత బుల్లితెర, ఆ తర్వాత వెండితెర అనే ప్రక్రియను ఫాలో అవుతారు.  ఇప్పుడు సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత కూడా దాదాపుగా ఇదే ప్రక్రియను ఫాలో అయ్యినట్టు తెలుస్తోంది. ముందుగా తన కాలేజ్ సమయంలోనే మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది సమంత. ఆ తర్వాత పలు యాడ్స్‌లో నటించింది. అదే సమయంలో తనకు ఒక తమిళ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం రావడంతో తన కెరీర్ టర్న్ అయిపోయింది. తాజాగా సమంత.. తన కెరీర్ మొదట్లో యాడ్స్ చేస్తున్న సమయంలో ఎలా ఉండేదో ఒక వీడియో వైరల్ అయ్యింది. దీంతో సామ్.. అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది అని పోల్చి చూడడం మొదలుపెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పతకాల వేట


చైనా వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 3న సాయంత్రం జరిగిన రెండు ఈవెంట్లలో భారత్ కు అమ్మాయిలు బంగారు పతకాలు అందించారు. జావెలిన్ త్రో విభాగంలో భారత్ కు స్వర్ణం లభించింది. అన్ను రాణి జావెలిన్ త్రో ఫైనల్లో అత్యధిక దూరం బల్లెం విసిరి స్వర్ణం కైవసం చేసుకుంది. 62.92 మీటర్లు విసిరి అగ్ర స్థానంలో నిలిచి త్రివర్ణ పతాకం రెపరెపలాడించింది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


30-40 ఏళ్ల వయస్సులో పాటించాల్సిన బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటెజీ


పెట్టుబడి పెట్టే ప్రతి వ్యక్తికి సాధారణంగా కొన్ని టార్గెట్స్‌ ఉంటాయి. తన జీవితంలోని ప్రతి ముఖ్యమైన/ఖర్చుతో కూడుకున్న సందర్భంలో తన పెట్టుబడులు ఉపయోగపడాలని కోరుకుంటాడు. ప్రతి వ్యక్తి వయస్సును బట్టి పెట్టుబడి వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. 30 ఏళ్ల లోపు ఉన్నప్పుడు ఒకలా, 30-40 ఏళ్ల వయస్సులో మరోలా, పదవీ విరమణకు దగ్గరగా ఉన్నప్పుడు ఇంకో విధంగా స్ట్రాటెజీస్‌ మారుతుంటాయి. తక్కువ రిస్క్‌తో ఎక్కువ రిటర్న్‌ తీసుకోవాలంటే, పోర్ట్‌ఫోలియోలో మార్పులు ఉండాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి