Top 10 Headlines Today: 


 


హామీల గళం


యువగళం పాదయాత్ర చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అద్దంకిలో కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే అద్దంకిని తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న లోకేష్ ఆదివారం అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ప్రజలు తమకు మద్దతిచ్చి టీడీపీని గెలిపిస్తే.. బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి మున్సిపాలిటీని ప్రకాశం జిల్లాలో కలుపుతామని కీలక హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


రైలులో కాల్పులు


మహారాష్ట్రలోని పాల్ఘర్ లో జైపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో భారీ కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు గాయపడగా.. మృతుల్లో ముగ్గురు, ఓ ఏఎస్సై, ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


తెలంగాణలో కార్మిక భీమా


రైతు భీమా తరహాలో త్వరలోనే కార్మిక భీమా అందిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేటలో కార్మిక భవన్ కు ఎకరం స్థలం కేటాయించారు. సిద్దిపేటలో భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కార్మికుడి కార్డు రెన్యూవల్ పదేళ్లకు పెంచుతున్నామని చెప్పారు. కార్మి భీమా మొత్తాన్ని లక్షన్నర నుంచి రూ.3 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ప్రతీ కార్మికుడి డిజిటల్ కార్డుకయ్యే ఖర్చు బాధ్యత తమదేనని, 5 లక్షల రూపాయల వరకూ ఉచితంగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలు కార్మికులు అందిస్తామని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ అధ్యక్షుడిగా దిల్ రాజు 


తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌(Telugu Film Chamber Of Commerce) ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా సాగాయి. అయితే, ఫలితాల్లో మాత్రం చివరి వరకు ఉత్కంఠత నెలకొంది. నిర్మాత దిల్ రాజు ప్యానెల్‌లో అత్యధిక ఓట్లతో లీడింగులో ఉండటంతో వారే విజేత అని భావించారు. కానీ, డిస్ట్రిబ్యూటర్స్.. ఎగ్జిక్యూటివ్ సెక్టార్‌లలో ఓట్లు ఫలితాలు టై అయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


వాట్సాప్ సలహా


భారతదేశంలో 500 మిలియన్లకు పైగా ప్రజలు వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. యాప్‌ ఉపయోగించే యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీని మెయింటెయిన్ చేయడానికి, కంపెనీ దానిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ కొత్త సేఫ్టీ టూల్స్ ఫీచర్‌పై పని చేస్తోందని సమాచారం. అంటే ఒకవేళ మీకు తెలియని నంబర్ నుంచి మెసేజ్ వస్తే తర్వాత ఏమి చేయాలో మీకు సలహా ఇస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఆగస్టులో కార్ల మేళా


2023 ఆగస్టులో చాలా కొత్త కార్లు విడుదల కానున్నాయి. వీటిలో ఎక్కువ భాగం లగ్జరీ సెగ్మెంట్ మోడల్స్ ఉన్నాయి. టాటా మోటార్స్ సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌తో పంచ్‌ను తీసుకువస్తుంది. మారుతి సుజుకి ఎర్టిగా ఆధారంగా టయోటా కొత్త రూమియన్ ఎంపీవీని విడుదల చేస్తుంది. లగ్జరీ సెగ్మెంట్‌లో ఉండగా మెర్సిడెస్-బెంజ్, వోల్వో, ఆడి కూడా తమ కొత్త మోడళ్లను విడుదల చేయనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మరోసారి విదేశాల్లో ఐపీఎల్‌


క్రికెట్ అభిమానులకు ఒక పెద్ద వార్త. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వచ్చే సంవత్సరం జరగనుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఐపీఎల్ 2024ని విదేశాల్లో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికలే. అయితే దీనికి సంబంధించి బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కొత్త వివాదం


ఐఐటీ బాంబేలోని హాస్టల్‌లో వివాదం తలెత్తింది. క్యాంటీన్‌లో ఓ విద్యార్థి నాన్‌ వెజ్ తినడంపై వెజిటేరియన్స్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.  దీనిపై మాటమాట పెరిగి పెద్ద వివాదానికి దారి తీసింది. నాన్‌ వెజిటేరియన్స్‌పై వివక్ష చూపిస్తున్నారని కొంతమంది విద్యార్థులు గొడవకు దిగారు. ఫలితంగా...వెజిటేరియన్స్ అంతా కలిసి క్యాంటీన్‌ ముందు పోస్టర్‌లు అంటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఈ లక్షణాలతో జాగ్రత్త


చాలామంది ఏదైనా ఆరోగ్య సమస్య కనిపిస్తే వైద్యులను కలవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ గుండె సమస్యల విషయంలో అలాంటి అజాగ్రత్త అనర్ధానికి దారితీస్తుంది. గుండెకు సంబంధించి కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వెంటనే కార్డియాలజిస్టును కలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గుండెకు వైద్య సహాయం కావాలనిపిస్తే అది కొన్ని సూచనలను మనకు తెలియజేస్తుంది. ఆ సూచనలను తేలిగ్గా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, గుండె వైఫల్యం వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చెప్పిన కొన్ని లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే ఓసారి గుండె వైద్యులను సంప్రదించి, గుండెను చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం రెండుసార్లు గుండెను తనిఖీ చేయించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మన శరీరంలోని ప్రధాన అవయవాల్లో గుండె కూడా ఒకటి. దీనికి ఏమైనా అయితే ప్రాణానికే సమస్య. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రెడీ


బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు సంబంధించి కొత్త ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ఈ సీజన్‌కు సంబంధించిన ఒక చిన్న టీజ్‌ను కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్ల కంటే ఈ సీజన్ భిన్నంగా ఉండనుందనే హింట్‌ను ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి