తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన షెడ్యూలును విద్యాశాఖ విడుదల చేసింది. రెండు మల్టీజోన్లలో పదోన్నతులు పక్కనపెట్టి.. కేవలం బదిలీలు మాత్రమే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం (అక్టోబరు 3న) బదిలీలకు సంబంధించిన షెడ్యూలును ప్రకటించిందిద. రంగారెడ్డి జిల్లాల్లో సీనియార్టీపై, పదోన్నతులకు టెట్‌ అర్హత కేసులు, పదోన్నతులపై స్టేలు ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 3 నుంచి 8 వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది.


మల్టీజోన్‌-1, 2 పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌, మల్టీజోన్‌-2 పరిధిలోని జిల్లా పరిషత్‌ పాఠశాలల్లోని స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ టీచర్ల బదిలీలకు అవకాశం కల్పించింది. అక్టోబరు 4 వరకు అప్పీలు, ర్యాంకుల దిద్దుబాటు, ఖాళీల సవరణల అప్‌డేట్‌కు అధికారులు అవకాశం కల్పించగా.. అక్టోబరు 5న తుది సీనియారిటీ జాబితా ప్రకటించనున్నారు.


అక్టోబరు 6, 7 తేదీల్లో బదిలీలకు సంబంధించిన వెబ్‌‌ఆప్షన్‌కు అవకాశం ఇచ్చారు. అక్టోబరు 8న వెబ్‌‌ఆప్షన్ల సైతం ఎడిట్‌ చేసుకునే వీలు కల్పించింది. వెబ్‌ ఆప్షన్లు ఎంచుకున్న తర్వాత ఖాళీల పాయింట్లు, స్పౌజ్‌ పాయింట్లు ఎలాంటి మార్పులుండవని అధికారులు స్పష్టం చేశారు.


ప్రకటించిన షెడ్యూలు ఇలా..


➥ అక్టోబరు 3, 4 తేదీల్లో: అప్పీలు, ర్యాంకుల దిద్దుబాటు, ఖాళీల సవరణల అప్‌డేట్‌‌.


➥ అక్టోబరు 5న: తుది సీనియారిటీ జాబితా ప్రకటన.


➥ అక్టోబరు 6, 7 తేదీల్లో: వెబ్‌‌ఆప్షన్లకు అవకాశం.


➥ అక్టోబరు 8: వెబ్‌ఆప్షన్లలో మార్పులు


Website 


ALSO READ:


ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 1,038 పారామెడికల్ స్టాఫ్ పోస్టులు, తెలంగాణ రీజియన్‌లో ఎన్ని పోస్టులంటే?
న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాలు/ఆసుపత్రుల్లో 1038 పారామెడికల్‌ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రీజియన్‌లో మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా అర్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్‌ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 30 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌‌లో 48 ఖాళీలు
న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎన్‌బీఈఎంస్‌) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు కొనసాగనుంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష/ స్కిల్‌టెస్ట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


వ్యాప్‌కోస్‌ లిమిటెడ్‌లో 140 కంట్రోల్‌ ఇంజినీర్‌ ఖాళీలు, అర్హతలివే!
గురుగ్రామ్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వ్యాప్‌కోస్‌ లిమిటెడ్ సీనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్‌, ఫీల్డ్‌ క్వాలిటీ అసూరెన్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగాల్లో కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. పర్సనల్‌ ఇంటర్వ్యూ/ స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..