మహారాష్ట్రలోని పాల్ఘర్ లో జైపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో భారీ కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు గాయపడగా.. మృతుల్లో ముగ్గురు, ఓ ఏఎస్సై, ఇద్దరు ప్రయాణికులు ఉన్నారు.






ఈ రోజు (జులై 31) ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పాల్ఘర్- ముంబై మధ్య దహిసర్‌లో ఈ కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన పోలీసు కానిస్టేబుల్ మీరా రోడ్డు సమీపంలో పట్టుబడ్డాడు. కానిస్టేబుల్ మానసిక ఒత్తిడికి గురైనట్లు చెబుతున్నారు.


కాల్పుల అనంతరం రైలు నుంచి దూకిన సైనికుడు
పాల్ఘర్ స్టేషన్ దాటిన తర్వాత కదులుతున్న జైపూర్ ఎక్స్ప్రెస్ రైలులో ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఓ ఆర్పీఎఫ్ ఏఎస్ఐతో పాటు మరో ముగ్గురు ప్రయాణికులను కాల్చి చంపాడు. ఆ తర్వాత దహిసర్ స్టేషన్ సమీపంలో రైలు నుంచి కిందకు దూకాడు. నిందితుడైన కానిస్టేబుల్ ను తుపాకీతో పాటు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రైల్వే సురక్ష కల్యాణ నిధి కింద రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. దహన సంస్కారాల ఖర్చులకు రూ.20 వేలు అందించనున్నారు. ఈ కాల్పులపై వెస్టర్న్ రైల్వే అధికారులు స్పందించారు. ఇలా జరగడం దురదృష్టకరం అని అన్నారు. 


"ముంబయి జైపూర్ ఎక్స్‌ప్రెస్‌లో దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఓ RPF పోలీస్ తన తోటి పోలీసులపై కాల్పులు జరిపాడు. ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. తన వద్ద అధికారికంగా ఉన్న తుపాకీతో కాల్పులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేశాం. ఎందుకు కాల్పులు జరిపాడన్నది ఇప్పటి వరకూ తెలియలేదు. దీనిపై విచారణ కొనసాగిస్తున్నాం"


- వెస్టర్న్ రైల్వే అధికారి