Ram Charan: కొత్త ఫ్రెండ్‌తో రామ్ చరణ్ ఫోటో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్

రామ్ చరణ్ తన కొత్త ఫ్రెండ్ బ్లేజ్‌తో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Continues below advertisement

సినీ సెలబ్రిటీల్లో చాలామంది యానిమల్ లవర్స్ అయ్యింటారు. అందుకే చాలామంది సెలబ్రిటీల దగ్గర కేవలం పెట్ డాగ్స్ మాత్రమే కాదు.. పిల్లులు, గుర్రాలు, కుందేళ్లు.. ఇలా చాలా రకాల జంతువులు కూడా ఉంటాయి. అలాగే రామ్ చరణ్ దగ్గర కూడా ఒక పెట్ డాగ్ ఉంది. అదే రైమ్. రైమ్‌ను ఒక కుటుంబ సభ్యుడిగా చూసుకుంటుంది మెగా ఫ్యామిలీ. అంతే కాకుండా ‘మగధీర’ సినిమా తర్వాత కొన్ని గుర్రాలను కూడా పెట్స్‌గా తెచ్చిపెంచుకోవడం మొదలుపెట్టాడు చరణ్. తాజాగా తనకు మరో కొత్త ఫ్రెండ్ దొరికిందని రామ్ చరణ్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

Continues below advertisement

బ్లేజ్, నా కొత్త ఫ్రెండ్

రామ్ చరణ్ రెండో సినిమా ‘మగధీర’ నుంచి మొదలుపెడితే.. ఆ తర్వాత తను నటించిన దాదాపు అన్ని సినిమాల్లో కచ్చితంగా ఒక గుర్రపు సీక్వెన్స్ ఉంటుంది. మొదట్లో తనకు గుర్రపు స్వారీ భయమేసినా.. మెల్లగా అలవాటు అయిపోయిందని, అంతే కాకుండా గుర్రాలంటే తనకు ఇష్టం పెరిగిందని స్వయంగా రామ్ చరణ్ బయటపెట్టారు. అందుకే గుర్రాలను పెంచుకోవడం, గుర్రపు స్వారీ చేయడం రామ్ చరణ్‌కు ఫేవరెట్ హాబీలుగా మారాయి. తాజాగా ‘బ్లేజ్, నా కొత్త ఫ్రెండ్’ అంటూ ఒక గుర్రంతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు చరణ్. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ లేదు

సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు శంకర్.. ఓవైపు ‘భారతీయుడు 2’, మరోవైపు ‘గేమ్ ఛేంజర్’ రెండు షూటింగ్స్‌ను ఒకేసారి మ్యానేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడినట్టు అనిపిస్తోంది. ఇదే సమయంలో తన కూతురు క్లిన్ కారాతో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం చరణ్‌కు దక్కింది. ‘గేమ్ ఛేంజర్’ కోసం కియారా అద్వానీతో రెండోసారి జతకట్టాడు చరణ్. ఇప్పటికే వీరిద్దరూ కలిసి ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కలిసి నటించగా.. ఈ మూవీ డిసాస్టర్‌గా నిలిచింది. కానీ ‘గేమ్ ఛేంజర్’తో మాత్రం ఈ పెయిర్ మాత్రమే కాదు.. శంకర కూడా కమ్ బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాడు.

లైన్‌లో రెండు సినిమాలు

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఏ సినిమాలో కనిపిస్తారా అని వారి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఆ ఒక్క సినిమా రామ్ చరణ్‌ను గ్లోబల్ స్టార్‌ను చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వెంటనే ‘గేమ్ ఛేంజర్’ను అనౌన్స్ చేశాడు చరణ్. షూటింగ్ కూడా జరుగుతుంది అంటూ స్పాట్ నుంచి ఫోటోలు, వీడియోలు కూడా విడుదల అయ్యాయి. కానీ ఇప్పుడు ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఫ్యాన్స్ అంతా ఆగ్రహంలో ఉన్నారు. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబుతో మూవీ ప్లానింగ్‌లో ఉన్నాడు చరణ్. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయిపోయాయి. కానీ రామ్ చరణ్ రెండు అప్‌కమింగ్ సినిమాలపై పూర్తిస్థాయిలో కరెక్ట్ అప్డేట్ లేదు.

Also Read: మళ్ళీ కలవబోతున్న చైతూ, సమంత - ఇదిగో ప్రూఫ్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement