Bandaru Satyanarayana: తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. రూ.25 వేల పూచీకత్తుతో మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి ఆర్‌కే రోజాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై గుంటూరు జిల్లా ఆరండల్ పేట్, నగర పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక కేసు, మంత్రి ఆర్‌కే రోజాపై వ్యాఖ్యలు చేసినందుకు మరో కేసు నమోదు చేశారు పోలీసులు. 400/2023, 41 (A), 41(B),153, 294, 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
టీడీపీ సీనియర్ నేత బండారు వ్యాఖ్యలపై ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు పోలీసులు గుంటూరు నుంచి మంగళవారం తెల్లవారుజామున అనకాపల్లి జిల్లా వెన్నెలపాలం వెళ్లారు. చాలా సేపు నోటీసులు తీసుకోకుండా బండారు తలుపు గడియ పెట్టుకున్నారు. ఎట్టకేలకు తలుపులు బ్రేక్ చేసి బండారును ఆయన స్వగృహంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బండారును గుంటూరు తీసుకెళ్లారు. ఆసుపత్రి వద్ద లాయర్లను అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. వైద్యులు ఆయనకు వైద్యపరీక్షలు చేశారు. బీపీ ఎక్కువ ఉండటంతో బండారును ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని వైద్యులు సూచించారు. సీఎం జగన్, మంత్రి రోజా మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుంటూరులో రెండు కేసులు నమోదు చేశారు.
హైకోర్టును ఆశ్రయించిన బండారు
బండారు సత్యనారాయణ లాయర్ హైకోర్టును ఆశ్రయించారు. బండారు సత్యనారాయణను అక్రమంగా నిర్బంధించారని పిటిషన్లో పేర్కొన్నారు. రెండు కేసుల్లో 41ఏ నోటీసులు ఇచ్చారని, 41ఏ నోటీసులు ఇచ్చి ఎలా అరెస్టు చేస్తారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. తాము నోటీసులు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలీసుల విధానంపై వివరాలతో కౌంటర్ వేయాలని పిటిషనర్‌కు ఆదేశించారు. విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.
రోజా బ్లూ ఫిల్మ్‌లు ఉన్నాయని బండారు ఆరోపణలు
నందమూరి, నారా కుటుంబాలపై వైసీపీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రెండు రోజుల కిందట మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రోజాపై ఘాటు విమర్శలు చేశారు. ‘ఎన్టీఆర్ కుటుంబంపై, భువనేశ్వరి, బ్రాహ్మణీలపై మాట్లాడే అర్హత నీకు లేదు. రోజా... నువ్వు సినిమాల్లో ఎలా నటించావో నాకు తెలుసు. నీ చరిత్ర ఎవరికి తెలియదు. నీ బాగోతం బయటపెడితే నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటారు. ఇవాళ నీతి సూత్రాలు, పతివ్రత కామెంట్స్ చేస్తోందని మండిపడ్డారు. తమ వద్ద నీ పూర్తి బండారం ఉందన్నారు.
రోజా గతంలో బ్లూ ఫిల్ములలో నటించిందని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఆనాడు మిర్యాలగూడలో జరిగిన ఎన్నికల ప్రచారానికి వచ్చిన సంగతి మరిచి పోయావా అని ప్రశ్నించారు. ఎలక్షన్స్ కోసం వచ్చి ఎవరి వద్ద పడుకున్నావో, ఎన్ని లాడ్జీలు తిరిగావో తమకు తెలుసని అన్నారు. అన్ని వివరాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే. ఈ కామెంట్లు వైరల్‌గా మారడంతో.. మహిళా కమిషన్ స్పందించింది.